RRR Review: “ఆర్ ఆర్ ఆర్” రివ్యూ & రేటింగ్!

First Published | Mar 25, 2022, 7:04 AM IST


ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) (Roudram Ranam Rudhiram) టైటిల్ తో (NTR) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు (Ram Charan) ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కింది. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా  ఈరోజు( మార్చి 25)న ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. ఈ సినిమా  ఎలా ఉంది..రివ్యూలో చూద్దాం.


భారీ స్టార్డమ్ ఉన్న ఇద్దరు హీరోలు, వాళ్ల క్రేజ్ ని బీట్ చేసే సత్తా ఉన్న డైరక్టర్...భారీ బడ్జెట్...భాక్సాఫీస్ దగ్గర సునామీ క్రియేట్ చేస్తాయా? . కోవిడ్ తర్వాత  సినిమాలు చూడటానికి జనాలు వస్తారా అనే భయపడే సిట్యువేషన్ తెరపడింది. జనాలను రప్పించగలిగే కంటెంట్ఉంటే చాలు,జనం థియోటర్స్ దగ్గర క్యూలు కడతారు అని ఈ సినిమా ప్రూవ్ చేసింది. తెలుగు సినిమా తలెత్తుకునే స్దాయిలో   .... ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అమెరికా, ఆస్ట్రేలియా…అక్కడ ఇక్కడ అని తేడా లేకుండా   తెలుగు వారు ఉన్న అన్ని చోట్లా “ఆర్ ఆర్ ఆర్” ఫీవర్ నడుస్తోంది.  ‘బాహుబలి’తోనే కొత్త రికార్డులు సృష్టించిన రాజమౌళి ఈ సినిమాతో వాటిని బ్రద్దులు కొట్టే పోగ్రాం పెట్టుకున్నట్లే కనపడుతోంది. మరి ఆ ఇద్దరి హీరోలను కథలో బాలెన్స్ చేయగలిగారా?   ప్యాన్ ఇండియా మేకింగ్ కు తగ్గ కథేనా? స్టోరీ లైన్ ఏంటి? ఎన్టీఆర్, రామ్ చరణ్ ఈ సినిమాతో  పాన్ ఇండియా స్టార్స్ గా ఎదుగుతారా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

RRR Movie

కథ

 స్వాతంత్రానికి పూర్వం 1920లో అదిలాబాద్ జిల్లాలో కథ ప్రారంభం అవుతుంది. బ్రిటీష్ వాళ్లు పాలిస్తున్న రోజులవి. ఓ బ్రిటీష్ అధికారి..గిరిజన(గోండు) తెగ కు చెందిన మల్లి అనే చిన్న పిల్లను ఆమె వాయిస్ నచ్చి తనతో బలవతంగా తీసుకెళ్తాడు. అడ్డుపడిన తల్లిని చంపేస్తారు బ్రిటీషర్స్.   ఆ పాపను కాపాడటానికి ఆ తెగ నాయకుడు  భీమ్ (ఎన్టీఆర్) డిల్లీ బయిలుదేరతాడు. అదే సమయంలో రామ్ రాజు (రామ్ చరణ్) బ్రిటీష్ వారి వద్ద పోలీస్ గా పనిచేస్తూంటాడు. అతనికి భీమ్ ని పట్టుకునే భాధ్యత అప్పగించబడుతుంది. రామ్ మామూలువాడు కాదు. చాలా పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా పేరు తెచ్చుకున్నవాడు.  భీమ్ ఒంటి చేత్తో పులిని పడేయగలడు. వీళ్లద్దరు కలిస్తే...రెండు శక్తులు ఒకటైతే ...బ్రిటీష్ వారిపై యుద్దం ప్రకటిస్తే..ఆ క్షణం అద్బుతం...అది ఎప్పుడు వస్తుంది?

