Rajinikanth : సూపర్‌స్టార్ రజినీకాంత్ 75వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఈ ఏజ్ లో కూడా కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ.. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు తలైవా…తగ్గేదే లేదంటున్నాడు.
ఫిల్మ్ ఇండస్ట్రీ రజినీకాంత్ కు ముందు, ఆ తర్వాత అని చెప్పొచ్చు. ముఖ్యంగా తమిళ సినిమా రూపురేఖలు మార్చేసిన హీరో సూపర్ స్టార్ రజినీకాంత్. హీరో అంటే తెల్లగా, అందంగా ఉండాలనే అపోహను ఆయన పటాపంచలు చేశారు. తన సహజ నటన, స్టైల్‌తో అందరినీ ఆకట్టుకున్నారు. తాాజాగా ఆయన 75వ వసంతంలోకి అడుగు పెట్టారు.
25
రజినీకాంత్ సినీ ప్రయాణం
రవితేజ్, మహేష్, విజయ్, అజిత్ నుంచి నేటి శివకార్తికేయన్, ప్రదీప్ వరకు అందరిపై రజినీకాంత్ ప్రభావం ఉంది. బాలీవుడ్ నటులే 'తలైవా' అని పిలిచేలా.. తన విశ్వరూపం చూపించిన నటుడు రజినీకాంత్. 50, 100, 500 కోట్ల మైలురాళ్లను సెట్ చేసి, నేటి నటులకు బెంచ్‌మార్క్‌గా నిలిచారు.
35
సూపర్ స్టార్ విజయ ప్రస్థానం
రజినీకాంత్ సినిమా విడుదలైతే థియేటర్లలో పండగే. అభిమానులు చాలా ఘనంగా ఆయన సినిమా రిలీజ్ ను సెలబ్రేట్ చేస్తుంటారు. ఇక శత్రువుల చేత కూడా సంబరాలు చేయించే సత్తా ఉన్న హీరో రజినీకాంత్ మాత్రమే. అరుణాచలం, నరసింహా, ముత్తు లాంటి సినిమాల నుంచి నేటి జైలర్ వరకు ఎన్నో విజయాలు ఆయన సొంతం అయ్యాయి. అయినా సరే ఇప్పటికి వినయంగా, వివాదాలకు దూరంగా, గెలుపోటములను సమానంగా తీసుకుని, చాలా ప్రశాంతంగా ఉండటం తలైవాకు అలవాటు.
రజినీకాంత్ వాకింగ్, డ్రెస్సింగ్, హెయిర్ స్టైల్ అన్నీ ప్రత్యేకమే. ఆయన సిగరెట్ తాగే స్టైల్ కూడా చాలా స్పెషల్ రజినీకాంత్ స్టైల్‌కు ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. ఆయన వాడే వస్తువులు ఫ్యాషన్‌గా మారాయి. ఆయన మాటలు హాట్ టాపిక్ అయ్యాయి. అందుకే ఆయన ఇండియన్ సూపర్ స్టార్. ఒక్క ఇండియాలోనే కాదు జపాన్ లాంటి దేశాల్లో కూడా రజినీకాంత్ కు విపరీతమైన క్రేజ్, లక్షల్లో అబిమానులు ఉన్నారు. జపాన్ లో రజినీకాంత్ నటించిన ముత్తు సినిమా 3.06 మిలియన్లు వసూలు చేసింది. 1998 నుంచి దాదాపు 25 ఏళ్ళపాటు ఈ రికార్డు కొనసాగింది. ఈమధ్య కాలంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ ఆ రికార్డును బ్రేక్ చేసింది.
55
రజినీకాంత్ దూకుడు..
రజినీలో ఏదో ప్రత్యేకతను చూసి అభిమానులు ఆయన్ను సూపర్‌స్టార్ చేశారు. విలన్, హీరో, స్టైల్ కింగ్‌గా ఎదిగారు. వయసు పెరిగినా ఆయన అందం, స్టైల్ తగ్గలేదు. తమిళంలో మాత్రమే కాదు తెలుగులోను సమానమైన ఇమేజ్ ఉన్న రజినీకాంత్ కు ఇండియాతో పాటు విదేశాల్లో కూడా కోట్లాది అభిమానులు ఉన్నారు. రజినీకాంత్ సినిమాలు అన్ని భాషల్లో అద్భుతమైన విజయాలు సాధిస్తుంటాయి. ఇక తాజాగా డైమండ్ జూబ్లీ ఇయర్ లోకి అడుగుపెట్టిన సూపర్‌స్టార్.. ఇక ముందు కూడా తగ్గేదే లేదంటూ దూసుకుపోతున్నారు.