Guppedantha Manasu: వసు జ్ఞాపకాలతో సతమతమవుతున్న రిషి.. రాజీవ్ చెంప చెల్లుమనిపించిన చక్రపాణి?

First Published Jan 13, 2023, 9:46 AM IST

Guppedantha Manasu: బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు జనవరి 12వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
 

ఈరోజు ఎపిసోడ్ లో రిషి తన క్యాబిన్లో కూర్చుని ఉండగా ఇంతలో వసుధార అక్కడికి వస్తుంది. లోపలికి రావచ్చా అని అడగగా నువ్వా ఎందుకు వచ్చావు అనగా ఏంటి సార్ రాకూడదా, నన్ను వదిలేసి వచ్చారు కదా అని అనడంతో వసుధార మెడలో తాళిబొట్టు చూసి నువ్వే కదా వెళ్ళిపో వెళ్ళిపో అన్నావు అందుకే వచ్చేసాను అని అంటారు రిషి. ఒక్కొక్క పరిస్థితిలో ఒక్కొక్కలాగా మాట్లాడాలి. ఆ పరిస్థితి నన్ను అలా మాట్లాడేలా చేసింది ఫస్ట్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో వసుధార అనడంతో నన్ను వెళ్లిపోమంటున్నారా అనగా నువ్వు నన్ను వెళ్ళిపో అని చెప్పినప్పుడు నేను వెళ్లి ఫోన్ చెప్పడంలో తప్పు లేదు అంటాడు. నీ చేతిలో మోసపోయాను వసుధార అని అంటాడు.
 

 ఏం జరిగిందో చెప్తాను వినండి సార్ అని అనడంతో నువ్వు నాకేం చెప్పకు అని గట్టిగా అరుస్తాడు. అప్పుడు ఎవరు కనిపించకపోవడంతో వసుధార ఇక్కడికి రాలేదా ఇది అంతా నా బ్రమన అనుకుని బాధపడుతూ ఉంటాడు రిషి. ఇంత మోసం చేస్తుందని అనుకోలేదు వేరేకరితో తాళి కట్టించుకుంది అని బాధపడుతూ ఉంటాడు రిషి. అప్పుడు రిషి తన క్యాబిన్ లో ఉన్న లవ్ సింబల్ ని చూసి బాధపడుతూ ఉంటాడు. అప్పుడు ఫోన్ మోగుతున్న పట్టించుకోకుండా లవ్ సింబల్ వైపు చూస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి మహేంద్ర వచ్చి ఆ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడతాడు. అప్పుడు క్యాబిన్లో ఉన్న ఫైల్స్ అన్ని చల్లా చదురుగా పడి ఉండడంతో అవన్నీ సర్ది ఎరుష దగ్గరికి వెళ్తాడు.
 

మినిస్టర్ గారిపై ఫోన్ చేశాడు ఇండియా లెవెల్లో మిషన్ ఎడ్యుకేషన్ గురించి ప్లాన్ చేయమని చెప్పాడు అనగా అవన్నీ జగతి మేడంని చూసుకోమని చెప్పండి డాడ్ అని అంటాడు. అప్పుడు రిషి చేతిలో ఉన్న లవ్ సింబల్ ని పక్కన పెట్టేసి రిషి బాధపడొద్దు అని చెప్పలేను కానీ బరువును తగ్గించుకో అని అనగా డాడ్ ఈ బరువు నేను ఎత్తుకున్నది కాదు. నాకు వరంగా ఇచ్చిన ఒక శాపం అని బాధతో మాట్లాడుతాడు రిషి. డాడ్ వసు నన్ను మోసం చేసింది నా నన్ను కాదని వేరే వాళ్ళతో ఎలా తాళి కట్టించుకుంటుంది నాకోసం ఆ పెళ్లిని ఎదురించి రాలేదా అని అంటాడు రిషి. నా కోసం అయినా ఆ పెళ్లిని ఎదిరించి రావాలి కదా డాడ్ అని అంటాడు.
 

మాట్లాడరేంటి డాడ్ అనడంతో నేను వసుధార గురించి ఏం మాట్లాడలేకపోతున్నాను రిషి అంటాడు. నిన్ను జగతిని ఆ వసుధార మోసం చేసింది రిషి ఆ వసుధార గురించి ఆలోచించడం మానేయ్ అని కోపంగా మాట్లాడుతాడు మహేంద్ర. ఆ వసుధార గురించి ఆలోచిస్తుంటేనే అని మహేంద్ర తిడుతుండగా ప్లీజ్ డాడ్ వసుధారని ఏమనద్దండి అని అంటాడు. నన్ను కాదనుకొని వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంది కానీ తను చెడ్డది అయిపోదు కదా అలా మాట్లాడకండి అని అనగా ఏంటి రిషి నువ్వు ఇలా ఇంకా ఇలానే మాట్లాడుతున్నావా అని అంటాడు. వసుధార మీద నాకు కూడా కోపంగానే ఉంది కానీ వసుధార ని ఏమైనా అంటే నాకు గుండెల్లో బాధగా ఉంటుంది డాడ్ అని అంటాడు.

