వీటితోపాటు `పీకే` చిత్రంతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌ని అందుకుంది. ఇందులో అమీర్ ఖాన్‌తో జోడీ కట్టింది. అలాగే `ఎన్‌హెచ్10` వంటి కంటెంట్ ప్రధానమైన మూవీస్‌లో మెరిసిందీ. ఈ చిత్రానికి ఆమె నిర్మాతగానూ వ్యవహరించడం విశేషం. `బాంబే వెల్వెట్`, `దిల్ ధడక్నే దో`, `సుల్తాన్`, `ఏ దిల్ హై ముష్కిల్`, `ఫిల్హౌరీ`,` జబ్ మ్యారీ మీట్ సెజల్`, `పరి`, `సంజు`, `సూయి దాగా`, `జీరో` వంటి సినిమాలతో అలరిస్తూ వచ్చింది. ఇప్పుడు నిర్మాతగానే పరిమితమవుతుంది. చాలా రోజుల తర్వాత `చక్డా ఎక్స్ ప్రెస్` చిత్రంలో నటిస్తుంది అనుష్క శర్మ.