మెగా పవర్ స్టార్ రాంచరణ్ సినిమా సినిమాకి తన స్థాయిని పెంచుకుంటూ వెళుతున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రంతో పాన్ ఇండియా వైడ్ గా క్రేజ్ తెచ్చుకున్న రాంచరణ్.. తదుపరి చిత్రాలతో మరిన్ని భారీ బడ్జెట్ ప్రాజెక్ట్స్ చేయబోతున్నాడు. బుచ్చిబాబు, సుకుమార్ లతో వరుసగా రాంచరణ్ సినిమాలు ఉండబోతున్నాయి.