Published : Jul 12, 2020, 09:11 AM ISTUpdated : Jul 12, 2020, 09:14 AM IST
కరోనా బాలీవుడ్‌లో కలవరం సృష్టిస్తోంది. ఇప్పటికే బోని కపూర్, కరణ్ జోహార్, ఆమిర్ ఖాన్ లాంటి ప్రముఖుల ఇళ్లలో పాజిటివ్ కేసులు వెలుగు చూడగా, తాజాగా ఇండియన్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌కు ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్‌కు పాజిటివ్ అని నిర్థారణ కావటంతో ఒక్కసారిగా పరిశ్రమ ఉలిక్కి పడింది. అమితాబ్ వయసు 75 సంవత్సరాలకు పైనే కావటంతో పాటు ఆయన ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉండటంతో ఆయన ఆరోగ్యంపై అభిమానుల్లో ఆందోళన కనిపిస్తోంది. పలువురు సినీ రాజకీయా క్రీడా ప్రముఖులు అభిమానులు త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్లు చేస్తున్నారు.