కృష్ణ-విజయ నిర్మల పెళ్లి వెనుక చంద్రమోహన్‌ హస్తం.. అందుకు ఆమె ఏం చేసిందో తెలుసా?

సూపర్‌ స్టార్‌ కృష్ణ, గిన్నిస్‌ బుక్ రికార్డు విన్నింగ్‌ డైరెక్టర్‌ విజయ నిర్మలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. టాలీవుడ్‌లో ఆదర్శ జంటగానూ నిలిచారు. అయితే వీరిద్దరి పెళ్లి వెనుక చంద్రమోహన్‌ హస్తం ఉందట. 
 

chandramohan big hand in back of krishna vijaya nirmala marriage arj

చంద్రమోహన్‌(Chandramohan).. వందకుపైగా సినిమాల్లో హీరోగా నటించి మెప్పించారు. విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన, కళాతపస్వి కె విశ్వనాథ్‌ బంధువులు అనే విషయం తెలిసిందే. అయితే కృష్ణ(krishna), విజయ నిర్మల(Vijaya Nirmala) ఫ్యామిలీతోనూ మంచి అనుబంధం ఉంది. దానికి కారణం వారి పెళ్లి వెనుక చంద్రమోహన్‌ హస్తం ఉండటమే కారణం. మరి ఇంతకి ఏం జరిగిందనేది చూస్తే. 
 

chandramohan big hand in back of krishna vijaya nirmala marriage arj

కృష్ణ, విజయ కలిసి అనేక సినిమాలు చేశారు. విజయ నిర్మల దర్శకత్వంలో కృష్ణ పలు సినిమాలు చేస్తే, ఈ ఇద్దరు కలిసి నటించిన చిత్రాలు కూడా చాలానే ఉన్నాయి. మొత్తంగా వీరిద్దరు నలబైకిపైగా సినిమాలు చేశారు. విజయ నిర్మల డైరెక్ట్ చేసిన చిత్రాల్లో ఆల్మోస్ట్ కృష్ణనే హీరో. దీంతో ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. అది ప్రేమగా మారి, దూరంగా ఉండలేనంతగా మారిపోయింది. దీంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అప్పటికే కృష్ణకి ఇందిరా దేవితో పెళ్లి అయ్యింది, పిల్లలున్నారు, మరోవైపు విజయనిర్మలకి పెళ్లి అయ్యింది, ఇద్దరు కుమారులున్నారు. 
 


అలాంటి పరిస్థితుల్లో వీరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఆ సమయంలో వారికి అండగా నిలిచింది నటుడు చంద్రమోహన్‌. వారికి మనోధైర్యాన్నివ్వడంతోపాటు దగ్గరుండి పెళ్లి చేయించారు. తిరుపతిలో కృష్ణ, విజయ నిర్మల పెళ్లి చేసుకుంటే, ఆ పెళ్లి ఏర్పాట్లు మొత్తం చూసుకుంది చంద్రమోహనే. ఈ విషయాన్ని ఆయనే ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఓ రకంగా పెళ్లి పెద్దగా మారి స్వయంగా పెళ్లి జరిపించినట్టు తెలిపారు చంద్రమోహన్‌. `కృష్ణ మేకప్ మెన్, విజయ నిర్మల అసిస్టెంట్, నేను, మోహన్ కుమార్ అనే ఒక జర్నలిస్టు... మేము మాత్రమే ఉండి తిరుపతిలో పెళ్లి చేశాం` అని చెప్పారు. 
 

అందుకే కృష్ణ, విజయ నిర్మలకు తానేంటో ఎంతో ప్రేమ, అభిమానం అని, సొంత ఫ్యామిలీగానే చూసుకుంటారని, ఎంతో ఆప్యాయతలను పంచేవారని తెలిపారు. తరచూ వారు కలిసే వారట. కష్టసుఖాలను కూడా షేర్‌ చేసుకునే వారని చెప్పారు చంద్రమోహన్‌. `ఫిల్మ్ నగర్లో ఇద్దరం ఎదురెదురుగా ఇళ్లు కట్టుకున్నాం. తరచూ వెళ్లి కలిసేవాడిని, నన్ను సొంత అన్నయ్యలాగా చూసుకుంది. వాళ్ల ఫ్యామిలీ కూడా నాకు చాలా క్లోజ్. ఒకే కుటుంబ సభ్యుల్లా మెలిగేవారం. ఆవిడ డైరెక్ట్ చేసిన అన్ని సినిమాల్లోనూ నేను ఉన్నాను. చాలా మంచి మంచి పాత్రలు వేసి`నట్లు వెల్లడించారు.

Actor Chandramohan

ఇక దాదాపు ఐదు దశాబ్దాల పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా రాణించిన చంద్రమోహన్‌.. దాదాపు వెయ్యి(సుమారు 930) సినిమాల్లో నటించారు. వాటిలో 175 సినిమాలు హీరోగా నటించడం విశేషం. ఆ తర్వాత కొన్ని హాస్య పాత్రలు చేశారు, మరికొన్ని నెగటివ్‌ రోల్స్ చేశారు, స్టార్‌ హీరోలకు తండ్రిగా, ఇతర ముఖ్య పాత్రల్లో నటించి మెప్పించారు. అద్భుతమైన నటుడిగా మెప్పించారు. 

Latest Videos

vuukle one pixel image
click me!