అల్లు అర్జున్ గత చిత్రం అల వైకుంఠపురంలో (Ala Vaikuntapuramlo) భారీ విజయాన్ని నమోదు చేసింది. ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన అల వైకుంఠపురంలో రూ. 200కోట్లకు పైగా వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టింది. బాలీవుడ్ మీడియాతో పాటు ప్రముఖులు ఈ చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పుకున్నారు. దీంతో పాన్ ఇండియా మూవీ చేయాలనే బన్నీ ఆలోచనకు బీజం పడింది.
pushpa
అల వైకుంఠపురం లో విడుదలకు ముందే పుష్ప ప్రాజెక్ట్ ఒకే చేశారు. అల వసూళ్ల ప్రభంజనం చూశాక... లోకల్ ప్రాజెక్ట్ గా ప్రకటించిన ఈ చిత్రాన్ని పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా మార్చారు. సుకుమార్ కథను కుదించి చెప్పడం ఎందుకని రెండు భాగాలుగా విభజించారు. వంద కోట్లతో పూర్తి చేయాలనుకున్న పుష్ప.. బడ్జెట్ రెండు భాగాలకు కలిపి రూ. 250 కోట్లకు చేరింది.
Pushpa movie
పుష్ప మొదటి భాగం రేపు వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున విడుదల కాబోతుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో పుష్ప రిలీజ్ అవుతుంది. పుష్ప మూవీ ట్రైలర్, సాంగ్స్ అంచనాలు మరో స్థాయికి చేర్చాయి. అల్లు అర్జున్ ప్రతిష్టాత్మకంగా నటించిన పుష్ప ఎలా ఉండనుందన్న ఆత్రుత ప్రేక్షకులలో నెలకొంది.
కాగా పుష్ప (Pushpa)మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. యూఏఇ సెన్సార్ సభ్యుడు, ఫిల్మ్ క్రిటిక్ పుష్ప మూవీ పై తన అభిప్రాయం తెలియజేశాడు. అలాగే టాప్ రేటింగ్ ఇచ్చి, అల్లు అర్జున్ ఫ్యాన్స్ లో జోష్ నింపారు. ట్వీట్ ద్వారా షార్ట్ అండ్ స్వీట్ గా పుష్ప మూవీ గురించి తెలియజేశాడు.
ఆయన అభిప్రాయంలో.. ప్రధాన పాత్రలు చేసిన అల్లు అర్జున్, రష్మిక మందాన ఎలక్ట్రిఫైయింగ్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ కట్టిపడేసింది. ముఖ్యంగా రష్మిక నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. బలమైన స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అబ్బురపరిచాయి. సుకుమార్ డైరెక్షన్ అద్భుతం.. అంటూ ఉమర్ సంధు తన ట్వీట్ లో పొందుపరిచారు.
Pushpa
అనూహ్యంగా అల్లు అర్జున్ కంటే కూడా హీరోయిన్ రష్మిక (Rashmika Mandanna) గురించి ఆయన ఎక్కువగా తన ట్వీట్ లో ప్రస్తావించారు. పుష్ప మూవీలో ఆమె డీగ్లామర్ రోల్ చేస్తుండగా.. ఆయన పొగడ్తలతో ముంచెత్తడం ఆసక్తికరంగా మారింది. ఏకంగా పుష్ప చిత్రానికి ఉమర్ సంధు నాలుగు స్టార్స్ ఇవ్వడం మరొక విశేషం. మొత్తంగా పుష్ప సెన్సార్ రిపోర్ట్ అదిరిపోయింది.
అయితే గతంలో అట్టర్ ప్లాప్ చిత్రాలకు కూడా ఉమర్ సందు భారీ రేటింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన రివ్యూని పూర్తిగా నమ్మలేమని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.