Guppedantha Manasu 13th February Episode:రిషి వస్తాడు.. వసుని కాపాడేది అతనే, శైలేంద్రతో ధరణి ఛాలెంజ్

First Published | Feb 13, 2024, 8:41 AM IST

శైలేంద్ర మాటలపై ధరణి మరోసారి నీళ్లు చల్లుతుంది. నీ ఆశల అడియాశ అవుతుంది అని అంటుంది.

Guppedantha Manasu

Guppedantha Manasu 13th February Episode: వసుధార సమస్యల్లోకి నెట్టాం కాబట్టి.. ఇక ఈ సారి ఎండీ పదవి రావడం ఖాయం అని శైలేంద్ర, దేవయాణి సంబరపడిపోతూ ఉంటారు. కానీ, ధరణి వచ్చి వాళ్ల ఆనందాన్ని మాయం చేస్తుంది. ఈ సారి కూడా మీకు ఎండీ పదవి దక్కదు అని చెబుతుంది. ఇప్పటికి మీరు చాలా సార్లు ప్రయత్నించారు.. ఏమైనా లాభం ఉందా? ఇప్పుడు కూడా అదే జరుగుతుంది అని ధరణి అంటుంది. అయితే..  ఈసారి మాత్రం సీటు నా కొడుక్కే దక్కుతుంది అని దేవయాణి అంటుంది. అయితే.. మీరు అలా అనకండి అత్తయ్య.. నాకు నవ్వొస్తుంది అని ధరణి బదులిస్తుంది.
 

Guppedantha Manasu

నవ్వు ఎందుకు వస్తుంది..? అని దేవయాణి సీరియస్ అయితే...‘ ఆయనకు ఎండీ సీటు లో కూర్చునే అదృష్టం ఉంటే ఎప్పుడో కూర్చునేవారు.. కానీ ఇన్నాళ్లుగా కూర్చోవడం లేదు అంటే  ఆ అదృష్టం లేనట్లే కదా’ అని ధరణి అంటుంది. దానికి శైలేంద్ర ‘ నీకో విషయం చెప్పనా..? జీవితంలో మనిషి ఆశతోనే బతకాలి. నేను ఎండీ సీటు మీద ఆశపడ్డాను. దాని కోసమే బతుకుతున్నాను. నువ్వు చూస్తున్నావ్ అనగా.. నేను హ్యాపీగా ఉన్నా, బాధపడినా, ఎటాక్ లు చేసినా అన్నీ ఎండీ సీటు కోసమే. రేపటితో నా ఆశలు నెరవేరబోతున్నాయి’ అని సంబరంగా చెబుతాడు. కానీ.. శైలేంద్ర మాటలపై ధరణి మరోసారి నీళ్లు చల్లుతుంది. నీ ఆశల అడియాశ అవుతుంది అని అంటుంది.
 


Guppedantha Manasu

కానీ.. వసుధారను కాపడానికి ఎవరు ముందుకు వస్తారు? చిన్న ఎమౌంట్ కాదు కదా అని శైలేంద్ర అంటే..  ఎవరో ఒకరు వచ్చి కాపాడతారని.. గతంలో ఎంఎస్ఆర్ కి డబ్బులు ఇవ్వాలని మీరు ప్లాన్ వేసినప్పుడు మురుగన్ వచ్చి కాపాడాడు కదా అని గుర్తు చేస్తుంది. అయితే.. అప్పుడంటే.. రిషి పరోక్షంగా ఆపాడని.. ఇప్పుడు రిషి లేడు కదా అని శైలేంద్ర అంటాడు. అయితే.. రిషి ఏదో ఒక రూపంలో వస్తాడేమో అని ధరణి అంటుంది.కానీ..  శైలేంద్ర మాత్రం... నీది తప్పు ధరణి.. నేను ఎండీ సీటు అధిరోహించడం ఖాయం అని చెబుతాడు. ధరణి మాత్రం రేపు మీకు బ్యాడ్ డే అని అంటుంది. దీంతో.. ఇద్దరూ కలిసి ఒక బెట్ వేసుకుంటారు.. నిజంగా నువ్వు చెప్పినట్లే జరిగితే.. నువ్వు ఏది చెబితే అది చేస్తాను అని శైలేంద్ర మాట ఇచ్చేస్తాడు. అవసరం అయితే.. నీ కాళ్లు నొక్కమన్నా నొక్కుతానని, నీకు బానిసగా ఉంటానని, నీ బదులు నేనే వంట చేస్తానని.. నీకు కుక్కలా నీ కాళ్ల మీద పడి ఉండటమంటే ఉంటాను అని  అని అంటాడు. ధరణి మాత్రం.. అంతా తాను చెప్పినట్లే జరుగుతుంది అని చెప్పేసి వెళ్లిపోతుంది.
 

Guppedantha Manasu

ధరణి ఇలా మాట్లాడింది ఏంటి అని దేవయాణి అంటే.. దాని మోహం దాని మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని.. నీ కొడుకు రేపు ఎండీ సీటులో కూర్చుంటాడు అని చెబుతాడు.  ఎందుకైనా మంచిది.. అన్ని జాగ్రత్తలు తీసుకోమని దేవయాణి సలహా ఇస్తుంది. శైలేంద్ర సరే అంటాడు.
 

Guppedantha Manasu

మరోవైపు ఇంట్లో మహేంద్ర బాధగా కూర్చొని ఉంటాడు. అనుపమ వచ్చి.. వసుధార గురించే ఆలోచిస్తున్నావా అని అడుగుతుంది. అవును అని మహేంద్ర అంటాడు. అయితే.. వసుధార సడెన్ గా కాలేజీ వదిలేసి రావాలంటే కష్టం కదా అని అనుపమ సర్ది చెప్పబోతోంటే... తాను ఆ విషయం గురించి కాదని.... రిషి బ్రతికే ఉన్నాడనే భ్రమలో ఉండిపోయిందని.. ఇలానే వదిలేస్తే.. ఏమైపోతోందో అని భయం వేస్తోందని  మహేంద్ర అంటాడు. అయితే.. వసు మాత్రమే కాదని.. అలా చాలా మంది తమకు ఇష్టమైన వారు చనిపోతే తొందరగా యాక్సెప్ట్ చేయలేరని అనుపమ చెబుతూ ఉంటుంది. అయితే.. ఈ మాటలన్నింటినీ వసుధార వింటూ ఉంటుంది. అప్పుడే మహేంద్ర సడెన్ గా.. వసుధారకు రియాలిటీ అర్థమయ్యేలా చేయాలి అని అంటాడు.
 

Guppedantha Manasu

ఆ మాటతో వచ్చిన వసు.. నేను నార్మల్ గానే రియాల్టీలోనే బతుకుతున్నాను అని చెబుతుంది. మీరు పదే పదే రిషి సర్ చనిపోయారు అని చెబుతుంటే.. వినడం నాకు ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా అని వసు అడుగుతుంది. దానికి అనుపమ.. నిన్ను బాధపెట్టాలని కాదని.. రిషి దూరమైనందుకు మహేంద్ర కూడా బాధపడుతున్నాడని.. కేవలం నిన్ను నార్మల్ చేయాలని అనుకుంటున్నాం అని అనుపమ అంటుంది.

దానికి వసుధార.. నాకేమీ పిచ్చి పట్టలేదని నార్మల్ చెయ్యడానికి అని సీరియస్ అవుతుంది.మీరుు కనిపించిన ఆధారాలను చూసి రిషి సర్ చనిపోయారు అనుకుంటున్నారని, తాను మాత్రం తన మనశ్శాక్షిని మాత్రమే నమ్ముతున్నాను అని వసు చెబుతుంది. ఒకవేళ రిషి సర్ చనిపోయి ఉంటే..నేను ప్రాణాలతో ఉండేదాన్ని కాదని.. తాను బతికి ఉన్నానంటే రిషి సర్ కూడా ఎక్కడో ఉండే ఉంటారు అని చెబుతుంది.  అయితే తన బాధంతా రిషి సర్ కి సరైన వైద్యం అందుతుందో లేదో.. ఆయనకు మంచి ఆహారం లభిస్తుందో లేదో అని మాత్రమే టెన్షన్ గా ఉందని చెబుతుంది.
 

Guppedantha Manasu

మరోవైపు రాజీవ్ కి శైలేంద్ర ఫోన్ చేస్తాడు. తాను ఒక ప్లాన్ వేశానని... ఆ ప్లాన్ ప్రకారం రేపటితో కాలేజీ తనది అవుతుందని చెబుతాడు. ఏంటా ప్లాన్ అని రాజీవ్ అడిగితే.. ఆ రూ.40 కోట్ల గురించి చెబుతాడు. రేపటి నుంచే కాలేజీ కి వసుధారకు చివరి రోజని.. నువ్వు వసుధారను ఎలా తీసుకువస్తావో నీ ఇష్టం అని  అంటాడు. ముందే అనుకున్నట్లు.. సీటు నాకు..సీటులో మరదలు పిల్ల నీకు అని శైలేంద్ర అంటాడు. దానికి రాజీవ్.. తాను కాలేజీ లోపలికి వచ్చి మరీ వసుని తీసుకువెళతాను అని చెబుతాడు,
 

Guppedantha Manasu

తర్వాత.. ఆ కొత్త హీరో గురించి చెబుతాడు. మొన్న వచ్చి కాపాడినట్లే రేపు కూడా వచ్చి కాపాడతాడేమో అని రాజీవ్ డౌట్ రైజ్ చేస్తాడు. ఏమీ కాదని శైలేంద్ర అంటాడు. అయితే.. వసుధారను మాత్రం ఏమీ చెయ్యవద్దని  రాజీవ్ వార్నింగ్ ఇస్తాడు. తాను వసుధారను ఏమీ చెయ్యను, చేయాల్సిన అవసరం కూడా లేదు అని శైలేంద్ర చెబుతాడు.

ఇక.. ఫోన్ పెట్టేసిన తర్వాత.. రాజీవ్ ఏదో డౌట్ వస్తుంది. భయ్యా పట్టించుకోవడం లేదు కానీ.. నాకు ఎందుకో వసుని కాపడటానికి అతను వస్తాడేమో అనిపిస్తోంది.. కానీ రాకూడదు.. వాడు రాకూడదు.. వసు బంగారం నాకు దక్కాలి అని అనుకుంటాడ.
 

Guppedantha Manasu

మరోవైపు అనుపమ ఆలోచిస్తూ ఉంటుంది. మహేంద్ర మాటలు, వసు మాటలు తలుచుకుంటూ ఉంటుంది. మహేంద్ర ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని అనుకుంటన్నాడని, వసు మాత్రం కాలేజీ ని వదిలేసి రావాలని అనుకోవడం లేదని.. ఈ షమస్య నుంచి బయటపడేదెలా అని ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత.. అనుపమ తన పెద్దమ్మకు ఫోన్ చేస్తుంది. కాసేపు కుశల ప్రశ్నల గురించి మాట్లాడుకుంటారు. తర్వాత ఎందుకు ఫోన్ చేశావ్ అంటే,.. మనసు బాలేదు అని చెబుతుంది. మహేంద్ర ఇంకా జగతిని మర్చిపోలేదా అంటే,.. దాని గురించి కాదని.. వసుధార గురించి చెబుతుంది. రిషి చనిపోవడం.. వసుధార నమ్మకపోవడం అన్ని విషయాలు మొత్తం చెబుతుంది. అంతేకాకుండా.. కాలేజీలో మరో సమస్య వచ్చిందని మొత్తం వివరిస్తుంది. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో అర్థం కావడం లేదని అంటుంది. అయితే.. ఏ సమస్య వచ్చినా దానికి పరిష్కారం ఉంటుంది అని ఆమె  ధైర్యం చెబుతుంది.
 

Guppedantha Manasu

మరోవైపు వసుధార.. రిషి బ్రెస్ లెట్ పట్టుకొని బాధపడుతూ ఉంటుంది. అది తాను రిషి చేతికి తొడిగినప్పటి సందర్భాలను తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. శైలేంద్ర కాలేజీని దక్కించుకోవాలని చూస్తాడని.. ఎలా  కాపాడుకోవాలో అర్థం కావడం లేదని ఫీలౌతూ ఉంటుంది. తర్వాత.. రిషి బ్రెస్ లెట్ ని తన చేతికి పెట్టుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Latest Videos

click me!