చంద్రమోహన్ అందగాడు అయినప్పటికీ హైట్ మైనస్ అయ్యింది. దాని వలన కమర్షియల్ హీరోగా ఎదగలేకపోయాడు. ఈ విషయం తెలిసిన చంద్రమోహన్ తన పర్సనాలిటీ, ఇమేజ్ కి తగ్గ చిత్రాల్లో హీరోగా నటిస్తూ స్టార్ హీరోల చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ చేశారు. 23 ఏళ్ల వయసులో పరిశ్రమలో అడుగుపెట్టిన చంద్రమోహన్ 75 ఏళ్ల వయసు వచ్చే వరకు నటిస్తూనే ఉన్నారు.