రష్మిక మందన్న నటించిన ది గర్ల్ ఫ్రెండ్ చిత్ర క్లైమాక్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అబ్బాయిలు తమ గర్ల్ ఫ్రెండ్స్ తో ఈ సినిమా చూసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని బన్నీ వాసు హెచ్చరించారు.
రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ది గర్ల్ ఫ్రెండ్. నవంబర్ 7న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. వైవిధ్యమైన ప్రేమ కథా చిత్రంగా ఈ మూవీని రాహుల్ రవీంద్రన్ రూపొందించారు. రష్మిక పాత్ర చుట్టూనే కథ ఉంటుంది. దీక్షిత్ శెట్టి, ఇమ్మాన్యుయేల్, రావు రమేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. దివ్య కొప్పినీడి, ధీరజ్ మొగిలినేని నిర్మాతలు.
25
క్లైమాక్స్ నా మైండ్ లో నుంచి పొవట్లేదు
ది గర్ల్ ఫ్రెండ్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నిర్మాత బన్నీ వాసు చేసిన వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇటీవల బన్నీ వాసు ఏం మాట్లాడినా వైరల్ అవుతోంది. ది గర్ల్ ఫ్రెండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో బన్నీ వాసు మాట్లాడుతూ.. ఈ మూవీని చివరి 30 నిమిషాలు అరవింద్ గారితో కలిసి ఎడిటింగ్ రూమ్ లో చూశాను. నా మైండ్ లో నుంచి పొవట్లేదు. ఇది అమ్మాయిల కథ. వాళ్ళకి చాలా బాగా కనెక్ట్ అవుతుంది.
35
గర్ల్ ఫ్రెండ్ తో ఈ సినిమా చూసే అబ్బాయిలు జాగ్రత్తగా ఉండాలి
అబ్బాయిలు ఈ సినిమా పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీ గర్ల్ ఫ్రెండ్ తో ఈ సినిమా చూసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. క్లైమాక్స్ లో, సినిమా పూర్తయి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. సినిమా చూశాక మీ గర్ల్స్ ఫ్రెండ్ మిమ్మల్ని హగ్ చేసుకుంటే మీరు మంచి బాయ్ ఫ్రెండ్ అని అర్థం. అలా కాకుండా సైలెంట్ గా మీ వెనుకాలే వస్తుంటే మాత్రం కేర్ ఫుల్ గా ఉండాలి అని బన్నీ వాసు అన్నారు. బన్నీ వాసు మాటలతో ఈవెంట్ లో నవ్వులు విరిశాయి.
అమ్మాయిలు ఈ సినిమా చూసే ముందు ఎలా ఉన్నారో చూశాక అలా ఉండరు. గర్ల్ ఫ్రెండ్స్ తో బాయ్ ఫ్రెండ్స్.. భార్యలతో భర్తలు జాగ్రత్తగా ఉండాలి అని బన్నీ వాసు అన్నారు. ఎవ్వరూ బయటకి మాట్లాడని సెన్సిటివ్ పాయింట్ తో రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు అని బన్నీ వాసు అన్నారు. ఈ చిత్రానికి తప్పకుండా అవార్డు వస్తుంది అని ప్రశంసించారు.
55
రష్మికకి ఉత్తమ నటిగా అవార్డు
అల్లు అరవింద్ మాట్లాడుతూ రాహుల్ రవీంద్రన్ ముందుగా ఈ కథని వెబ్ సిరీస్ లాగా ఆహాలో తెరకెక్కించాలని అనుకున్నారు. సినిమాగా చేస్తే బావుంటుందని నేను చెప్పాను. అయితే ఈ కథలో పాత్రకి చాలా వెయిట్ ఉంటుంది. అంత బరువు మోసే హీరోయిన్ రష్మికనే. ఈ చిత్రంలో ఆమెకి ఉత్తమ నటిగా అవార్డు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు అని అల్లు అరవింద్ అన్నారు.