Irumudi Review: ఇరుముడి మూవీ రివ్యూ... రవితేజకి ఎట్టకేలకు హిట్‌ పడిందా?

Published : Aug 21, 2026, 12:01 PM IST

మాస్‌ మహారాజా రవితేజ తన ఇమేజ్‌ని పక్కన పెట్టిన చేసిన మూవీ `ఇరుముడి`. అయ్యప్పస్వామి భక్తుల కథా నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.

PREV
16
ఇరుముడి మూవీ రివ్యూ

మాస్‌ మహారాజా రవితేజ హీరోగా రూపొందిన మూవీ `ఇరుముడి`. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్‌ హీరోయిన్‌గా నటించింది. సాయికుమార్‌, బేబీ నక్షత్ర, రమేష్‌ ఇందిరా, స్వసికా విజయ్‌, మీసాలా లక్ష్మణ్‌, అజయ్‌ ఘోష్‌ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై రవిశంకర్‌, నవీన్‌ యెర్నేని నిర్మించారు. ఈ చిత్రం నేడు శుక్రవారం(ఆగస్ట్ 21) న విడుదలైంది. వరుస పరాజయాల్లో ఉన్న రవితేజకి హిట్‌ పడిందా? సినిమా ఎలా ఉందనేది రివ్యూలో తెలుసుకుందాం.

26
ఇరుముడి మూవీ కథ

పొల్లూరు విలేజ్‌లో త్రినాథ్‌(రవితేజ), తన భార్య కావేరి(ప్రియా భవానీ శంకర్‌), కూతురు మణియమ్మ(బేబీ నక్షత్ర)తో హ్యాపీ లైఫ్‌ని లీడ్‌ చేస్తుంటాడు. ఆయనకు ఆటో ఉంటుంది. అరటితోటని నిర్వహిస్తున్నారు. త్రినాథ్‌ ప్రతిఏడాది అయ్యప్ప మాల వేస్తుంటాడు. ఆ సమయంలో నిబద్ధతతో ఉంటాడు. మందుకు దూరంగా ఉంటాడు. కానీ మాల అయిపోయిందంటే వరుసగా తాగుతూనే ఉంటాడు. తనకు కూతురు అంటే ప్రాణం. ఆ దేవుడే కూతురు రూపంలో వచ్చాడని భావిస్తాడు. గారాభంగా పెంచుతాడు. తను ఊర్లో ఏం జరిగినా చూసింది చూసినట్టు చెబుతుంది. ఆ ఊరికి బస్‌ లేకపోవడంతో ఎమ్మెల్యే(రమేష్‌ ఇందిరా).. గురుస్వామి(సాయికుమార్‌) రిక్వెస్ట్ మేరకు బస్‌ వేయిస్తాడు. దీంతో ఊర్లో అమ్మాయిలు వేరే ఊరికి వెళ్లి హైస్కూల్‌ చదువుకుంటారు. అయితే సడెన్‌గా ఒక అమ్మాయి చనిపోతుంది. ఆ తర్వాత బస్‌లో అమ్మాయిలను కొందరు కుర్రాళ్ల వేధించడంతో మణియమ్మ చెబుతుంది. వారిని చితకబాదుతాడు త్రినాథ్‌. గురుస్వామి కూతురు గాయత్రి పదో క్లాస్‌ చదువుతుంది. ఆమెకి మెరిట్‌ స్టూడెంట్‌ అని టీచర్‌ స్పెషల్‌ క్లాస్‌లు చెబుతుంది. అంతకు ముందే ఆ టీచర్‌ ఒక అమ్మాయిని చితకబాదినందుకు ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటుంది. ఆమె మళ్లీ రావడంతో స్టూడెంట్స్ భయపడుతుంటారు. గాయత్రి కూడా భయపడుతుంది. ఎక్స్ ట్రా క్లాస్‌ లు అని గాయత్రిని ఇంటికి పిలిపించుకుంటుంది. మరి ఇంటికి పిలిపించి ఆ టీచర్‌ ఏం చేసింది? టీచర్‌ని చూసి ఇతర అమ్మాయిలు ఎందుకు స్కూల్‌ మానేశారు. గాయత్రి రోజూ ఎందుకు టెన్షన్‌ పడుతుంది? ఎప్పుడూ నవ్వుతూ కనిపించే ఎమ్మెల్యేలోని మరో రూపం ఏంటి? గాయత్రికి సంబంధించి, టీచర్‌కి సంబంధించి, ఎమ్మెల్యేకి సంబంధించి మణియమ్మ చూసిన నిజం ఏంటి? ఆ విషయాన్ని తండ్రి త్రినాథ్‌కి చెప్పిందా? గురుస్వామి పాత్రలోని ట్విస్ట్ ఏంటి? ఆ తర్వాత ఎలాంటి ఆసక్తికర, భయానక సంఘటనలు చోటు చేసుకున్నాయి? కథ ఎలాంటి మలుపులు తీసుకుందనేది మిగిలిన కథ.

36
ఇరుముడి మూవీ ఎలా ఉందంటే?

రవితేజ సినిమా అంటే మాస్‌, కామెడీ, రొమాన్స్, మంచి పాటలు, డాన్సులు, అదిరిపోయే యాక్షన్‌ సీన్లు ఉంటాయి. చాలా కాలంగా ఇలాంటి సినిమాలు చేస్తూ వస్తున్నారు. కానీ అవి బాక్సాఫీసు వద్ద బోల్తా కొడుతున్నాయి. ఈ క్రమంలో తాను రూట్‌ మార్చి చేసిన మూవీ `ఇరుముడి`. అయ్యప్ప స్వామి భక్తుల నేపథ్యంలో ఇది సాగుతుంది. ముఖ్యంగా తండ్రీ కూతురు మధ్య బాండింగ్‌,, ఎమోషన్స్ ని ఆవిష్కరించే మూవీ ఇది. సినిమాలో రవితేజ కనిపించరు, త్రినాథ్‌ మాత్రమే కనిపిస్తాడు. అంతగా పాత్రలో ఒదిగిపోయి నటించాడు. ఆకట్టుకున్నాడు. సినిమా ప్రారంభంలో అయ్యప్పస్వామి మాల ధరించడం, వాళ్లు చేసే పూజలు, కూతురుతో రవితేజకి ఉన్న బాండింగ్‌ని ఆవిష్కరించారు. దాన్ని బాగా ఎస్టాబ్లిష్‌ చేశారు. సెంటిమెంట్‌, ఎమోషనల్‌గా కనెక్ట్ చేయడంలో దర్శకుడు శివ నిర్వాణ సక్సెస్‌ అయ్యారు. అదే సమయంలో ఊర్లో జరిగే గొడవలు, అమ్మాయిలకు ఏమైనా జరిగితే, వారిని ఎవరైనా అల్లరి చేస్తే త్రినాథ్‌ రియాక్ట్ అయిన తీరుని, అమ్మాయిలపై తనకున్న ప్రేమని ఆవిష్కరించారు. ఆయా సీన్లు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఎమోషనల్‌గానూ ఉన్నాయి. దీనికితోడు భక్తిరస అంశాలు కనెక్టింగ్‌గా ఉంటాయి. సినిమా సీరియస్‌గా సాగుతున్నా, మధ్య మధ్యలో రవితేజ మార్క్ ఫన్‌ కూడా ఉంటుంది. తాగే విషయంలో కొంత కామెడీని జోడించారు. మరోవైపు కూతురుకి ఏ బాధా రానివ్వకుండా, జాగ్రత్తగా చూసుకునే విషయంలో తండ్రికూతురు మధ్య ఉన్న కెమిస్ట్రీని బలంగా చూపించారు. దీనికితోడు మధ్య మధ్యలో కొన్ని థ్రిల్లింగ్‌ అంశాలుంటాయి. గంజాయి మత్తులో కొందరు కుర్రాళ్లు చేసే ఎదవ పనులు, టీచర్‌ ప్రవర్తన, ఎమ్మెల్యే నవ్వుల్లో ఊహించని సస్పెన్స్ ని క్రియేట్‌ చేశారు. పారలల్‌గా దాన్ని రన్‌ చేశారు. వీళ్ల ఊరికి బస్‌ వచ్చినప్పట్నుంచి అనేక సస్పెన్స్ అంశాలు చోటు చేసుకుంటాయి. అవి ఎంగేజ్‌ చేస్తాయి. ఏం జరగబోతుందనే క్యూరియాసిటీని క్రియేట్‌ చేస్తుంటాయి. అయితే అంతా ఊహించేది ఒకటి, అక్కడ జరుగుతున్నది మరోటి. ఆ సస్పెన్స్ ని చివరి వరకు మెయింటేన్‌ చేశారు. క్లైమాక్స్ మాత్రం కొంత రెగ్యూలర్‌గానే ఉంది. పెద్దగా వాహ్‌ ఫ్యాక్టర్స్ ఏం లేదు. కాకపోతే సినిమా మొత్తం శివ నిర్వాణ మార్క్ ఎమోషన్స్, ఇంటెన్సిటితో రన్‌ చేశారు. అవి కొత్తగా ఉంటాయి. ఆకట్టుకుంటాయి. ఆడియెన్స్ ని ఎంగేజ్‌ చేస్తాయి. కొన్ని సీన్ల వరకు సస్పెన్స్ ని మెయింటేన్‌ చేయగలిగారు, ఆడియెన్స్ ని డైవర్ట్ చేశారు, కానీ ఓవరాల్‌గా మాత్రం ఊహించేలా ఉండటం మైనస్‌గా చెప్పొచ్చు. కొన్ని ట్విస్ట్ లు కూడా పెద్దగా పేలలేదు. అంతగా వర్కౌట్‌ కాలేదు. ఎమోషనల్‌ సీన్లు మాత్రం అదిరిపోయాయి. ఉత్కంఠకు గురి చేసే సీన్లు బాగున్నాయి. క్లైమాక్స్ లో రవితేజ రియాక్షన్‌ ఊహించేలా ఉంది. ఫినిషింగ్‌ని బాగా ఎమోషనల్‌గా ప్లాన్‌ చేశారు, ఆ సీన్లు అంతగా వర్కౌట్‌ కాలేదు. రెగ్యూలర్‌ ఫీలింగ్‌ ని తెప్పిస్తాయి. డ్రామా సినిమాకి హైలైట్‌గా నిలుస్తుంది. అమ్మాయిలను ధైర్యంగా పెంచాలనే సందేశం బాగుంది.