Latest Videos


RRR Movie

మొదట ఒకరి యాటిట్యూడ్ మరొకరికి నచ్చి  స్నేహితులైన రామ్, భీమ్ ఓ మిస్ అండర్ స్టాండింగ్ తో విడిపోతారు. ఒకరిపై మరొకరు యుద్దం ప్రకటించేసుకుంటారు. ఆ క్రమంలో  వీళ్లిద్దరని మళ్లీ కలిపి స్నేహాన్ని పునరిద్దింపచేసే సిట్యువేషన్స్ ఏమిటి...రామ్ తన ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తూ  భీమ్ ని  పట్టుకుని బ్రిటీష్ వారికి అప్పగించాడా, వీరి మధ్య స్నేహం ఎలా కుదిరింది, భీమ్..అక్తర్ గా ఎందుకు మారాల్సి వచ్చింది? జెన్నీ ( Olivia ), సీత (అలియాభట్) ఎవరు... ఈ కథలో వారి స్దానం  ఏమిటి, అన్నిటికన్నా ముఖ్యంగా విజయ్ రామరాజు (అజయ్ దేవగన్) కు రామ్ రాజు కు ఉన్న రిలేషన్ ఏమిటి? అజయ్ దేవగన్  పాత్ర వల్ల కథలో చోటు చేసుకున్న మార్పులు ఏమిటి, ఫైనల్ గా గోండు పిల్ల మల్లిని తిరిగి వెనక్కి భీమ్ తీసుకెళ్ళగలిగాడా.. రామ్ అందుకు సహకరించాడా ?  ఆ క్రమంలో చోటు చేసుకునే సంఘటనలు ఏమిటి ? వంటి విషయాలు తెరపై చూస్తేనే బాగుంటాయి.

RRR Movie

విశ్లేషణ

మనకు ఈ సినిమా స్క్రీ ప్లే, పాత్రల పరంగా  అలనాటి షోలే (1975)ని గుర్తు చేస్తుంది. ఓ సక్సెస్ ఫుల్ ఫార్మెట్ ని మరో సారి తెరపై ఆవిష్కరిస్తుంది. అయితే ఫార్ములాలోకి మన దగ్గర ఉన్న స్టోరీ లైన్ ని ఇమడ్చాలనుకున్నప్పుడు  రొటీన్ గా అనిపించవచ్చు. కొత్తదనం ఏమీ కనపడకపోవచ్చు. దాన్ని దాటటమే మాస్టర్ స్టోరీ టెల్లర్ గా పేరు తెచ్చుకున్న రాజమౌళి ముందున్న పెద్ద టాస్క్.

రామ్, భీమ్ అనే పవర్ ఫుల్ పాత్రల మధ్య నడిచే  క్యారక్టర్ డ్రామా ఈ సినిమా. వేరే అంశాలు అంత ప్రయారిటి గా కనపడవు. ఇద్దరు సమ వయస్కులు స్నేహం. విడిపోవటం..తిరిగి కలవటం..ఆ కలయకకు పరమార్దంగా ఓ లక్ష్యాన్ని ఛేదించటం ఇలా  స్క్రీన్ ప్లే రాసుకున్నారు. ఇందులో స్నేహం ప్రధానం..రొమాన్స్ కు చోటు లేదు. చిన్న  పాప కిడ్నాప్ ..ఆమెను తిరిగి వెనక్కి తీసుకురావటం అనేది కథలో మెయిన్ థ్రెడ్ . దాన్ని  పట్టుకుని రెండు పాత్రలు పరిచయం, స్నేహం, విడిపోవటం,కలవటం ఇవన్ని సాగుతాయి. మాస్టర్ స్టోరీ టెల్లర్ గా రాజమౌళి ఈ చిన్న పాయింట్ చుట్టూ కథని అల్లుకుని చెలరేగిపోయారు.ఇంట్రవెల్ దాకా పరుగెట్టిస్తాడు.

