డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తెరకెక్కించిన డబుల్ ఇస్మార్ట్ చిత్రం మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. లైగర్ చిత్రంతో పూరి జగన్నాధ్ కి ఎదురుదెబ్బ తగిలింది. ఆ గాయాన్ని డబుల్ ఇస్మార్ట్ చిత్రం మానేలా చేస్తుంది అని అంతా భావిస్తున్నారు. పూరి జగన్నాధ్, రామ్ పోతినేని వెండితెరపై చేసే మ్యాజిక్ పైనే అంతా ఆధారపడి ఉంటుంది.