పేద, మధ్యతరగతి ఆడియెన్‌కి `పుష్ప 2` ని దూరం చేస్తున్న ప్రభుత్వాలు.. టికెట్‌ రేట్లు చూస్తే పట్టపగలే చుక్కలు

First Published | Dec 3, 2024, 11:38 AM IST

`పుష్ప 2` సినిమాని పేద, సగటు మనిషి చూడలేరా? సాధారణ ఆడియెన్‌కి ఈ సినిమా దూరం కాబోతుందా? పెద్ద బడ్జెట్‌ చిత్రాలు పేదలు చూడకూడదా?
 

సినిమా పరిశ్రమలో ఇప్పుడు ఎక్కడ చూసినా `పుష్ప 2` గురించే చర్చ. సినిమా ఎలా ఉండబోతుందనేదాని గురించి, అల్లు అర్జున్‌ పాత్ర, సినిమా బిజినెస్‌, కలెక్షన్లు గురించే ఎక్కువగా చర్చ నడుస్తుంది. దీనితోపాటు ఓవర్సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ కి సంబంధించిన విషయాలు చర్చకు వస్తున్నాయి. దీనికితోడు సినిమాపై హైప్‌ని మరింతగా పెంచేలా టీమ్‌ భారీ ప్రమోషనల్‌ ఈవెంట్లు నిర్వహిస్తుంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈవెంట్లు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

`పుష్ప 2` భారీ ఈవెంట్లు..

ఇప్పటికే లక్కో, చెన్నై, కొచ్చి, ముంబయిలో ఈవెంట్లు అయిపోయాయి. సోమవారం హైదరాబాద్‌లోనూ భారీగా ఈవెంట్‌ని నిర్వహించారు. ఇలా దేశ వ్యాప్తంగా ఈవెంట్లు నిర్వహిస్తూ బిజీగా ఉంది టీమ్‌. ఇది సినిమాపై హైప్‌ని అమాంతం పెంచుతుంది. దీంతో కలెక్షన్ల టాపిక్‌ తెరపైకి వచ్చింది. ఫస్ట్ డే ఎంత వసూలు చేయబోతుందనేది ప్రధానంగా చర్చగా మారింది. చిత్ర బృందం మాత్రం సుమారు రూ. 250 కోట్లు టార్గెట్‌ చేసినట్టు తెలుస్తుంది. అంతే ఇప్పటి వరకు ఏ ఇండియన్‌ సినిమాకి సాధ్యం కాని ఓపెనింగ్స్ ని `పుష్ప2`తో టార్గెట్‌ చేయబోతున్నారట. `ఆర్‌ఆర్‌ఆర్‌`, `బాహుబలి2` రికార్డులను బ్రేక్‌ చేయాలని చూస్తున్నారట. 
 


`పుష్ప 2` రెండు తెలుగు రాష్ట్రాల టికెట్‌ రేట్లు..

అందుకు తగ్గట్టుగానే టికెట్‌ రేట్లు పెంచుతున్నారు. అయితే ఈ సారి భారీగా టికెట్ రేట్లు పెంచుతున్నారు. ముఖ్యంగా బెనిఫిట్‌ షోస్‌కి మాత్రం ఆరాచకం. rటీవల తెలంగాణ ప్రభుత్వం గతంలో ఎప్పుడూ లేని విధంగా టికెట్‌ రేట్లని పెంచుతూ జీవో జారీ చేసింది. తాజాగా ఏపీ ప్రభుత్వం కూడా దాన్నే ఫాలో అవుతూ టికెట్‌ రేట్లు పెంచుతూ జీవో జారీ చేసింది. బెనిఫిట్‌ షోస్‌, ప్రీమియర్‌ షోస్‌ కోసం ఏకంగా ఎనిమిది వందలు పెంచే వెసులుబాటుని కల్పించింది.

