Brahmanandam Birthday: అందుకే బ్రహ్మానందం కామెడీ కింగ్ అయ్యారు

Published : Feb 01, 2022, 12:20 PM ISTUpdated : Feb 01, 2022, 12:29 PM IST

హాస్యం మానవ రూపంలో ఈ భూమిపై పడి 66 ఏళ్ళు అవుతుంది. అవును  హాస్యానికి మరో పేరైన బ్రహ్మానందం పుట్టినరోజు నేడు. మూడు దశాబ్దాలుగా బ్రహ్మనందం విరామం లేకుండా నవ్విస్తున్నారు. ఎవరు మాత్రం ఆయనలా హాస్యపు గుళికలు విసరగలరు చెప్పండి. 

PREV
17
Brahmanandam Birthday: అందుకే బ్రహ్మానందం కామెడీ కింగ్ అయ్యారు


బ్రహ్మానందం (Brahmanandam)నడిస్తే కామెడీ, మాట్లాడితే కామెడీ, మాట్లాకడపోయినా కామెడీ, నవ్వినా ఏడ్చినా నవ్వులే పూస్తాయి. బరువు బాధ్యల నడుమ నవ్వు అనే మధురానుభూతి మర్చిపోతున్న జనాలకు అది గుర్తు చేసే బాధ్యత బ్రహ్మానందం తీసుకున్నారు. పనుల్లో, ప్రయాణాల్లో, ఒంటరి వేళల్లో మొబైళ్లలో ప్రత్యక్షమై నవ్విస్తున్నారు. 

27


ఓ కమెడియన్ గా బ్రహ్మానందంకి ఉన్న ప్రత్యేకతలు స్టార్ కమెడియన్ చేశాయి. ముప్పై ఏళ్ల నవ్వుల ప్రయాణంలో బ్రహ్మానందం అనేక హాస్య  ప్రయోగాలు చేశారు. పదాలు, ఛలోక్తులు కనుగొన్నారు. జఫ్ఫా, పండగ చేస్కో, ఖాన్ తో గేమ్స్ ఆడకు శాల్తీలు లేచిపోతాయి. నీ యంకమ్మ... వంటి హాస్య ప్రయోగాలు ఆయన ద్వారా ఫేమస్ అయ్యాయి. 

37


చిరంజీవి ద్వారా జంధ్యాలకు వద్దకు చేరిన నవ్వుల ముడి సరుకు బ్రహ్మానందం. నాణ్యమైన ఆ ముడి సరుకుతో కామెడీ  ఎక్స్పర్ట్ జంధ్యాల రుచికరమైన ప్రయోగాలు చేశారు. ఆ దెబ్బతో బ్రహ్మానందం హాస్యం జనాల్లో జీర్ణించుకుపోయింది. 1987లో జంధ్యాల దర్శకత్వంలో విడుదలైన అహనా పెళ్ళంట మూవీలో బ్రహ్మానందం కోటా శ్రీనివాసరావుతో పండించిన హాస్యం నభూతో నభవిష్యత్. 

47

ఆ సినిమా తర్వాత బ్రహ్మానందం వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఏడాదికి పదుల సంఖ్యలో సినిమాలు చేస్తూ నిర్విరామంగా నవ్వించారు.  బ్రహ్మనందం నవ్వుల జర్నీలో మరపురాని మజిలీలు అనేకం. బాబాయ్ హోటల్ మూవీతో హీరోగా మారిన బ్రహ్మానందం, రామ్ గోపాల్ వర్మ మనీ చిత్రంతో హ్యస్యానికి కొత్త మేనరిజం పరిచయం చేశారు. 

57

స్టార్ హీరోలకు సమానంగా కమెడియన్ రోల్ ఉండడం ఒక్క బ్రహ్మానందం విషయంలోనే చూస్తాం. దూకుడు, రేసు గుర్రం, బాద్ షా వంటి చిత్రాల్లో బ్రహ్మానందం పాత్ర చాలా ప్రధానంగా సాగుతుంది. ఈ చిత్రాల విజయంలో ఆయన పండించిన హాస్యం . 
 

67

ఒక నటుడిగా బ్రహ్మానందం అందుకున్న అవార్డులు రివార్డులు అనేకం. ఆయన రికార్డ్స్ ఇకపై ఎవరూ చేరుకోలేనివి. భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ అవార్డు అందుకున్న బ్రహ్మానందం అత్యధిక చిత్రాల్లో నటించిన హీరోగా గిన్నిస్ వరల్డ్ రికార్డు నమోదు చేశారు. ఆరు సార్లు నంది అవార్డు గెలుపొందారు. అనేకమార్లు ఫిలిం ఫేర్ అవార్డ్స్ సొంతం చేసుకున్నారు. 

77

వయసు పెరగడంతో పాటు ఆరోగ్య కారణాల రీత్యా బ్రహ్మానందం మూడేళ్ళుగా సినిమాలు తగ్గించారు. ఆయన సెలెక్టివ్ గా చిత్రాలు చేస్తున్నారు. ప్రస్తుతం రంగమార్తాండ, పంచతంత్రం చిత్రాల్లో కీలక రోల్స్ చేస్తున్నారు. బ్రహ్మానందం పుట్టినరోజు (Brahmanandam Birthday)సంధర్భంగా ఆయనకు భగవంతుడు నిండు నూరేళ్లు ప్రసాదించాలని, నాన్ స్టాప్ గా మనకు నవ్వులు పంచాలని కోరుకుందాం... 
 

click me!

Recommended Stories