సెకండాఫ్ కు మనకు రెండు లీడ్స్ ఉంటాయి. విడిపోయిన హీరోలు ఇద్దరు కలవాలి. పాపను రక్షించాలి. అయితే ఇంట్రవెల్ తర్వాత వచ్చే అజయ్ దేవగన్ ప్లాష్ బ్యాక్ కాస్త ఆ స్పీడుకి బ్రేక్ లు వేస్తుంది. కానీ తర్వాత మళ్లీ పుంజుకుంటాడు. ప్రీ క్లైమాక్, క్లైమాక్స్ బ్లాక్ లతో ఫామ్ లోకి వచ్చేస్తాడు. ఈ కథను బ్రిటీష్ వారిపై పోరాటంగా కాకుండా ఇద్దరు వ్యక్తులు స్నేహానికి సంభందించిన చిత్రంగా చూస్తేనే నచ్చుతుంది.

RRR Movie

బాగా తెలుసున్న హిస్టారికల్  పాత్రలతో   లేదా హిస్టారికల్ సబ్జెక్ట్ తో స్క్రిప్టు రాసేటప్పుడు ఖచ్చితంగా మనకంటూ ఒక perspective అవసరం. అప్పుడు రైటర్ లేదా డైరక్టర్ ఆ ధృక్పధాన్ని ఆ సబ్జెక్టులోకి తెస్తే కథ రక్తికడుతుంది. అలాగే ఈ తరహా చిత్రాల్లో ఎక్కువగా త్యాగాలు, భాద్యతలే ఎక్కువ శాతం ఆక్రమిస్తాయి. వాటిని మన తల బొప్పికట్టకండా చెప్పగలగాలి.  అలాగే ఇలా అప్పట్లో  జరిగే అవకాసం లేదు అని ప్రేక్షకుడుకి అనిపించాలి. పీరియడ్ సినిమాలో ఎంచుకున్న కాలమాన పరిస్దితుల్లో కొందరి జీవితాలను ఆవిష్కరించేప్పుడు ఈ జాగ్రత్తలు  తప్పనిసరి. అయితే ఈ సినిమా కథలో ఉండేవి  మొదటే చెప్పినట్లు కాల్పనిక చారిత్రక పాత్రలు. కాబట్టి కొంత వెసులుబాటు. అదే ఈ సినిమాకు ప్లస్ అయ్యి... లిబర్టీ తీసుకునేందుకు అవకాసం ఇచ్చింది.

RRR Movie

వీటిన్నిటితో పాటు ఈ మేడర్న్ డే ఆడియన్స్ అభిరుచులకు తగ్గ థీమ్ ని పీరియడ్ కథలో కలపగలగాలి. లేకపోతే ఇంట్రస్ట్ పోతుంది. అది రాజమౌళి ఈ స్క్రిప్టులో  సమర్దవంతంగా చేయగలిగారు.  .ఇంట్రవెల్ అయ్యాక అజయ్ దేవగన్ ప్లాష్ బ్యాక్ రావటం వల్ల కావచ్చు కొంతమేర ఎగ్జైటింగ్ గా అనిపించదు. డల్ అయ్యింది. అయితే అన్ని పాత్రలను తెరపై బాలెన్స్ చేయాలనుకున్నప్పుడు ఇలాంటి ఇబ్బందులు ఎదురౌతాయి. యాక్షన్ ఎపిసోడ్స్ చాలా పవర్ ఫుల్ గా , కళ్లు తిప్పుకోనివ్వని స్దాయిలో ఉండటం వీటిని చాలా వరకూ అధిగమించగలిగే అవకాసం కల్పించింది.