అంటే ముందురోజు(డిసెంబర్‌ 4న రాత్రి 9.30) షోకి ఎనిమిది వందలు పెంచి టికెట్‌ రేట్లు అమ్మబోతున్నారు. ఏపీలో ప్రీమియర్ షోస్‌ అన్నింటికి ఈ రేట్లు పెంచుకునే అవకాశం ఉంది. ఈ లెక్కన రెండు తెలుగు రాష్ట్రాల్లో సింగిల్‌ థియేటర్లలో ఒక్క టికెట్‌ ధర. 1121 ఉండబోతుంది. అదే మల్టీప్లెక్స్ లో రూ.1239 ఉండబోతుంది. ఒక సినిమా టికెట్‌ ధర ఈ స్థాయిలో ఉండటం నిజంగా దారుణం. 
 

`పుష్ప2` మూడు వారాలు పెంచిన టికెట్‌ రేట్లు..

డిసెంబర్‌ 5 మార్నింగ్‌ షోస్‌ నుంచి నాలుగు రోజులపాటు అంటే డిసెంబర్‌ 8 వరకు ఒక్కో టికెట్‌పై సింగిల్‌ థియేటర్లలో 150 రూపాయలు, మల్టీప్లెక్స్ ల్లో 200పెంచుకునే వెసులుబాటుని కల్పించాయి.  అంటే సింగిల్‌ థియేటర్లలో రూ.354, మల్టీప్లెక్స్ ల్లో 531 రూపాయలు ఉంటుంది. రెండో వారంలో సింగిల్ థియేటర్లలో టికెట్‌పై 105 రూపాయలు, మూడో వారంలో 20 రూపాయలు పెంచుకోవచ్చు అని తెలిపింది.

మల్టీప్లెక్స్ ల్లో మొదటి 4 రోజులు రెండు వందలు, రెండో వారం 150 రూపాయలు, మూడో వారం యాభై రూపాయలు పెంచుకునే వెసులుబాటుని ఇచ్చింది. ఇలా దాదాపు మూడు వారాలపాటు పెంచిన రేట్లతోనే టికెట్‌ అమ్మబడుతుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్రా(నార్త్) లోనూ టికెట్ రేట్లు పెంచుతున్నారు. 

`పుష్ప 2` టికెట్‌ రేట్ల దోపిడి..

ఇది కాదని చెప్పి ఆడియెన్స్ అభిమానాన్ని క్యాష్‌ చేసుకునేందుకు మధ్యవర్తులు మరింత దోపిడికి దిగుతున్నారు. బల్క్ లో ఎక్కువ టికెట్లు ముందుగానే బుక్‌ చేసుకుని బ్లాక్‌ లో డబుల్‌ రేట్లకి అమ్ముతున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు బ్లాక్‌లో ఒక్కో టికెట్‌ని 2000 నుంచి 3000 వేల వరకు అమ్మతున్నారని తెలుస్తుంది.

కొందరు సోషల్‌ మీడియాలోనూ ఈ విషయాన్ని వెల్లడిస్తున్నారు. బెంగుళూరు, ముంబాయి వంటి సీటీస్‌లోనూ ఇలాంటి దందానే నడుస్తుందట. సాధారణ ఆడియెన్స్ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇదిప్పుడు పెద్ద వివాదంగా మారింది. 
 

`పుష్ప 2` సినిమాకి సగటు ఆడియెన్‌ దూరం..

సాధారణంగా మొదటి వారంకి మాత్రం టికెట్‌ రేట్లుపెంచుకునే అవకాశం ఇస్తారు. కానీ ఇక్కడ మూడు వారాలు పెంచుకునే అవకాశం ఇవ్వడమే ఆశ్చర్యపరుస్తుంది. ఇది ఓ రకంగా బహిరంగంగానే, అధికారికంగానే ఆడియెన్స్ ని దోచుకోవడమే అని నెటిజన్లు, క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు. జనాల అభిమానాన్ని క్యాష్‌ చేసుకోవడమే అంటున్నారు.

నలుగురు సభ్యులున్న ఫ్యామిలీ సినిమాకి వెళ్లాలంటే ఈజీగా 2500ఖర్చు చేయాల్సిందే. అదే స్నాక్స్ లాంటివి తీసుకోవాలంటే మరో వెయ్యి, 1500 అదనం అవుతుంది. అంటే ఒక్కో ఫ్యామిలీ ఈజీగా మూడు నుంచి నాలుగు వేలు ఒక్క సినిమా చూడ్డానికి ఖర్చు చేయాల్సి వస్తుంది.

