ఈరోజు ఎపిసోడ్ లో వేద,యష్ కి ఫోన్ చేస్తూ ఉండగా ఈ మెసేజ్ న్యూసెన్స్ ఎందుకు ఇప్పుడు ఫోన్ చేస్తోంది ఫ్రెండ్ తో ఎంజాయ్ చేస్తోంది అనుకుంటే నాకు ఫోన్ చేస్తుంది అనుకుంటూ చెప్పు వేద అని అనగా ఏవండీ మా ఫ్రెండ్ విన్నీ వచ్చాడు. అప్పటికి ఇప్పటికీ ఒకే రకంగా ఉన్నాడు ఆశ్చర్యం కదా అని వేద అనగా అప్పటికి ఇప్పటికీ పిడతా మొహం ఏమీ మారదు అని అనుకుంటూ అవునా అని నటిస్తూ ఉంటాడు యష్. మీ గురించి అడిగాడు మిమ్మల్ని కలుస్తాను అన్నాడు అనడంతో ఒక 2 వీక్స్ లో కలుద్దాం అని చెప్పు అనడంతో ఇప్పుడు కలుద్దామా అని అనగా నా కుదరదు అని అంటాడు యష్.