RRR Movie


రాజమౌళికుఇదే పెద్ద టాస్క్

 
 ఇద్దరు సూప‌ర్ స్టార్ల‌తో సినిమాలు తీయటం అంటే మాటలు కాదు. అయితే అవతలి ఏ హీరో ఉన్నా తన యాక్షన్ స్కీమ్ లోకి తెచ్చుకోవటం రాజమౌళికి అలవాటు. వాళ్ల ఇమేజ్ లకు ఇంపార్టెన్స్ ఇస్తూనే తన స్టైల్ లో యాక్ష‌న్ ప్యాకేజీని ప్రిపేర్ చేస్తాడు. అదే “ఆర్ ఆర్ ఆర్” కు చేసారు. అలాగే రాజమౌళి ప్రధాన బలం...స్ట్రాంగ్ ఎమోషన్స్...వాటికీ ఈ సినిమాలో స్దానం ఉంది. దేశభక్తి అనే థ్రెడ్ కు ప్రెండ్షిప్ అనే యూనివర్శల్ అప్పీల్  ని యాడ్ చేసి నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్లే ప్రయత్నం చేసారు. అలాగే ఎప్పటిలాగే స్టెప్ బై స్టెప్ కథలో కాంప్లిక్ట్స్ పెంచే స్క్రీన్  ప్లేని డిజైన్ చేసారు. ఫస్టాఫ్ ని క్యారక్టర్స్ పరిచయం, కాంప్లిక్స్ ని ఇంట్రడ్యూస్ చేసి, రెండు పాత్రలను కలిసినప్పుడు మలుపు తీసుకున్నారు. వాస్తవానికి ఇది కొత్త స్క్రీన్  ప్లే ఏమీ కాదు. అకిరాకురుసోవా సెవన్ సమురాయ్ నుంచి షోలే ...ఆ తర్వాత ఆ మోడ్ లో వచ్చిన అనేక సినిమాల్లో ఫాలో అయ్యినదే. అయితే ఈ మద్యకాలంలో ఎవరూ టచ్ చేయలేదనేది నిజం.  ఫార్మెట్ పాతదైనా నేపధ్యం, నటలు కొత్తగా కనిపంచేసరికి అది లేటెస్ట్ ట్రెండ్ లోకి వచ్చేస్తుంది. దానికి తోడు పీరియడ్ ఫిల్మ్ కావటంతో సీన్స్, విజువల్ అప్పీరియన్స్ కొత్తగా కనిపించాయి.

rrr movie review,

ఎన్టీఆర్, చెర్రిలలో ఎవరు బాగా...

  ఇద్దరి హీరోల్లో ఎవరు బాగా చేసారు అంటే.. ఇద్దరూ ఒకరికొకరు పోటీ పడి చేసారు. దర్శకుడుగా రాజమౌళికు ఈ ఇద్దరితో చేసిన అనుభవంతో వాళ్ల బలాలు,బలహీనతలు తెలుసు. వాటిని దృష్టిలో పెట్టుకుని సీన్స్ డిజైన్ చేయటంతో ఫెరఫెక్ట్ గా ఆ పాత్రలకు మ్యాచ్ అయ్యారు. ఎన్టీఆర్ పాత్ర కాస్త ఎక్కువ కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే కథకు ఎమోషన్ ఆర్క్ ఇచ్చేది ఆ పాత్రే కాబట్టి. ఇక ఎన్టీఆర్ ఇంట్రో, ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ కొమరం భీముడో సీక్వెన్స్ ఎన్టీఆర్ ని నెక్ట్స్ లెవిల్ లో చూపెడతాయి.అలాగే తన ఎదురుగా ఉన్న మరో  స్టార్ ని నటనతో తినేయకుండా బాలెన్స్ చేసుకుంటూ ఎన్టీఆర్ ముందుకు వెళ్లారు. ఫస్టాఫ్ ఎన్టీఆర్ విశ్వరూపం చూపిస్తే..సెకండాఫ్ రామ్ చరణ్ తనేంటో ,తన కెపాసిటీ ఏంటో చూపిస్తే ముందుకు వెళ్తారు. రామ్ చరణ్ ఇంట్రడక్షన్ కథలోంచి తీసుకుని ..చాలా బాగా డిజైన్ చేసారు. ఆ విధంగా చూస్తే ఎన్టీఆర్ ఇంట్రడక్షనే కాస్త సినిమాటెక్ గా అనపిస్తుంది. కానీ చాలా బాగుంది. హై మూమెంట్స్ కూడా ఇద్దరికి ఫెరఫెక్ట్ గా షేర్ చేయటంతో ఇద్దరిలో ఒకరే బాగా చేసారని ఎక్కడా చెప్పలేని విధంగా ఉంటుంది. ఆర్.ఆర్.ఆర్ కు ఈ ఇద్దరి హీరోలను తప్పించి వేరే వాళ్లను ఊహించుకోలేమన్నట్లుగా ఉంది.
 