ఒక సగటు మధ్యతరగతి కుటుంబం తమకు వచ్చే నెల జీతంలో 20శాతం ఒక్క సినిమాకే పెట్టాల్సిన పరిస్థితి ఉందంటే అది ఎంత దారుణమో ఆలోచించండి. ఇక పేదవాళ్లు అయితే ఇప్పట్లో `పుష్ప 2` సినిమాని చూడటమే కష్టం. మూడు వారాల తర్వాత మాత్రమే వాళ్లు చూడగలిగే పరిస్థితి. 

ప్రభుత్వాలే టికెట్‌ రేట్లు పెంచడం పట్ల తీవ్ర విమర్శలు..

జనం అభిమానాన్ని డబ్బులు పిండుకోవడం తప్ప ఇందులో వినోదం అందించడమనే యాంగిలే కనిపించడం లేదు. వినోదం కోసం, ఆడియెన్స్ ని అలరించడం కోసం అయితే రెగ్యూలర్‌ రేట్లతోనే సినిమాని విడుదల చేయవచ్చు. కానీ ఇప్పుడు అలా జరగడం లేదు. దీనికితోడు `పుష్ప 2` టికెట్‌ రేట్లు ఇప్పటి వరకు ఏ ఇండియన్‌ సినిమాకి ఏ ప్రభుత్వాలు ఇంతగా పెంచలేదు.

బ్లాక్‌ బస్టర్స్, ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్‌ చేసిన `బాహుబలి 2`, `ఆర్‌ఆర్‌ఆర్‌`, ఇటీవల వచ్చిన `దేవర`, `కల్కి 2989` చిత్రాలకు కూడా మల్టీప్లెక్స్ లో 425 రూపాయలు ఉండేది. కానీ వాటిని మించి `పుష్ప2` సినిమాకి టికెట్‌ రేట్లని పెంచడం పట్ల సాధారణ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలే అందుకు అనుమతించడం పట్ల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జనానికి అండగా ఉండాల్సిన ప్రభుత్వాలే ఇలా చేస్తే ఇక సగటు ఆడియెన్‌ని సినిమాకి, వినోదానికి దూరం చేయడమే అవుతుందని మండిపడుతున్నారు. దీనిపై సినీ విమర్శకులు సైతం తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తెలంగాణ హైకోర్ట్ లో పిటిషన్‌ కూడా వేశారు. నేడు కోర్ట్ ఈ కేసుని విచారించనుంది. 
 

Theatre Kerala

`పుష్ప 2` కాస్ట్‌ అండ్‌ క్రూ డిటెయిల్స్..

అల్లు అర్జున్‌, రష్మిక మందన్నా జంటగా నటించిన `పుష్ప 2` చిత్రానికి సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఫహద్‌ ఫాజిల్‌, జగపతి బాబు నెగటివ్‌ రోల్స్ చేస్తున్నారు. సునీల్‌, అనసూయ, రావు రమేష్‌లవి కూడా కీలక పాత్రలే అని చెప్పొచ్చు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్‌ 5న భారీగా విడుదల కాబోతుంది.

ఈ నెల 4 రాత్రి నుంచే బెనిఫిట్‌, ప్రీమియర్స్ షోస్‌ పడబోతున్నాయి. సుమారు 12000 థియేటర్లలో రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తుంది టీమ్‌. మరి ఈ మూవీ ఏ స్థాయిలో ఆకట్టుకుంటుంది? ఏ రేంజ్‌లో కలెక్షన్లని రాబడుతుంది? గత సినిమాల రికార్డులను బ్రేక్ చేస్తుందా? అనేది చూడాలి. 

read more:పుష్ప 2 టికెట్ రేట్లపై హైకోర్టులో పిటిషన్

also read: పుష్ప 2 ఇంట్రో సీన్ చూశాను, ఆల్ ది బెస్ట్ నేను చెప్పను. ఫ్యాన్స్ మైండ్ బ్లాక్ చేసిన రాజమౌళి!

Latest Videos

click me!