2024లో కోలీవుడ్ పరిస్థితి ఎలా ఉందనే చర్చ సినీ వర్గాల్లో జరుగుతోంది. పొంగల్ కి విడుదలైన ధనుష్ 'కెప్టెన్ మిల్లర్', శివకార్తికేయన్ 'అయలాన్' సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి.
'లబ్బర్ బాల్', 'మహారాజా' వంటి చిన్న సినిమాలు మాత్రం మంచి విజయం సాధించాయి. కానీ, భారీ అంచనాల నడుమ విడుదలైన 'ఇండియన్ 2' పరాజయం పాలైంది.
సూర్య 'కంగువ' కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. సినిమాకి నెగటివ్ టాక్ వచ్చింది. దీన్ని 2014తో పోలుస్తూ సినీ విశ్లేషకుడు క్రిస్టఫర్ కనకరాజ్ ట్వీట్ చేశారు.
2014లో రజనీకాంత్ 'లింగ', 'కొచ్చడయాన్' సినిమాలు పరాజయం పాలయ్యాయి. 2024లో ఆయన నటించిన 'లాల్ సలామ్', 'వేటయ్యన్' కూడా అదే దారిలో ఉన్నాయి.
2024లో విజయ్ 'లియో' సినిమా అత్యధిక వసూళ్లు సాధించింది. 2014లో కూడా విజయ్ 'తుపాకి' సినిమానే అత్యధిక వసూళ్లు సాధించింది.
శివకార్తికేయన్ 'అమరన్' సినిమా 2024లో హిట్ అయ్యింది. 2014లో ఆయన 'మాన్ కరాటే' సినిమా కూడా హిట్ అయ్యింది.
2014లో సూర్య 'అంజాన్' సినిమా ఫ్లాప్ అయ్యింది. 2024లో ఆయన 'కంగువ' కూడా అదే దారిలో ఉంది. ఇది మరొక పోలిక.
2014లో ధనుష్ 25వ సినిమా 'వేలైల్లా పట్టాధారి' విడుదలైంది. 2024లో ఆయన 50వ సినిమా 'రాయన్' విడుదలైంది.రాయన్ పర్లేదు అనిపించుకుంది.
2014లో సుందర్.సి 'అరమనై' సిరీస్ లో మొదటి సినిమా విడుదలై హిట్ అయ్యింది. 2024లో నాల్గవ సినిమా విడుదలై 100 కోట్ల క్లబ్ లో చేరింది.