rrr movie review,


మిగతా కాస్టింగ్
 
ఇలాంటి సినిమాలకు సపోర్టింగ్ ఆర్టిస్ట్ లు కూడా బాగా అవసరం. ఓ ప్రక్క అలియాభట్, ఒలివియా మోరీస్‌ సినిమాకు ప్లస్ అయ్యారు. అయితే అలియాభట్ చేయటానికి పెద్దగా ఏమీ లేదనిపించేలా ఉన్నాయి ఆమె సీన్స్. ఒలివియా మోరీస్‌ ఫస్టాఫ్ లో కనపడి.. తన పాత్రకు న్యాయం చేసింది. అజయ్ దేవగన్,శ్రియ ..ప్లాష్ బ్యాక్ లో కనిపిస్తారు. ఆ పాత్ర ఎవరైనా అలాగే చేస్తారనిపిస్తుంది. నథింగ్ స్పెషల్. సముద్రఖని ఎప్పటిలాగే తన ప్రెజెన్స్ ఉన్నంతవరకూ దృష్టిని తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేసారు. రాహుల్ రామకృష్ణ ఓకే. మిగతావాళ్లు సోసో అనిపిస్తారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ తెరపై ఉన్నప్పుడు వేరే వాళ్లపై దృష్టి పెద్దగా వెళ్లదు.

RRR Movie


టెక్నికల్ గా...

స్క్రిప్టు పరంగా  ఫస్టాఫ్ లో వంక పెట్టడానికి లేదు. పరుగెత్తింది. ఇంటర్వెల్ అయ్యాక వచ్చే సెకండాఫ్ లో  ముప్పై నిముషాల ఎపిసోడ్ సింగిల్ థ్రెడ్ మీద నడుస్తుంది. దాన్ని కాస్త తగ్గిస్తే బాగుండేది. అలాగే సెకండాఫ్ రొటీన్ కాకుండా చూసుకోవాల్సింది. ఓ గిరిజన పిల్ల కిడ్నాప్ అనే అంశం...ఇంత పెద్ద సినిమాకు మెయిన్ థ్రెడ్ గా సరిపోలేదనిపిస్తుంది. కథేంటిరా అదే చెప్పాలి కాబట్టి. అయితే ఒక్కోసారి సింపుల్ ఈజ్ సూపర్బ్ అవ్వచ్చు. ఇక ఈ సినిమాలో స్పెషల్ హైలెట్ సౌండ్ డిజైన్. యాక్షన్ ఎపిసోడ్స్ కు నెక్ట్స్ లెవిల్ లోకి తీసుకెళ్లింది. ఇక పాటల్లో నాటు నాటు సాంగ్ కు ఓ రేంజిలో రెస్పాన్స్ వచ్చింది. ఆ పాట కొరియోగ్రఫీ కూడా తెరపై విజిల్స్ వేసే స్దాయిలో ఉంది. మిగతావి మాములుగా ఉన్నాయి.  బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం అరిపించారు. ఇక ఈ సినిమాకు మరో హైలెట్ సెంథిల్ కెమెరా వర్క్. రాజమౌళి ప్రతీ సినిమాకు బ్యాక్ బోన్ గా నిలిచినట్లే ఈ సినిమాకు నిలిచారు. అడివి లో వచ్చే సీన్స్ అయితే అద్బుతం అనిపిస్తాయి. ఎడిటర్ సెకండాఫ్ కాస్తంత షార్ప్ గా సీన్స్ చెయ్యాల్సింది. రైటింగ్ పరంగా విజయేంద్రప్రసాద్ గారి గురించి చెప్పుకునేదేముంది. భారీ సినిమా కథలకు ఆయన బ్రాండ్ అంబాసిడర్. ఎక్కడ ఏ ఎమోషన్ రావాలో ఆయన తెలుసు. ఎలాంటి కథనైనా జనరంజకంగా చెప్పగలరని మరో సారి ప్రూవ్ చేసారు. ఆర్ట్ ,కాస్టూమ్స్ డిపార్టమెంట్స్  ని ఇలాంటి పీరియడ్ సినిమాల్లో ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి.

