మా సినిమాని తొక్కాలని చూస్తున్నది ఎవరో తెలిసిపోయింది.. వెంట్రుకతో సమానం అన్నది అందుకే, బన్నీ వాసు కామెంట్స్

Published : Oct 15, 2025, 08:20 PM IST

మిత్ర మండలి మూవీ మీడియా సమావేశంలో నిర్మాత బన్నీ వాసు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. గత కొన్ని రోజులు బన్నీ వాసు తన కామెంట్స్ తో ట్రెండింగ్ లో ఉన్నారు. 

PREV
15
దీపావళికి క్యూ కడుతున్న సినిమాలు 

నటుడు ప్రియదర్శి, సోషల్ మీడియా ఇన్ఫ్లుఎన్సర్ నిహారిక ఎన్ఎమ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కామెడీ ఎంటర్టైనర్ మిత్రమండలి. ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మిస్తున్నారు. గురువారం అక్టోబర్ 16న ఈ చిత్రం రిలీజ్ అవుతోంది. దీపావళి సందర్భంగా బాక్సాఫీస్ వద్దకి చిన్న, మీడియం రేంజ్ సినిమాలు క్యూ కడుతున్నాయి. మిత్ర మండలితో పాటు తెలుసు కదా, డ్యూడ్, కె ర్యాంప్ లాంటి చిత్రాలు వరుసగా రిలీజ్ అవుతున్నాయి. ఇటీవల సినిమాలపై నెగిటివ్ క్యాంపెయినింగ్  ఎక్కువ అవుతోంది. 

25
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అంత మాట అనేసిన బన్నీ

వాసు  దీని గురించి బన్నీ వాసు మిత్రమండలి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. యుద్ధం ధర్మంగా చేయాలి. ఒక సినిమాని తొక్కేయడం వల్ల మరో సినిమా హిట్ అవుతుందనుకుంటే అది పొరపాటే. ఎవరో తొక్కేస్తే బన్నీ వాసు పడిపోతాడు అని ఎవరైనా అనుకుంటే.. నా వెంట్రుకతో సమానం అంటూ బన్నీ వాసు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన వ్యాఖ్యల గురించి బన్నీ వాసు మరోసారి మిత్రమండలి ప్రెస్ మీట్ లో రియాక్ట్ అయ్యారు. 

35
మనస్ఫూర్తిగా నవ్విస్తాం 

బన్నీ వాస్ మాట్లాడుతూ .. ‘‘మిత్ర మండలి’ ప్రీమియర్లకు మంచి స్పందన వస్తోంది. డిమాండ్ పెరుగుతుండటంతో స్క్రీన్లను పెంచుకుంటూ వెళ్తున్నాం. సెకండ్ షోలకి కూడా డిమాండ్ పెరిగింది. విజయవాడ, వైజాగ్‌లోనూ ప్రీమియర్లకు డిమాండ్ పెరిగింది. ప్రీమియర్లతో వచ్చే మౌత్ టాక్‌తో మరింత ప్రయోజనం చేకూరుతుందని మేం భావిస్తున్నాం. దీపావళి పండుగ 21 అయితే.. నవ్వుల పండుగ మాత్రం ఈ రోజు సాయంత్రం మా ప్రీమియర్లతో స్టార్ట్ అవుతుంది. అందరూ ఫ్యామిలీతో సినిమాకు రండి.. అందర్ని హాయిగా నవ్వించి బయటకు పంపిస్తాం. మనస్ఫూర్తిగా నవ్విస్తామని మాత్రం చెప్పగలను. ఇప్పటి వరకు అయితే మేం మంచి చిత్రాన్ని తీశామని అనుకుంటున్నాం. ఈ మూవీ కోసం పని చేసిన నా టీంకు థాంక్స్. ఇప్పటి వరకు సహకరించిన మీడియాకి థాంక్స్’' అని అన్నారు.

45
అందుకే ఎమోషనల్ అయ్యా 

సినిమాపై జరుగుతున్న నెగిటివ్ క్యాంపెయినింగ్ గురించి మీడియా అడిగిన ప్రశ్నకు బన్నీ వాసు సమాధానం ఇచ్చారు. ఒక సినిమాని హిట్ చేయడానికి మరో సినిమా తొక్కాలని చూస్తున్నది ఎవరో తనకి తెలిసింది అని బన్నీ వాసు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బన్నీ వాసు మాట్లాడుతూ.. ''మిత్ర మండలి’ మీద కావాలనే నెగెటివ్ క్యాంపైన్ చేస్తున్నారు. టీంలో చాలా మంది నిద్ర లేకుండా పని చేస్తున్నారు. మేం ఇంత కష్టపడి మూవీని తీస్తుంటే కావాలని కొంత మంది అలా నెగెటివ్ ప్రచారం చేస్తున్నారు. ఇలాంటివి చేస్తున్నారని మన అందరికీ తెలుసు. కానీ మనలో ఎవ్వరూ మాట్లాడటం లేదు. అందుకే నేను అలా కాస్త గట్టిగా, ఎమోషనల్‌గా రెస్పాండ్ అయ్యాను. అలా నేను మాట్లాడిన తరువాత చాలా మంది ఫోన్‌ చేసి ‘చాలా బాగా మాట్లాడావ్'’ అని అన్నారు.

55
నెగిటివ్ క్యాంపెయినింగ్ చేస్తున్నది వాళ్లే 

బయటి వ్యక్తులు వచ్చి నిర్మాతలను  అప్రోచ్ అవుతున్నారని తెలిసింది. కొంత మంది నిర్మాతలు తెలిసో తెలియక ఇలాంటి నెగెటివ్ క్యాంపైన్‌లను సపోర్ట్ చేస్తున్నారు. పక్క సినిమాని తొక్కాలని చూడటం మాత్రం చాలా తప్పు. రాజకీయాల్లో ఇలాంటి ఎత్తుగడలు మామూలే. కానీ ఇండస్ట్రీలో ఇలాంటివి చేయడం తప్పు. మంచి సినిమాలు ఎప్పుడూ ఆడతాయి. ఒక మూవీని తొక్కితేనే ఇంకో మూవీ ఆడుతుంది అని అనుకోవడం మూర్ఖత్వం.నా చేతిలో ఉన్న థియేటర్లకి కూడా మిగిలిన చిత్రాలకు ఛాన్స్ ఇచ్చాను. నా మూవీని రెండు షోలు వేస్తే.. మిగతా చిత్రాలకు రెండు షోలు ఇస్తున్నాను. అన్ని సినిమాలు బాగుండాలి.. అన్ని చిత్రాలు ఆడాలన్నదే నా ఉద్దేశం అని బన్నీ వాసు అన్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories