నాగ చైతన్య, అఖిల్ అక్కినేని ఇద్దరూ 32 ఏళ్ళ క్రితం నాటి సినిమా రీమేక్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇంతకీ ఆ మూవీ ఏంటి ? అప్పటి సినిమా ఇప్పుడు వర్కౌట్ అవుతుందా అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
అక్కినేని వారసులుగా నాగ చైతన్య, అఖిల్ హీరోగా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. నాగార్జున టాలీవుడ్ లో తిరుగులేని స్టార్ హీరో. రీసెంట్ గా వీరు ముగ్గురూ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తమ కెరీర్, ఫ్యామిలీలో ఉన్న అనుబంధం ఇతర విశేషాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాగ చైతన్య, అఖిల్ ఇంత వరకు కలసి ఫుల్ లెన్త్ మూవీ చేయలేదు.
25
అన్నదమ్ముల కాంబో ఎప్పుడు
మనం మూవీలో అఖిల్ కొన్ని నిమిషాల పాటు తళుక్కున మెరుస్తాడు అంతే. ఆ మూవీలో నాగార్జున, చైతు పూర్తి స్థాయిలో నటించారు. అక్కినేని అన్నదమ్ముల కాంబోలో ఫుల్ లెన్త్ మూవీ ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. తాజా ఇంటర్వ్యూలో అఖిల్, చైతూకు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. మీ తండ్రి సినిమాల్లో దేనిని రీమేక్ చేయడనికి ఇష్టపడతారు అని ప్రశ్నించగా.. అఖిల్, చైతూ ఇద్దరూ ఒకే సినిమా పేరు చెప్పారు.
35
తండ్రి సినిమా రీమేక్ పై ఆసక్తి
ఆ సినిమా ఏంటంటే.. హలో బ్రదర్. నాగార్జున డ్యూయెల్ రోల్ లో నటించిన హలొ బ్రదర్ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 90వ దశకంలో టాలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఇది కూడా ఒకటి. రమ్యకృష్ణ, సొందర్య హీరోయిన్లుగా నటించారు. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో ఉంటుంది.
ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలని ఆసక్తిగా ఉన్నట్లు చైతూ, అఖిల్ ఇద్దరూ చెప్పారు. అయితే అఖిల్, చైతూ హలో బ్రదర్ రీమేక్ చేస్తే ఎలా ఉంటుంది అనే లెక్కలు అప్పుడే అభిమానుల్లో మొదలయ్యాయి. అది 32 ఏళ్ళ నాటి సినిమా. ఆ తరహా ఎంటర్టైన్మెంట్ కి, కథలకు ఎప్పుడో కాలం చెల్లింది. అలాంటి కథలతో ఇప్పుడు సినిమాలు చేస్తే వర్కౌట్ కావు సరికదా.. హలో బ్రదర్ లాంటి క్లాసిక్ మూవీ పరువు తీసినట్లు అవుతుంది అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
55
అఖిల్, చైతూ ధైర్యం చేస్తారా ?
మరికొందరు మాత్రం ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్లుగా రీమేక్ కథ రెడీ చేసి, సరైన వినోదం అందిస్తే ఇప్పుడు కూడా హిట్ అవుతుంది అని అంటున్నారు. మరి హలో బ్రదర్ రీమేక్ కి చైతూ, అఖిల్ ధైర్యం చేస్తారా.. అన్నదమ్ముల కాంబోలో తొలి చిత్రం ఎప్పుడు వస్తుంది అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ అనే చెప్పాలి.