చిరంజీవిని అర్జునుడితో పోల్చిన సీనియర్ హీరో.. అతడు లేకుంటే నథింగ్ అంటూ ఊహించని వ్యాఖ్యలు

Published : Aug 16, 2025, 11:02 AM IST

చిరంజీవిని అర్జునుడితో పోల్చుతూ సీనియర్ హీరో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. చిరంజీవి కెరీర్ గురించి ఆయన చెప్పిన మాటలు చర్చనీయాంశం అవుతున్నాయి. 

PREV
15
ప్రాణం ఖరీదు మూవీ

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఎంతో మంది నటీనటులతో నటించారు. తనకి సీనియర్లు అయిన ఎన్టీఆర్, కృష్ణ, కృష్ణంరాజు, మురళి మోహన్ లాంటి వారితో నటించారు. అదే విధంగా చంద్రమోహన్ తో కూడా నటించారు. చిరంజీవి తన తొలి చిత్రం ప్రాణం ఖరీదులో చంద్రమోహన్ తో కలిసి నటించడం విశేషం. ఈ మూవీ గురించి చెబుతూ చంద్రమోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

DID YOU KNOW ?
చిరంజీవి ఫస్ట్ రెమ్యునరేషన్
చిరంజీవి ప్రాణం ఖరీదు చిత్రం కోసం తన తొలి రెమ్యునరేషన్ అందుకున్నారు. ఈ చిత్రంలో నటించినందుకు చిరంజీవికి దక్కిన రెమ్యునరేషన్ రూ.5 వేలు.
25
చిరంజీవికి 5 వేలు, చంద్రమోహన్ కి 25 వేలు

కెరీర్ ప్రారంభంలోనే డ్యాన్సులు అద్భుతంగా చేస్తూ చాలా పట్టుదలతో కనిపించేవాడు. ప్రాణం ఖరీదు చిత్రంలో చిరంజీవికి 5 వేలు రెమ్యునరేషన్ ఇస్తే నాకు 25 వేలు ఇచ్చారు. అప్పట్లో ఇండస్ట్రీలో డ్యాన్సులు బాగా చేసేది నేను, ఏఎన్నార్ మాత్రమే. చిరంజీవి వచ్చాక తనకంటూ ఒక స్టైల్ అలవాటు చేసుకున్నాడు.

35
అతడు లేకుంటే చిరంజీవి నథింగ్

నేను చిరంజీవిని అర్జునిడిలా పోలుస్తాను. అర్జునుడిని శ్రీకృష్ణుడు గైడ్ చేయకపోతే కురుక్షేత్రం ఎలా ఉండేది ? శ్రీకృష్ణుడు లేకపోతే అర్జునుడు నథింగ్. ఎప్పుడు ఏం చేయాలి, ఎలా నడుచుకోవాలి అని అర్జునుడుకి తెలిపింది శ్రీకృష్ణుడు. చిరంజీవి లైఫ్ లో శ్రీకృష్ణుడు లాంటి వ్యక్తి అల్లు అరవింద్. చిరంజీవి ఎలాంటి సినిమాలు చేయాలి, చిరంజీవికి ఎలాంటి కథలు మ్యాచ్ అవుతాయి అనే ప్లానింగ్ మొత్తం అల్లు అరవింద్ వేసేవారు. చిరంజీవి సక్సెస్ లో అల్లు అరవింద్ కి కీలక పాత్ర ఉంది అని చంద్రమోహన్ కామెంట్స్ చేశారు.

45
ఏకైక నటుడిని నేనే

చంద్రమోహన్ చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. ఎన్టీఆర్, ఏఎన్నార్ తరం నుంచి వాళ్ళ మనవళ్ల వరకు అందరితో నటించిన ఏకైక నటుడిని తానే అని చంద్రమోహన్ అన్నారు.

55
రంగులరాట్నం చిత్రంతో ఎంట్రీ

చంద్రమోహన్ 1966లో రంగులరాట్నం చిత్రంతో హీరోగా పరిచయం అయ్యారు. తొలి మూవీతోనే చంద్రమోహన్ కి బ్లాక్ బస్టర్ హిట్ దక్కింది. చంద్రమోహన్ ఆ తర్వాత శ్రీదేవి, జయసుధ లాంటి స్టార్ హీరోయిన్లతో నటించారు.

Read more Photos on
click me!

Recommended Stories