కాళ్లు పట్టుకున్నా వినలేదు.. `1995 నిర్ణయం`పై చంద్రబాబు సంచలన విషయాలు వెల్లడి.. బాలయ్య సమక్షంలోనే అది జరిగిందా

Published : Oct 11, 2022, 08:55 PM IST

చంద్రబాబు.. ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచాడని కామెంట్ గత రెండున్నర దశాబ్దాలుగా వినిపిస్తుంది. తాజాగా ఈ సంచలన విషయంపై నోరు విప్పారు చంద్రబాబు నాయుడు. షాకింగ్‌ విషయాలు వెల్లడించారు.   

PREV
15
కాళ్లు పట్టుకున్నా వినలేదు.. `1995 నిర్ణయం`పై చంద్రబాబు సంచలన విషయాలు వెల్లడి.. బాలయ్య సమక్షంలోనే అది జరిగిందా

చంద్రబాబు నాయుడు ఇంటర్వ్యూలివ్వడం చాలా అరుదు. అలాంటిది ఆయన ఎంటర్‌టైన్‌మెంట్‌ షోకి వచ్చారు. బావమరిది, నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ హోస్ట్ గా రన్‌ అవుతున్న `అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్బీకే2` షోలో చంద్రబాబు నాయుడు గెస్ట్ గా పాల్గొన్నారు. `ఆహా` ఓటీటీ ప్రసారమయ్యే టాప్‌ షో ఇది. తాజాగా రెండో సీజన్ ప్రారంభం కాబోతుంది. అక్టోబర్‌ 14 నుంచి ఇది ప్రసారం కానుంది. 
 

25

తాజాగా మొదటి ఎపిసోడ్‌కి గెస్ట్ గా వచ్చిన చంద్రబాబు నాయుడికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో బాలయ్య, చంద్రబాబు మధ్య సంచలనాత్మక విషయాలపై చర్చ జరగడం విశేషం. చంద్రబాబు లైఫ్‌లో అతి పెద్ద నిర్ణయం ఏంటనేది బాలయ్య ప్రశ్నించగా `1995 నిర్ణయం` అని చంద్రబాబు తెలిపారు. ఒక వ్యక్తిగా మిమ్మల్ని నేను అడుగుతున్నా. ఆ రోజు మనం తీసుకున్న నిర్ణయం తప్పా?.. అని చంద్రబాబు ప్రశ్నించగా, ఆ రోజు నాకు బాగా గుర్తుంది అని బాలయ్య చెప్పారు. 
 

35

`ఆయన్ని కాళ్లు పట్టకుని అడుకున్నా నా మాట వినండి అని, కానీ వినలేదని, ఇక వేస్ట్.. ` అని తాను ఆ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ప్రోమోలో సస్పెన్స్ లో పెట్టారు. అసలు చంద్రబాబు నిర్ణయం తీసుకోవడానికి దోహద పడ్డ పరిస్థితులేంటి? చంద్రబాబు దీనిపై ఏం చెప్పబోతున్నారనేది ఇప్పుడు ఆద్యంతం ఆసక్తికరంగా మారింది. ఇది రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. 
 

45

1995లో ఉమ్మది ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్‌ నుంచి టీడీపీ పార్టీ, అధికార పగ్గాలను చంద్రబాబు తీసుకున్న విషయం తెలిసిందే. అందుకు నందమూరి కుటుంబ సభ్యులు కూడా చంద్రబాబుకి సపోర్ట్ లభించిందని సమాచారం. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే చంద్రబాబుపై ఆ మచ్చ ఉన్నది. ఈ షో ద్వారా దానికి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. దీంతోపాటు అనేక సంచలన విషయాలను చంద్రబాబు ఎపెన్‌గా చెప్పబోతున్నారని సమాచారం. అయితే బాలయ్య సమక్షంలోనే ఇదంతా జరిగిందనేది తాజాగా ఆయన కామెంట్లని బట్టి తెలుస్తు

55

ఇందులో మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి మ్యాటర్‌ కూడా ప్రస్తావనకు వచ్చింది. తన లైఫ్‌లో బెస్ట్ ఫ్రెండ్‌ వైఎస్‌ఆర్‌ అని తెలిపారు చంద్రబాబు. ఇద్దరం కలిసి తిరిగేవాళ్లమని చెప్పారు. ఇద్దరు కలిసి చేసిన అనేక విషయాలను ఇందులో చంద్రబాబు చెప్పినట్టు తెలుస్తుంది. దీంతో ఈ ప్రోమో ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ శుక్రవారం ఈ ఎపిసోడ్‌ `ఆహా`లో స్ట్రీమింగ్‌ కానుంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories