RRR: వామ్మో థియేటర్ లో ఉపాసన మామూలు రచ్చ కాదుగా.. చరణ్ టెరిఫిక్ పెర్ఫామెన్స్ ఎంజాయ్ చేస్తూ..

Published : Mar 25, 2022, 10:05 AM IST

రాంచరణ్, ఉపాసన అభిమానులతో కలసి థియేటర్ లో ఆర్ఆర్ఆర్ చిత్రం వీక్షించారు. ఉపాసన అభిమానులతో పాటు పేపర్లు విసురుతూ కేరింతలు కొట్టారు.   

PREV
16
RRR: వామ్మో థియేటర్ లో ఉపాసన మామూలు రచ్చ కాదుగా.. చరణ్ టెరిఫిక్ పెర్ఫామెన్స్ ఎంజాయ్ చేస్తూ..
RRR Movie

దర్శకధీరుడు రాజమౌళి చెక్కిన మరో విజువల్ వండర్ 'ఆర్ఆర్ఆర్' చిత్రం. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆల్రెడీ ప్రీమియర్ షోలు పడిపోయాయి. యుఎస్, ముంబై సహా నార్త్ మొత్తం.. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఆర్ఆర్ఆర్ చిత్రానికి యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ మొదలైంది. థియేటర్స్ వద్ద అభిమానుల హంగామా మామూలుగా లేదు. 

26
RRR Movie

రాంచరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ తమ కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చారు అంటూ ఫ్యాన్స్ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. రాజమౌళి ఈ ఇద్దరి హీరోల నటనని తనకు కావాల్సిన విధంగా పిండేసుకున్నారు అంటున్నారు. ఈ చిత్రంలో గూస్ బంప్స్ తెప్పించే అద్భుతమైన సన్నివేశాలు చాలా ఉన్నాయి అంటూ ప్రశంసలు దక్కుతున్నాయి. 

36
RRR Movie

ఇదిలా ఉండగా ఈ తెల్లవారు జామునే.. ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులు ఇతర సెలెబ్రిటీలతో ఆర్ఆర్ఆర్ చిత్ర స్పెషల్ స్క్రీనింగ్ వీక్షించారు. ఇక రాంచరణ్, ఉపాసన ఓ థియేటర్స్ లో అభిమానులతో కలసి ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని వీక్షించారు. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆసక్తికర విషయం ఏంటంటే.. ఎప్పుడూ సైలెంట్ గా ఉండే ఉపాసన ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని చూస్తూ మాస్ అభిమానిగా మారిపోయారు. 

46
RRR Movie

తన భర్త రాంచరణ్ టెర్రిఫిక్ పెర్ఫామెన్స్ ని ఎంజాయ్ చేస్తూ అభిమానులతో కలసి పేపర్లు విసిరారు. ఉపాసన తెగ ఎంజాయ్ చేస్తున్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా నాటు నాటు సాంగ్ వస్తున్నప్పుడు ఉపాసన పైకి లేచి మరీ పేపర్లు విసిరారు. 

 

56
RRR Movie

సినిమా చూసి రాంచరణ్ థియేటర్ నుంచి రాగానే అభిమానుల నుంచి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. రాంచరణ్ ని ఫ్యాన్స్ అంతా కేరింతలు కొడుతూ చుట్టుముట్టారు. అనంతరం రాంచరణ్ ఫ్యాన్స్ కి అభివాదం చేస్తూ బస్సులో వెళ్లారు. 

 

66
RRR Movie

ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఇద్దరి హీరోల ఇంట్రడక్షన్ సీన్స్, ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్, క్లైమాక్స్ ఊహకు అందని విధంగా టెరిఫిక్ గా ఉన్నాయంటూ ప్రశంసలు దక్కుతున్నాయి. రాజమౌళి మరోసారి తెలుగు సినిమా స్థాయిని పెంచారు. ఇండియన్ సినిమాలో తిరుగులేని దర్శకుడిగా మరోసారి నిరూపించుకున్నారు. 

click me!

Recommended Stories