ఓటీటీ ఆడియన్స్ కి పండగే.. ఈ ఒక్కరోజే ఏకంగా 16 సినిమాలు రిలీజ్, ఎందులో చూడాలంటే..

Published : May 23, 2025, 03:04 PM IST

జియో హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్, ఆహా, నెట్ ఫ్లిక్స్ లాంటి ఓటీటీల్లో శుక్రవారం రోజు ఏకంగా 16 చిత్రాలు రిలీజ్ అయ్యాయి.

PREV
16
ఒక్కరోజే ఏకంగా 16 సినిమాలు

థియేటర్లతో పాటు, ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు  కూడా ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తున్నాయి. థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత నిర్మాతలు వెంటనే ఓటీటీలోకి చిత్రాలను రిలీజ్ చేస్తున్నారు. కొన్ని చిత్రాలు నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. నేడు శుక్రవారం రోజు ఓటీటీలో ఏకంగా 16 చిత్రాలు రిలీజ్ అయ్యాయి. రిలీజ్ అయిన చిత్రాలు ఏంటి, ఎందులో రిలీజ్ అయ్యాయి అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

26
ప్రధాన ఓటీటీ సంస్థలు

జియో హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్, ఆహా, నెట్ ఫ్లిక్స్ లాంటి సంస్థలు ఓటీటీల్లో ప్రధాన సంస్థలుగా ఉన్నాయి. ఇటీవల కాలంలో ఓటీటీలకు ఆదరణ బాగా పెరిగింది. థియేటర్ లో రిలీజ్ అయిన చిత్రాలతో పాటు ఒరిజినల్ చిత్రాలు, వెబ్ సిరీస్ లతో ఓటీటీ సంస్థలు ప్రేక్షకులని ఆకర్షిస్తున్నాయి. నేడు రిలీజ్ అయిన చిత్రాల విషయానికి వస్తే కొన్ని తెలుగు చిత్రాలు, డబ్బింగ్ చిత్రాలు, వెబ్ సిరీస్ లు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. 

36
ఆహాలో రిలీజైన చిత్రాలు

అర్జున్ సన్నాఫ్ వైజయంతి - కళ్యాణ్ రామ్, విజయశాంతి తల్లీ కొడుకులుగా నటించిన ఈ చిత్రం ఆల్రెడీ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయింది. శుక్రవారం ఆహాలో కూడా రిలీజ్ చేశారు.  

వల్లమై - క్రైమ్ రివేంజ్ డ్రామాగా ఈ తమిళ చిత్రం రూపొందింది. 

46
అమెజాన్ ప్రైమ్ లో రిలీజైన చిత్రాలు

 సారంగపాణి జాతకం - ప్రియదర్శి, రూప కొడువాయుర్, వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ఇది. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకుడు.  

అభిలాషం - సజ్జు కురుప్, తన్వి రామ్ నటించిన మలయాళీ చిత్రం ఇది.

56
నెట్ ఫ్లిక్స్ లో రిలీజైన చిత్రాలు 

ఎయిర్ ఫోర్స్ ఎలైట్ థండర్ బర్డ్స్ ( ఇంగ్లీష్ డాక్యుమెంటరీ చిత్రం)  

ఫియర్ స్ట్రీట్ ప్రోమ్ క్వీన్ ( తెలుగు డబ్బింగ్ చిత్రం ) 

ఫర్గెట్ యు నాట్ ( ఇంగ్లీష్ వెబ్ సిరీస్ ) 

బిగ్ మౌత్ సీజన్ 8 ( ఇంగ్లీష్ అడల్ట్ కామెడీ యానిమేషన్ వెబ్ సిరీస్ ) 

ఆఫ్ ట్రాక్ 2( రొమాంటిక్ మూవీ)  

అన్ టోల్డ్ ది ఫాల్ ఆఫ్ ఫవ్ర్ ( డాక్యుమెంటరీ చిత్రం)

66
ఇతర ఓటీటీల్లో రిలీజైన చిత్రాలు 

ఫైండ్ ది ఫర్జి (హిందీ గేమ్ షో ) - జియో హాట్ స్టార్  

ఫౌంటెన్ ఆఫ్ యూత్ (మిస్టరీ థ్రిల్లర్ )- ఆపిల్ ప్లస్ టీవీ  

హంట్ ( తెలుగు డబ్బింగ్ థ్రిల్లర్ మూవీ) - మనోరమ మ్యాక్స్ ఓటీటీ 

సుమో ( తమిళ మూవీ) - టెంట్ కొట్టా ఓటీటీ 

ఇన్ హెరిటెన్స్ ( థ్రిల్లర్ మూవీ) - లయన్స్ గేట్ ప్లే ఓటీటీ 

విష్ యు వెర్ హియర్ ( రొమాంటిక్ మూవీ) - బుక్ మై షో ఓటీటీ

ఇలా మొత్తం 16 చిత్రాలు శుక్రవారం రోజు వివిధ ఓటిటి ఫ్లాట్ ఫామ్స్ లో రిలీజ్ అయ్యాయి. వీటిలో తెలుగు ఆడియన్స్ సారంగపాణి జాతకం, అర్జున్ సన్నాఫ్ వైజయంతి లాంటి చిత్రాలతో పాటు మరికొన్ని చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఎంజాయ్ చేయవచ్చు.    

Read more Photos on
click me!

Recommended Stories