చాలా కాలంగా అనసూయ, విజయ్ దేవరకొండ మధ్య కోల్డ్ వార్ సాగుతోంది. ఇది బహిరంగ రహస్యమే. అనసూయ తరచుగా విజయ్ దేవరకొండపై పరోక్షంగా చేస్తున్న ట్వీట్స్ వివాదం అవుతున్నాయి. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అనసూయని ట్రోల్ చేయడం చూస్తూనే ఉన్నాం. అర్జున్ రెడ్డి చిత్రం నుంచి అనసూయ, విజయ్ దేవరకొండ మధ్య వివాదం మొదలైంది.
తాజాగా అనసూయ మరోసారి విజయ్ దేవరకొండని కెలికిందా అని అనుమానం వచ్చేలా ట్వీట్ చేసింది. నెటిజన్లు మాత్రం విజయ్ దేవరకొండని టార్గెట్ చేస్తూనే ఈ ట్వీట్ చేసింది అని తేల్చేస్తున్నారు. ఇంతకీ అనసూయ ఏమని ట్వీట్ చేసిందో చూద్దాం. 'దూరపు కొండలు నునుపు' అంటూ ఒక సామెతని అనసూయ ట్వీట్ చేసింది. ఈ సామెతలో కొండ అని ఉండడంతో నెటిజన్లు విజయ్ దేవరకొండ గురించే అని అంటున్నారు.
అసలు సందర్భం ఏంటి ? అనసూయ ఇప్పుడెందుకు విజయ్ ని టార్గెట్ చేసింది అనే అనుమానాలు కలుగుతున్నాయి. దీనిపై కూడా నెటిజన్లు ఒక అభిప్రాయానికి వచ్చేశారు. అనసూయ ఉద్దేశం ఏంటో ఈ ట్వీట్ లోని మర్మం ఏంటో నెటిజన్లు కామెంట్స్ రూపంలో చెప్పేస్తున్నారు. రష్మిక, విజయ్ దేవరకొండ ప్రేమలో ఉన్నారు. తమ రిలేషన్ ని అధికారికంగా ప్రకటిచలేదు కానీ వివిధ రూపాల్లో హింట్స్ ఇస్తున్నారు. రష్మిక.. విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో కూడా కలిసిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.
వీళ్ళిద్దరూ ఆల్రెడీ గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో జంటగా నటించారు. రీసెంట్ గా పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ లో రష్మిక మందన మంచి జోష్ తో ప్రసంగించింది. రష్మిక స్పీచ్ ఇచ్చిన విధానం, మీ ఉపయోగించిన స్లాంగ్ విజయ్ దేవరకొండ స్టైల్ లో ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
కర్ణాటక నుంచి వచ్చిన రష్మిక విజయ్ ప్రేమలో పడింది. దీనిపై అనసూయ సెటైరికల్ గా, చిన్నపాటి వార్నింగ్ ని రష్మికకి ఇచ్చే విధంగా అనసూయ 'దూరపు కొండలు నునుపు' అని పోస్ట్ చేసినట్లు నెటిజన్లు చెబుతున్నారు. మెరిసేదంతా బంగారం కాదు, దూరపు కొండలు నునుపు లాంటి సామెతలని మోసపోకుండా హెచ్చరించేందుకు ఉపయోగిస్తుంటారు. విజయ్ దేవరకొండ ప్రేమ మాయలో ఉన్న రష్మిక ని హెచ్చరించేందుకే అనసూయ ఈ ట్వీట్ చేసిందా ? నిజం ఏంటో అనసూయకే తెలియాలి.