Guppedantha Manasu: రాజీవ్, వసుకి పెళ్లి చేస్తున్న చక్రపాణి.. వసుధార కోసం బయలుదేరిన రిషి?

Published : Dec 31, 2022, 09:08 AM IST

Guppedantha Manasu: బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు డిసెంబర్ 31వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం  

PREV
18
Guppedantha Manasu: రాజీవ్, వసుకి పెళ్లి చేస్తున్న చక్రపాణి.. వసుధార కోసం బయలుదేరిన రిషి?

ఈరోజు ఎపిసోడ్ లో చక్రపాణి జగతి తో ఫోన్ మాట్లాడుతూ నా కూతురు గొంతు కోస్తున్నావా అనగా అప్పుడు వసు నాన్న మర్యాదగా మాట్లాడండి అనడంతో వసుధార మీద సీరియస్ అవుతాడు. అప్పుడు జగతి చక్రపాణి గారు మాటలు కొంచెం మర్యాదగా మాట్లాడండి రిషి నా కన్నా కొడుకు అనడంతో అయితే ఈ పెళ్లికి నేను అస్సలు ఒప్పుకోను అని అంటాడు చక్రపాణి. నీ ట్రైనింగ్ ఇవ్వడం వల్ల నా కూతురు పెళ్లి పీటల మీద నుంచి లేచిపోయింది ఇప్పుడు నీ ఇంటికి కోడలుగా వస్తే నా ఇంట్లో వాళ్ళందరూ ఉర్రేసుకునేలా చేస్తుంది అని అంటాడు. ఈ పెళ్లి జరగను గాక జరగదు అనడంతో ఒక్కసారి నా మాట వినండి అని అంటుంది జగతి.
 

28

నీ పాదాలు ఎక్కడున్నాయి చెప్పు నీ పాదాలకు నమస్కారం చేసుకుంటాను నన్ను నా కూతుర్ని నా ఫ్యామిలీని వదిలిపెట్టు అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. అప్పుడు నాన్న మేడం తో మాట్లాడే పద్ధతి ఇదేనా నా పెళ్లి నా ఇష్టం అని అనడంతో వసుధార మొబైల్ లాక్కొని వసుని ఒక గదిలో పెట్టి బంధిస్తాడు చక్రపాణి. ఇంతలోనే చక్రపాణి ఒక బాటిల్ లో నీళ్లు తీసుకుని వచ్చి అందులో ఒక పౌడర్ కలిపి ఏమిటి ఆ నీళ్లు అనడంతో విషం అని అంటాడు. పొరపాటున నువ్వు తలుపు తీశావంటే ఈ నీళ్లు తాగి చచ్చిపోతాను నా సంగతి నీకు తెలుసు కదా అని బెదిరిస్తాడు. అప్పుడు సుమిత్ర కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది.

38

ఆ తర్వాత రాజీవ్ చక్రపాణి తో ఫోన్ మాట్లాడుతూ మీ కష్టాలకు నష్టాలకు అన్నింటికి తోడు ఉండే ఈ రాజీవ్ ఉన్నాడు. నీకు అల్లుడు మాత్రమే కాదు నీ కుటుంబానికి వాచ్మెన్ లా కూడా పనిచేస్తాడు. మీ పరువు పోయిన నా పరువు పోయిన ఒకటే పరువు కోసమే తాపత్రయ పడే మామయ్య గారు ఉండడం నా అదృష్టం అంటూ చక్రపాణిని ఐస్ చేస్తూ ఉంటాడు రాజీవ్. అప్పుడు భారం మొత్తం ఇదే అల్లుడు అని అంటాడు చక్రపాణి. మరొకవైపు జగతి జరిగిన విషయాలు మహేంద్రతో చెప్పడంతో ఈ విషయం రిషికి చెబుదామా అని అనగా వద్దు మహేంద్ర రిషి పొరపాటున ఏదైనా ఒక మాట అంటే వాళ్ళిద్దరి బంధానికి ఇబ్బంది అవుతుంది అని అంటుంది.
 

48

మరి రిషికి చెప్పకుండా మనం అక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉంటే ఎలా చెప్పు అని అంటాడు. అప్పుడు మనం అందరికంటే ముందుగా వెళ్దాము అని అంటుంది జగతి. మహేంద్ర ఆలోచనలో పడడంతో ఇంకేం ఆలోచించకు మహేంద్ర మనం వెళ్దాం అని అంటుండగా ఇంతలో అక్కడికి దేవయాని వచ్చి వారి మాటలు విని  నువ్వు ఇలా ప్లాన్ చేస్తున్నావా నేను అక్కడికి వచ్చిన ఇక్కడ ఉన్న అక్కడ పరిస్థితులు అన్నీ నాకు అనుకూలంగానే ఉంటాయి అని రాజీవ్ కి ఫోన్ చేయడానికి పక్కకు వెళుతుంది దేవయాని. ఆ తరువాత దేవయాని రాజీవ్ కి ఫోన్ చేసి జరిగింది మొత్తం వివరిస్తుంది. సరే సరే మాటలు తగ్గించి ఫస్ట్ పని మొదలు పెట్టు అని అంటుంది దేవయాని.

