చంద్రబాబు, లోకేష్‌ కలిసి తన సంసారంలో నిప్పులు పోస్తున్నారంటూ బాలయ్య ఆరోపణ.. రెండో ఫ్యామిలీ మ్యాటర్‌ లీక్‌..

Published : Oct 11, 2022, 07:47 PM IST

నందమూరి బాలకృష్ణ తన బావ చంద్రబాబు నాయుడు, అల్లుడు నారా లోకేష్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వారిద్దరు కలిసి తన సంసారంలో నిప్పులు పోస్తున్నారని ఆరోపణలు చేశారు.   

PREV
17
చంద్రబాబు,  లోకేష్‌ కలిసి తన సంసారంలో నిప్పులు పోస్తున్నారంటూ బాలయ్య ఆరోపణ.. రెండో ఫ్యామిలీ మ్యాటర్‌ లీక్‌..

బాలకృష్ణ హోస్ట్ గా మారి విజయవంతంగా నిర్వహించబడుతున్న షో `అన్‌స్టాపబుల్‌`. గతేడాది మొదటి సీజన్‌ నిర్వహించగా అద్భుతమైన స్పందనతోపాటు ఇండియాలోనే టాప్‌ టాక్‌ షోగా నిలిచింది. తాజాగా దీనికి రెండో సీజన్‌ ప్రారంభించారు. `అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్బీకే2` పేరుతో రన్‌ అయ్యే ఈ షోకి సంబంధించిన తొలి ఎపిసోడ్‌ ప్రోమో విడుదలైంది. 
 

27

`అన్‌స్టాపబుల్‌విత్‌ ఎన్బీకే 2` షో ఈ నెల 14(శుక్రవారం) నుంచి ప్రసారం కానుంది. అందులో భాగంగా నేడు(మంగళవారం) సాయంత్రం ఈ షోకి సంబంధించి తొలి ఎపిసోడ్‌ ప్రోమోని విడుదల చేశారు. తొలి ఎపిసోడ్‌కి మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గెస్ట్ గా వచ్చిన విషయం తెలిసిందే. బావబావమరుదుల మధ్య సంభాషణల ఆద్యంతం ఎంటర్‌టైనింగ్‌గా సాగడం విశేషం. 
 

37

ఇందులో మొదట బాలయ్య తన ఫ్యామిలీకి సంబంధించిన షాకింగ్‌ విషయాలు బయటపెట్టారు. తనకిప్పుడు రెండు ఫ్యామిలీలున్నాయన్నారు. జూబ్లీహిల్స్ లోని రోడ్ నెంబర్‌ 45లో వసుందర, పిల్లలున్నారని చెప్పారు. గతేడాది నుంచి మరో ఫ్యామిలీని మెయింటేన్‌ చేస్తున్నానని షాకిచ్చాడు. గతేడాది నుంచి ఇంకో ఫ్యామిలీ స్టార్ట్ అయ్యాయనని, చాలా డీప్‌గా కనెక్ట్ అయిపోయా అని తెలిపారు. బావ చంద్రబాబు నాయుడు ముందే ఈ విషయాన్ని వెల్లడించడం విశేషం. `అన్‌స్టాపబుల్‌` టాక్‌ షోని బాలయ్య తన రెండో ఫ్యామిలీగా వర్ణించడం విశేషం.

47

ఇది విన్న చంద్రబాబు నాయుడు.. బాలయ్యపై పంచ్‌ వేశాడు. ఇది పెద్ద బ్రేకింగ్‌ న్యూస్‌ అని, అర్జెంట్‌గా వసుందరకి ఫోన్‌ చేసి చెప్పాలనడం హౌజ్‌లో నవ్వులు పూయించింది. మరోవైపు `మీ లైఫ్‌లో మీరు చేసిన మోస్ట్ రొమాంటిక్‌ పనేంటి?` అని చంద్రబాబుని బాలయ్య ప్రశ్నించగా, మీకంటే ఎక్కువే చేశానని చెప్పాడు చంద్రబాబు నాయుడు. మీరు సినిమాల్లో చేశారు. నేను స్టూడెంట్‌గా చేశానని తెలిపారు. అమ్మాయిలు కనిపిస్తే సైలెన్సర్‌ తీసేసి, కీక్‌ కీక్‌ అంటూ హార్న్ చేసేవాళ్లమని తెలిపారు. 
 

57

మరోవైపు తన చెల్లి(భువనేశ్వరి) మ్యాటర్‌ తీసుకొచ్చాడు బాలయ్య. మా చెల్లిని ఏమని పిలుస్తారు బావ అని అడగ్గా, `భూ.. `అని పిలుస్తా అని చెప్పడంతో హౌజ్‌లో అరుపులు హోరెత్తాయి. అంతటితో వదల్లేదు. అందరి సాక్షిగా మా చెల్లికి ఐ లవ్ యూ చెప్పాలని పట్టుబట్టాడు బాలయ్య. దీంతో వెంటనే భువనేశ్వరికి ఫోన్‌ చేసిన చంద్రబాబు.. మీ బాలకృష్ణగారి చేతిలో ఇరుక్కుపోయా నేను అంటూ మాట్లాడటం మరింత నవ్వులు పూయించింది. 

67

అంతలోనే నారా లోకేష్‌ షోలోకి వచ్చాడు. అల్లుడుని కూడా వదల్లేదు బాలయ్య. మీ నాన్న ఈ గెటప్‌లో తప్ప, మరేదైనా గెటప్‌లో కనిపించడా అని ప్రశ్నించగా, యూరప్‌కి వెళ్లినా ఇదే గెటప్‌, మాల్దీవులకు వెళ్లినా ఇదే వేసుకుంటాడు` అని చెప్పడంతో నవ్వులు విరిసాయి. ఆ తర్వాత కాసేపు లోకేష్‌.. హోస్ట్ గా చేశాడు. అటు తండ్రి చంద్రబాబుని, ఇటు బాలయ్యని కాసేపు ఆడుకున్నాడు. 
 

77

ఇంట్లో కుకింగ్ మీ ఇద్దరిలో ఎవరు చేస్తారు అని లోకేష్‌ ప్రశ్నించగా, సలహాలిస్తానని చెప్పాడు బాలయ్య. బావ ఒక్కసారి కూడా వండిపెట్టలేదా మా చెల్లాయికి అని అడగ్గా, నేను వండుకోలేదు, ఆవిడకి ఎక్కడ వండిపెడతానిక` అంటూ పంచ్‌ వేశాడు. అంతేకాదు మరో ప్రశ్న.. ఇద్దరిలో భార్య మాట ఎవరు ఎక్కువ వింటారు అని ప్రశ్నించగా, పబ్లిక్‌గా ఓకే అనడానికి నా ఈగో ఒప్పుకోవడం లేదు అల్లుడు అంటూ బాలయ్య చెప్పారు. అంతేకాదు తండ్రి కొడుకులు కలిసి నా సంసారంలో నిప్పులు పోస్తున్నారని, లోకేష్‌ని వచ్చి గెస్ట్ సీట్లో కూర్చోమని చెప్పారు బాలయ్య. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories