చంద్రమోహన్ ఫ్యామిలీ గురించి తెలుసా? భార్య, పిల్లలు ఏం చేస్తారంటే?

Sreeharsha Gopagani | Published : Nov 11, 2023 11:55 AM
Google News Follow Us

ఇండస్ట్రీలో ఎంతోకాలంగా పనిచేన చంద్రమోహన్ ఫ్యామిలీ సినిమాలకు కాస్తా దూరంగానే ఉంది. భార్య, పిల్లలు ఏం చేస్తారనేది చాలా మంది తెలిసి ఉండదు. ఇంతకీ వారి గురించిన వివరాలను తెలుసుకుందాం.
 

16
చంద్రమోహన్ ఫ్యామిలీ గురించి తెలుసా? భార్య, పిల్లలు ఏం చేస్తారంటే?

టాలీవుడ్ సీనియర్ నటుడు చంద్రమోహన్ (Chandra Mohan)  ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ లోనే కన్నుమూశారు. దీంతో ఇండస్ట్రీలోని ప్రముఖులు, సెలబ్రెటీలు, ఆయన అభిమానులు దిగ్భ్రాంతికి గురవుతున్నారు. 
 

26

ఇక చంద్రమోహన్ కుటుంబ విషయానికొస్తే..  1943 మే 23న ఆయన మద్రాస్ లో జన్మించారు. ఆయన పూర్తిపేరు మల్లంపల్లి చంద్రశేఖర్ రావు. వెండితెరపేరు చంద్రమోహన్. చంద్రమోహన్ భార్య జలంధర. వీరిద్దరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 
 

36

భార్య జలంధర రచయిత్రి. ఆమె దాదాపు 100కు పైగా కథలు, పలు నవలలు రాశారు. సామితీ పురస్కారాలు కూడా అందుకున్నారు. వీరిద్ధరూ ఆదర్శ దంపతులుగానూ వీరూ పురస్కారం అందుకోవడం విశేషం. 

Related Articles

46

వీరి పిల్లల విషయానికొస్తే.. పెద్ద కూతురు మధుర మీనాక్షి, చిన్న కూతురు మాధవి.  ఇద్దరికీ వివాహాలు అయ్యాయి. వారివారు కుటుంబాలతో స్థిరపడ్డారు. హైదరాబాద్ లో చంద్రమోహన్ జీవిస్తున్నారు. 
 

56

పెద్దకూతురు మీనాక్షి సైకాలజిస్ట్. వివాహం తర్వాత ఆమె కుటుంబంతో అమెరికాలో స్థిరపడ్డారు. ఇక రెండో కూతురు మాధవి వృతిరీత్యా డాక్టర్. ఆమె కూడా వివాహం తర్వాత  భర్త, పిల్లలతో కలిసి చెన్నైలో సెటిల్ అయ్యింది. 
 

66

ఇక చంద్రమోహన్ గత కొంతకాలంగా  అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ ఉదయం పరిస్థితి విషమించి 80వ ఏటా కన్నుమూశారు. అభిమానులు, శ్రేయోభిలాషులు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు. 
 

Recommended Photos