58

ఆ తర్వాత మహేంద్ర జగతి బయలుదేరి వెళుతుండగా ఇంతలో దేవయాని ఎదురుపడి ఏంటి మహేంద్ర ఎక్కడికో వెళ్తున్నట్టు ఉన్నారు అని అంటుంది. ఇప్పుడు మహేంద్ర చీరలు అవి కొన్ని తీసుకొని రావడానికి వెళ్తున్నాము అని అంటాడు. అప్పుడు సరే మహేంద్ర వెళ్ళిరండి అని అంటుంది. ఇప్పుడు వసు కిటికీలో నుంచి అమ్మ తలుపు తీయమ్మ అని ఏడుస్తూ అడుగుతూ ఉండగా సుమిత్ర ఏం చేయలేక అలాగే ఏడుస్తూ ఉంటుంది. అమ్మ నాన్న ఊరికే బెదిరిస్తున్నారు తన మాటలు నమ్ము అని అంటుంది వసుధార. అప్పుడు వసు ఎన్ని చెప్పినా కూడా సుమిత్ర తలుపు తీయలేనమ్మ అని అంటుంది. కనీసం ఫోను అయినా ఇవ్వమ్మా అనడంతో నావల్ల కాదు అని అంటుంది సుమిత్ర.

68

ఇంతలోనే చక్రపాణి పూల దండలు పూలు అన్ని తీసుకొని వస్తాడు. ఇప్పుడు వాకిలి తీశావంటే నేను తాగి చచ్చిపోతాను అని సుమిత్రను బెదిరిస్తాడు. అప్పుడు ఈ పూలు అవన్నీ ఏంటండీ అనడంతో పెళ్లి సామాగ్రి అనడంతో వసు షాక్ అవుతుంది. రాజీవ్ తో వసుధారకి పెళ్లి చేయబోతున్నాను అనగా వసుధార ఒక్కసారిగా షాక్ అవుతుంది. నేను చెప్పినట్టు జరగకపోతే విషం తాగి చచ్చిపోతాను అని బెదిరిస్తాడు చక్రపాణి. మరుసటి రోజు ఉదయం వసుధార లోపల ఏడుస్తూ ఉండగా సుమిత్ర బాధపడుతూ ఉంటుంది. అప్పుడు చక్రపాణి పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లు అన్ని చేస్తూ ఉంటాడు. తోరణాలు కట్టి పెళ్లికి మొత్తం సిద్ధం చేస్తూ ఉంటాడు. అది చూసిన వసుధార షాక్ అవుతుంది.
 

78

అప్పుడు వసు గట్టిగా అరుస్తూ నీకు చెప్తే అర్థం కాదా నాన్న అమ్మ నువ్వు చూస్తూ అలాగే ఉంటావా నీకు బాధ్యత లేదా అని అంటుంది. అప్పుడు చక్రపాణి అలా కూర్చున్నావ్ ఏంటి వచ్చి నాకు పెళ్లి పనులు సహాయపడు అని అంటాడు. ఇంకొక మాట మీరిద్దరూ మాట్లాడారు అంటే నేను విషం తాగి చచ్చిపోతాను అని బెదిరిస్తాడు. ఇంతలోనే ఫోన్ రావడంతో అమ్మ ప్లీజ్ అమ్మ ఫోన్ ఇవ్వు అంటుంది వసు. ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేస్తూ వసుధారని సుమిత్ర ని మాట్లాడకుండా చేస్తాడు. ఇప్పుడు రిషి ఫోన్ చేయడంతో సుమిత్ర స్పీకర్ ఆన్ చేస్తుంది. అప్పుడు రిషి ఏంటి వసు ఏం జరుగుతుంది మీ బావ వచ్చి ఏదేదో వాగి వెళ్తున్నాడు నాకేం అర్థం కావడం లేదు అని అంటాడు.

88

నేను వస్తున్నాను వసుధర మా వాళ్ల కోసం కాని ఎవరికోసం నువ్వు ఎదురు చూడకు నేను వస్తున్నాను అని అంటాడు. వసుధర మనిద్దరిని విడదీసే శక్తి ఎవరికీ లేదు అని అంటాడు రిషి. ఇప్పుడు రిషి ఫోన్ కట్ చేసి అక్కడ నుంచి బయలుదేరగా చక్రపాణి టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంతలోనే రాజీవ్ పూజారిని తీసుకొని అక్కడికి రావడంతో అది చూసి వసుధర షాక్ అవుతుంది. రాజీవ్ అక్కడికి వచ్చి దొంగ నాటకాలు ఆడుతూ ఉంటాడు. అప్పుడు మామయ్య గారు మీరు నాకు కన్యాదానం చేయడం కాదు నేనే మీ కాళ్లు కడుగుతాను అని అంటాడు. అప్పుడు పంతులు అన్నారు ఇక్కడ ముగ్గురు కంటే ఎక్కువ లేరు అనడంతో కొన్ని అనుకోకుండా జరుగుతున్నాయి మీకు మిగతా విషయాలు పక్కన పెట్టి ఆ అమ్మాయికి నాకు పెళ్లి చేయండి అని అంటాడు రాజీవ్.

click me!

Recommended Stories