చిరంజీవి చేసిన డ్యాన్సులు, ఫైట్స్, ఇంటర్వెల్ లో ట్విస్ట్ ఇలా ప్రతి ఒక్కటీ హైలైట్ గా నిలిచింది. ఇక మణిశర్మ సంగీతం అయితే నెక్స్ట్ లెవల్ లో ఉంటుంది. మణిశర్మ కెరీర్ లో బెస్ట్ సాంగ్స్, బెస్ట్ బిజియం ఇచ్చారు. అశ్విని దత్ నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కింది. జగదేక వీరుడు అతిలోక సుందరి, చూడాలని ఉంది లాంటి హిట్ చిత్రాల తర్వాత చిరంజీవి, అశ్విని దత్ కాంబోలో వచ్చిన ఇంద్ర చరిత్రలో నిలిచిపోయే విజయం దక్కించుకుంది.