వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని శ్రీ విల్లిపుత్తూరు ఆండాళ్ దేవాలయం ఎదుట ఉన్న అర్థ మండపం నుంచి సంగీత దర్శకుడు ఇళయ రాజాను ఆపి బయటకు పంపేసిన ఘటన సంచలనంగా మారింది. ఈరోజు ( డిసెంబర్ 16న) మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. పెళ్లికాని యువతులు ఉదయాన్నే నిద్రలేచి, స్నానం చేసి, సమీపంలోని పెరుమాళ్ ఆలయానికి వెళ్లి, ఆండాళ్ తిరుప్పావై, నాచియార్ తిరుమొళి వంటి కీర్తనలు పాడుతూంటారు. శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ ఆలయంలో కూడా ఈ పూజను ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా శ్రీవిల్లిపుత్తూరు ఆలయంలో ఈరోజు ఆండాళ్, తిరుప్పావై పట్టు వస్త్రాలు ధరించి రంగమన్నార్ స్వామితో దర్శనమిచ్చారు.