మరొకవైపు రిషి,వసుధార ఫోన్ కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. అసలు అక్కడ ఏం జరుగుతోంది ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది నాకు తిరిగి కాల్ చేయడం లేదు అని ఆలోచిస్తూ ఉంటాడు రిషి. చార్జింగ్ అయిపోయి ఉంటుంది తనే చేస్తుందిలే అనుకుంటూ ఉంటాడు రిషి. ఇంతలోనే దేవయాని ఫోన్ చేయడంతో చెప్పు వసుధార అనగా నేను మీ పెద్దమ్మని అని అంటుంది దేవయాని. అప్పుడు అక్కడ పరిస్థితులన్నీ తెలుసుకొని దేవయాని నవ్వుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత దేవయాని, రాజీవ్ కి ఫోన్ చేస్తుంది. నువ్వు రంగంలోకి దిగాల్సిన సమయం ఆసన్నమైంది ఒళ్ళు దగ్గర పెట్టుకుని చెప్పినట్టు చెయ్యి అని అంటుంది దేవయాని.