46
ఇరుముడి మూవీలో ఆర్టిస్ట్ లు ఎలా చేశారంటే?

త్రినాథ్‌ పాత్రలో రవితేజ ఒదిగిపోయి చేశాడు. పాత్రలో జీవించాడు. ఎక్కడా రవితేజ కనిపించడు అనేంతగా ఆయన చేయడం విశేషం. పూర్తిగా పాత్రకి, దర్శకుడికి బ్లెండ్‌ అయి చేశాడు. చాలా బాగా నటించాడు. అదే సమయంలో బేబీ నక్షత్ర కూడా అంతే బాగా చేసింది. ఫాదర్‌ సెంటిమెంట్‌తో మెప్పించింది. వీరిద్దరి బాండింగ్‌ సినిమాకి హైలైట్‌గా నిలుస్తుంది. సెంటిమెంట్‌ ఎమోషనల్‌ సీన్లలో రవితేజ వాహ్‌ అనిపించాడు. ఇక ఎమ్మెల్యేగా రమేష్‌ ఇందిరా ఆకట్టుకున్నారు, ఊహించేలా ఆయన పాత్ర ఉంది. టీచర్‌ పాత్రలోని ట్విస్ట్ కూడా ఫర్వాలేదు. ఆ పాత్రలో స్వసిక విజయ్‌ చాలా బాగా చేసింది. తనలోని మరో యాంగిల్‌ని చూపించింది. నెగటివ్‌ షేడ్‌ ఉన్న పాత్రలో అజయ్‌ ఘోష్‌ అదరగొట్టారు. తన మార్క్ గాంభీర్యంతో మెప్పించాడు. ఆయన కొడుకుగా కొమరం కూడా బాగా చేశాడు. రవితేజ భార్యగా ప్రియా భవానీ శంకర్‌ ఆకట్టుకుంది. పాత్రలో ఒదిగిపోయింది. గురుస్వామిగా సాయికుమార్‌ మెప్పించారు. పాత్రలోని ట్విస్ట్ బాగుంది. కాకపోతే కన్విన్సింగ్‌గా లేదు. మిగిలిన పాత్రధారులు ఓకే అనిపించారు.

56
ఇరుముడి మూవీ టెక్నీకల్‌గా ఎలా ఉందంటే

జీవీ ప్రకాష్‌ మ్యూజిక్‌ సినిమాకి హెల్ప్ అయ్యింది. అయ్యప్ప పాటలు బాగున్నాయి. మిగిలిన పాటలు అంతగా ఆకట్టుకోలేదు. కెమెరా వర్క్ ఆకట్టుకునేలా ఉంది. ఎడిటింగ్‌ పరంగా మరింత వర్క్ చేయాల్సింది. దర్శకుడు శివ నిర్వాణ మంచి కథ రాసుకున్నాడు. కాకపోతే రెగ్యూలర్‌ స్టోరీనే. ఇలాంటి కథలు చాలానే వచ్చాయి. వస్తున్నాయి. కథనాన్ని నడిపించిన తీరు బాగుంది.ఎంగేజ్‌ చేసేలా ఉంది. అదే సమయంలో ఊహించేలా ఉంది. రొటీన్‌ ఫీలింగ్‌ తెప్పిస్తుంది. అయ్యప్ప స్వామి భక్తులకు సంబంధించిన అంశాలు కొత్తగా ఉంటాయి. అవి, తండ్రి కూతుర్ల సెంటిమెంట్‌, ఎమోషనల్‌గా కథని నడిపించిన తీరు బాగుంది. అదే ఈ సినిమాకి ప్లస్‌గా నిలుస్తాయి.

66
ఫైనల్‌ నోట్‌, రేటింగ్‌

అయ్యప్పస్వామి భక్తుల బ్యాక్‌ డ్రాప్‌లో తండ్రికూతుళ్ల సెంటిమెంట్‌ నేపథ్యంలో సాగిన ఎమోషనల్‌ యాక్షన్‌ డ్రామా ఇరుముడి. రవితేజ చేసిన కొత్త ప్రయత్నమని చెప్పొచ్చు. ఫ్యామిలీతో కలిసి చూడగలిగే మూవీ. అమ్మాయిలను, ముఖ్యంగా ఆడ పిల్లల్ని భయంతో కాదు, ధైర్యంతో పెంచాలని చెప్పడం బాగుంది.

రేటింగ్‌: 3

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories