Karthika Deepam: అమ్మనాన్న కోసం తపిస్తున్న శౌర్య.. చేసిన తప్పుని తలుచుకుని కుమిలిపోతున్న హిమ!

Navya G   | Asianet News
Published : Mar 25, 2022, 10:15 AM IST

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ లో కథ మొత్తంలో మలుపు తిరిగినా కూడా సీరియల్ మాత్రం బాగా ఆకట్టుకుంటుంది. పైగా రేటింగ్ కూడా ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.  

PREV
16
Karthika Deepam: అమ్మనాన్న కోసం తపిస్తున్న శౌర్య.. చేసిన తప్పుని తలుచుకుని కుమిలిపోతున్న హిమ!

సౌర్య సత్య (Satya) వాళ్ల ఇంటికి వెళ్లి చంద్రమ్మకు వంట చేయించే బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. ఇక సౌర్య ఒంటరిగా కూర్చొని తన చేతి మీద ఉన్న హిమ పేరు చూసుకుంటూ బాగా ఫైర్ అవుతుంది. ఇక ఆ సమయంలో తన దగ్గరికి ఇంద్రుడు, చంద్రమ్మ లు వచ్చి కూర్చుంటారు.
 

26

ఇక ఇంద్రుడు (Indrudu)..గుడిలో అన్నదానం ఏర్పాటు చేశానని అంటాడు.  ఇక మాటల మధ్యలో అసలు పేరు చెప్పమని అనడంతో..  మీ చనిపోయిన పాప పేరు జ్వాలా (Jwala) కదా అందుకే ఆ పేరే నా పేరు అని తన పేరు చెప్పలేకపోతోంది. ఇక వారితో కాసేపు ఎమోషనల్ గా మాట్లాడుతాడు ఉంటుంది.
 

36

మరోవైపు హిమ (Hima) కూడా తన పేరుమీద ఉన్న సౌర్య (Sourya) పేరు చూసుకొని బాధపడుతుంది. అంతే కాకుండా తన అత్త మాట్లాడిన మాటలను తలచుకుని కుమిలిపోతుంది. కాగా సమయంలో సౌందర్య రావటంతో తనతో కాసేపు బాధపడుతూ మాట్లాడుతుంది.
 

46

ఇక సౌందర్య (Soundarya) ఓదార్చే ప్రయత్నం చేస్తుంది. పైగా రేపు అమ్మ నాన్నల పేరు మీద గుడిలో అన్నదానం చేయిస్తున్ననని అంటుంది. ఇక మరుసటి రోజు సౌర్య (Sourya) తన తల్లితో గడిపిన చిన్నప్పటి జ్ఞాపకాన్ని తలుచుకుని.. అన్నం ముద్దలు ప్లేట్ లో తీసుకోని గోడ మీద పెట్టి కాకులను కావ్ కావ్ మని వణుకుతున్న గొంతుతో బాగా ఎమోషనల్ గా పిలుస్తుంది.
 

56

ఇక అక్కడికి ఇంద్రుడు (Indrudu), చంద్రమ్మ రావడంతో.. అమ్మ నాన్నల ఆత్మలు కాకుల రూపంలో చుట్టాలుగా వస్తాయనే ఆశతో పిలుస్తున్నానని అంటుంది. ఇక ఆ మాటలు విని చంద్రమ్మ, ఇంద్రుడు బాధపడుతూ ఉంటారు. మరోవైపు సౌందర్య (Soundarya) వాళ్లు గుడికి వెళ్లడానికి బయలుదేరుతారు. ఆ సమయంలో అందరూ గుర్తుకు రావడంతో ఆనందరావు ఎమోషనల్ అవుతాడు.
 

66

దాంతో ఆయనకు గుండెనొప్పి రావటంతో సౌందర్య, హిమ కంగారు పడతారు. సత్య (Satya) వాళ్ల ఇంట్లో సౌర్య టిఫిన్ తీసుకుని సత్యకు ఇస్తుంది. ఇక ఆ సమయంలో సత్య ఫోన్ కు సౌందర్య ఫోన్ చేయటంతో ఆ ఫోన్ ను తీసుకొని రావడానికి సౌర్య (Sourya) వెళ్తుంది. ఆ ఫోన్ లో సౌందర్య ఫోటో ఉండగా.. ఆ ఫోటోను సౌర్య చూస్తుందో లేదో తరువాయి భాగం లో చూడాలి.

click me!

Recommended Stories