దారుణం: సందీప్ వంగాను మోసం చేసి, ఇబ్బందిపెట్టిన ఇద్దరు హీరోలు

First Published | Nov 6, 2024, 11:28 AM IST

అర్జున్ రెడ్డి సినిమా విజయ్ దేవరకొండ మరియు సందీప్ రెడ్డి వంగాల కెరీర్‌లను మలుపు తిప్పింది. అయితే, ఈ సినిమా తెరకెక్కడానికి ముందు, సందీప్ రెడ్డి వంగా ఐదేళ్ల పాటు ఇద్దరు హీరోల వెనక తిరిగారు. ఈ విషయాన్ని రచయిత కోన వెంకట్ వెల్లడించారు.

Sandeep Reddy Vanga,arjun reddy, animal

ప్రారంభ రోజుల్లో కథ ఓకే చేయటం, సంవత్సరాల తరబడి వాళ్లని వెయిటింగ్ మోడ్ లో  పెట్టి, చివరకు నో చెప్పటం చాలా మందికి జరుగుతుంది. డైరక్టర్స్ కు, రైటర్స్ కు అది కొంతకాలానికి అతి సామాన్యమైన విషయంగా మారుంది.

అలాంటి కొన్ని దారుణమైన సంఘటనలు సందీప్ వంగా జీవితంలోనూ చోటు చేసుకున్నాయి. ఇద్దరు హీరోలు ఆయన్ని  ప్రారంభ రోజుల్లో ఐదేళ్లు పాటు తమ వెనక తిప్పుకుని, సినిమా చేస్తామని హ్యాండ్ ఇచ్చేసారు. అర్జున్ రెడ్డి టైమ్ లో జరిగిందీ సంఘటన. ఎవరా హీరోలు..ఏమిటా విషయం.

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

సందీప్ రెడ్డి వంగా, విజయ్ దేవరకొండ కెరీర్ లో అర్జున్ రెడ్డి ఎంత సక్సెస్ ని ఇచ్చిందో తెలిసిందే. వాళ్లద్దరి జీవితాలను అది సమూలంగా మార్చేసింది. అయితే అర్జున్ రెడ్డి కథను ఇద్దరు హీరోలు ఓకే చేసి వెయిటింగ్ లో ఉంచేసారు.

ఆ విషయాలను దర్శక,రచయిత కోన వెంకట్ చెప్పి జనాలకు షాక్ ఇచ్చారు. ‘ ‘అర్జున్ రెడ్డి’ రూ.4 కోట్ల బడ్జెట్లో తీసిన సినిమా. బ్లాక్ బస్టర్ అయిన సినిమా.’.. అక్కడి వరకే మనకు తెలుసు. కానీ ఈ సినిమాని తెరకెక్కించడానికి దర్శకుడు సందీప్ చాలా కష్టపడ్డాడు అని కోన వెంకట్ చెప్పుకొచ్చారు.


కోన వెంకట్ మాట్లాడుతూ.. మాట్లాడుతూ.. “దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) నాకు చెప్పాడు. ‘అర్జున్ రెడ్డి’ కథపై 3 ఏళ్ళు ఓ హీరో ఆఫీస్ లో ఉండి పనిచేశాడు. టైంకి ఫుడ్డు పెడుతున్నారు కదా అని అతను.. ‘మన కథ బయటకు వస్తే చాలు’ అని అనుకున్నాడు. ‘కచ్చితంగా మనం ఈ కథ చేద్దాం’ అని ఆ హీరో చెప్పడం, ఇతను నమ్మడం. అలా మూడేళ్లు అయిపోయింది.
 


అలా కొంతకాలం గడిచిన తర్వాత అతనికి చేసే ఉద్దేశం లేదు అని సందీప్ గ్రహించి వేరే హీరో ఆఫీస్ కి వెళ్ళాడు. అతను కూడా ఇతన్ని ఇంకో రెండేళ్లు వాడుకున్నాడు. మొత్తంగా ‘అర్జున్ రెడ్డి’ కథ పట్టుకుని 5 ఏళ్ళ పాటు హీరోల ఆఫీస్..ల చుట్టూ తిరిగాడు.  

ఇక అతను పడే కష్టాలు చూడలేక.. అతని బ్రదర్ నిర్మాతగా మారి ‘అర్జున్ రెడ్డి’ చేయడానికి రెడీ అయ్యాడు. విజయ్ దేవరకొండ  (Vijay Devarakonda)  కూడా సందీప్ ని బలంగా నమ్మి.. ఆ కథ చేశాడు. తర్వాత అది క్లాసిక్ అయ్యింది. ‘అర్జున్ రెడ్డి’.. సందీప్ 5 ఏళ్ల కష్టం” అంటూ ఎవ్వరికీ తెలియని విషయాన్ని బయటపెట్టారు కోన వెంకట్. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
 

Sandeep Reddy Vanga Net Worth

ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా ఆ కష్టాలను దాటారు.  పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ భారీ చిత్రాల్లో దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తో చేయనున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ “స్పిరిట్” కూడా ఒకటి .

మరి ఎప్పుడో అనౌన్స్ అయ్యిన ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా పనులు ఆల్రెడీ మొదలు కాగా అభిమానులకి మ్యూజిక్ అప్డేట్ ని కూడా సందీప్ అందించాడు.  ఈ సినిమా మోడ్ లోకి సందీప్ పూర్తిగా మారిపోయాడు . తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో సందీప్ స్పిరిట్ ప్రొఫైల్ పిక్స్ ని అప్డేట్ చేసుకొని పూర్తిగా స్పిరిట్ మోడ్ లోకి మారిపోయాడు. 

Sandeep Reddy Vanga


ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ గా కనిపించనున్నాడు అని ఆల్రెడీ సందీప్ వంగ చెప్పడంతో ఈ సినిమాపై ప్రభాస్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నాడు.ఆల్రెడీ స్పిరిట్ స్క్రిప్ట్ పూర్తి చేసిన సందీప్ రెడ్డి వంగ ఇటీవలే మ్యూజిక్ వర్క్స్ మొదలుపెట్టాడు.

దీపావళికి స్పిరిట్ మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ తో కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్ వేసిన చిన్న వీడియో ఒకటి షేర్ చేశారు. దీంతో స్పిరిట్ వర్క్స్ ఫాస్ట్ గానే జరుగుతున్నాయి అని భావిస్తున్నారు. తాజాగా మరో ఫోటో వైరల్ అవుతుంది.

డాషింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga)  - ప్రభాస్ కాంబోలో ‘స్పిరిట్’ (Spirit) రాబోతున్న విషయం తెలిసిందే. డ్రగ్స్ నేపథ్యంలో.. అలాగే ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమాతో సందీప్ కచ్చితంగా రూ2000 కోట్లు వసూళ్లు చేస్తారని అంటున్నారు. ఇలా ఈ ముగ్గురు డైరెక్టర్లు జక్కన్న ఫిక్స్ చేసిన టార్గెట్ ను రీచ్ అయ్యే పనిలో నిమగ్నమయ్యారు.

read more: బడ్జెట్ లోనూ ప్రభాస్ రికార్డ్, 'ఫౌజీ ' కు ఎంత పెడుతున్నారో తెలుసా?

also read: సమంతకి మాజీ మామ నాగార్జున కౌంటర్, ముందు మైండ్ లో నుంచి అది తీసేయ్.. అలా చూసి భరించలేకపోయింది

Latest Videos

click me!