కోపం వచ్చినంత మాత్రాన ప్రేమ పోవాలని లేదు కదా డాడ్ అంటూ ఎమోషన్ గా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రిషి కారులో వెళుతూ రాజీవ్,వసుధార అన్నమాట తలుచుకొని బాధపడుతూ అమ్మవారి గుడి దగ్గరికి వెళ్తాడు. ఇక్కడికి వచ్చాను అనుకుంటూ అక్కడికి వెళ్తారు. నేను వచ్చానా లేక నువ్వు రప్పించుకున్నావా అమ్మ అని అంటాడు. వసుధార లేకుండా నన్ను ఒంటరిగా చూడాలని నీకు అనిపించింది ఏమో కదా అమ్మ అందుకే ఒంటరిగా పిలిపించావు అని బాధగా మాట్లాడుతూ ఉంటాడు. నేను ఏడిస్తే నీకు చూసి సరదా పడాలని ఉందేమో కదా అమ్మ,అమ్మ అనే పదమే నాకు అచ్చు రాన్నట్టు ఉంది కదా అని బాధతో మాట్లాడుతాడు రిషి. వసుధార లేకపోయినా ఒంటరిగా బతుకుతాను అనుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.
 

మరొకవైపు హాస్పిటల్ లోకి వెళ్లిన ఎస్సై సుమిత్రను ఇంట్రాగేట్ ఇదంతా ఎలా జరిగిందమ్మా అని అడుగుతాడు. అప్పుడు చక్రపాణి ఇదంతా మా దురదృష్టం సార్ అని అంటాడు. మేము కేసు గురించి అని తెలుసుకోవాలి అని అంటాడు ఎస్ఐ. ఏం మాట్లాడకండి మీ అల్లుడు గారు చెప్పారు అతను చాలా మంచివాడు. కానీ బాధితురాలు చెప్పాలి అని సుమిత్రని ప్రశ్నిస్తూ ఉంటాడు. అప్పుడు సుమిత్ర నాకు దీన్ని స్టేషన్లో పెడతారా అనగా మీరు చెప్పండి అమ్మ అనడంతో సుమిత్ర జరిగిన మొత్తం వివరిస్తుంది. ఇప్పుడు మధ్యలో రాజీవ్ తన బండారం బయటపడుతుందని కలుగజేసుకొని ఏం జరిగినా కూడా వసుధారణ జైలుకు పంపించొద్దండి సార్ అని నాటకాలు ఆడుతూ ఉంటాడు.

 వసుధార నామీద కోపంతో సొంత తల్లిని ఇలా చేసింది అంటూ లేనిపోని నిందలు వేస్తూ ఉంటాడు. అప్పుడు చక్రపాణి ఆ శిక్ష నా కూతురికి కాదు నాకు వెయ్యండి అని అంటాడు. నన్ను ఉరి తీయండి అని అనడంతో వసుధార షాక్ అవుతుంది. నాన్న అనడంతో నువ్వేం మాట్లాడకు వసుధార ఇదంతా నీ వల్లే కదా జరిగింది నువ్వు మేము చెప్పిన టిఫిన్ ఉంటే ఇదంతా జరిగేదా సుమిత్ర అసలు ఏం జరిగిందో నువ్వు చెప్పు అని అంటాడు చక్రపాణి. అప్పుడు రాజీవ్ మా అత్త గొప్ప ఇల్లాలు తన కడుపున పుట్టిందే తనను పొడిచిందని ఎలా చెబుతుంది అనడంతో సుమిత్ర షాక్ అవుతుంది. అప్పుడు పోలీసు రాజీవ్ మాటలను నిజమని నమ్ముతాడు. రాజీవ్ నాటకాలు ఆడుతూ ఉండగా చక్రపాణి రాజీవ్ వైపు అలాగే చూస్తూ ఉంటాడు.
 

అప్పుడు చక్రపాణి ఆ శిక్ష ఏదో నాకు వేయండి ఏం చేస్తాం కడుపున పుట్టిన బిడ్డే ఇలా చేస్తుందని అనుకోలేదు అని అంటాడు. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్లిందో తెలియదు సార్ ఇప్పుడు వచ్చింది ఇలా చేసింది అని రాజీవ్ మాట్లాడుతూ ఉంటాడు. మా మామగారు దేవుడు అనడంతో అవును సార్ నాకు నా అల్లుడు దేవుడిచ్చిన గొప్ప వరం కడుపున పుట్టిన వాళ్లే మాట వినకపోతే అల్లుడుగా వచ్చిన వారు నా బాధను అర్థం చేసుకొని నాకు అండగా నిలబడ్డాడు. జీవితంలో నా దేవుడే నాకు దేవుడులా కనిపిస్తున్నాడు అని అంటాడు. ఎన్ని పుణ్యాలు చేసుకున్నానో ఇలాంటి అల్లుడు దొరికాడు అని అనగా ఏంటి మామయ్య గారు నన్ను పొగుడుతున్నారు అనడంతో రాజీవ్ చెంప చెల్లుమనిపిస్తాడు చక్రపాణి. దాంతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.

click me!