RRR Movie

ఓవరాల్ గా...

ఆర్.ఆర్.ఆర్ ఫస్టాఫ్ అధిరిపోయింది. సెకండాఫ్ కాస్త గాడి తప్పి రొటీన్ అనిపించినా, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లలో సర్దుకున్నాడు. హీరోలు ఇద్దరి నుంచి నటనాపరంగా ఎంత పిండాలో అంత రాజమౌళి తీసుకున్నారు.   ఎపిసోడ్స్  వైజ్ గా సినిమా నచ్చుతుంది. యాక్షన్ సీక్వెన్స్ లు చాలా బాగా డిజైన్ చేసారు.
 

rrr movie review,


'బాహుబలి'తో పోలిక

ఈ సినిమాని బాహుబలితో పోలిక పెట్టడం అనవసరం. అది వేరు ఇది పూర్తిగా వేరు. ప్రతీ సినిమా బాహుబలి కాదు. ఆర్.ఆర్. ఆర్ అంతకన్నా కాదు. బాహుబలి దర్శకుడు కొత్త సినిమా అని దృష్టిలో పెట్టుకోకుండా ఈ సినిమాని ఫ్రెష్ గా చూడాలి. అప్పుడే ఎంజాయ్ చేయగలుగుతాం.

rrr movie review,


నచ్చేవి

ఎన్టీఆర్
రామ్ చరణ్

ఇద్దరి హీరోలు ఇంట్రో సీన్స్, వాళ్లకు ఇచ్చే ఎలివేషన్స్

ప్రీ ఇంట్రవెల్ ఎపోస్డ్, ఇంట్రవెల్
క్లైమాక్స్

నచ్చనవి
సెకండాఫ్ లో వచ్చే ప్లాష్ బ్యాక్
కొన్ని ఫోర్సెడ్ ఎమోషన్స్
సీతగా అలియాభట్ క్యారక్టర్ కు పెద్దగా ప్రయారిటీ లేకపోవటం

rrr movie review,


ఫైనల్ థాట్

History In Action...Paisa Vasool reaction
 
Rating: 3.5

ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) (Roudram Ranam Rudhiram) టైటిల్ తో (NTR) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు (Ram Charan) ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కింది. 


ఎవరెవరు..

బ్యానర్: డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
నటీనటులు :యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్,  సముద్ర ఖని, అజయ్ దేవగన్, అలియా భట్, శ్రియ, ఒలివియా మోరీస్‌ తదితరులు.
మాట‌లు:  సాయిమాధ‌వ్ బుర్రా, క‌ర్కీ,
కాస్ట్యూమ్ డిజైన‌ర్‌: ర‌మా రాజ‌మౌళి.
 ఎడిట‌ర్‌:శ్రీక‌ర్ ప్ర‌సాద్‌,
వి.ఎఫ్‌.ఎక్స్ సూప‌ర్ విజ‌న్‌:  వి.శ్రీనివాస్ మోహ‌న్‌,
 మ్యూజిక్‌:  ఎం.ఎం.కీర‌వాణి,
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌:  సాబు సిరిల్‌,
సినిమాటోగ్ర‌ఫీ:  కె.కె.సెంథిల్‌కుమార్‌,
క‌థ‌:  వి.విజ‌యేంద్ర‌ప్ర‌సాద్‌,
 నిర్మాత‌:  డి.వి.వి.దాన‌య్య‌,
స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం:  ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి.

click me!