అనూహ్యంగా ఇనయా నామినేట్ చేసిన వారమే సూర్య ఎలిమినేట్ అయ్యాడు. అతని ఎలిమినేషన్ ని ఇనయా తట్టుకోలేకపోయింది. క్రష్ అని చెప్పుకుంటూ సూర్యను నామినేట్ చేసి అతనికి వెన్నుపోటు పొడిచావని, ఈ విషయంలో శ్రీహాన్, శ్రీసత్య ఆమెపై మాటల దాడి చేశారు. సూర్య ఎలిమినేట్ అయినపప్పటికీ హౌస్లో తను వాడిన వస్తువులతో సహజీవనం చేసి ఇనయా ప్రేమ చాటుకుంది.