వరుణ్ భార్య లావణ్య బట్టలు కూడా సర్దుతాడా... చెట్టంత మగాడిని ఫుల్ కంట్రోల్ లో పెట్టిన అందాల రాక్షసి!

First Published | Aug 14, 2024, 7:29 PM IST

లావణ్య త్రిపాఠిని మెగా హీరో వరుణ్ తేజ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పూర్తిగా భార్య కంట్రోల్ కి వెళ్ళిపోయాడట. చివరికి వరుణ్ చేత తన బట్టలు కూడా సర్దిస్తుందట.. 
 

Varun Tej


పెళ్ళాం ముందు హీరోలు కూడా జీరోలే అని తేలిపోయింది. వరుణ్ తేజ్ ని లావణ్య పూర్తిగా కంట్రోల్ లో పెట్టిందట. ఈ విషయాన్ని స్వయంగా లావణ్య చెప్పిన మాటలు ధ్రువీకరిస్తున్నాయి. టాలీవుడ్ లవ్లీ కపుల్ గా ఉన్నారు వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి. నార్త్ భామ లావణ్యను వరుణ్ తేజ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 2023 నవంబర్ 5న ఇటలీ వేదికగా లావణ్య త్రిపాఠి-వరుణ్ తేజ్ వివాహం జరిగింది. 
 

2017లో మిస్టర్ మూవీలో లావణ్య-వరుణ్ కలిసి నటించారు. అప్పుడు ఏర్పడిన పరిచయం మెల్లగా పెళ్ళికి దారి తీసింది. చాలా కాలం వరుణ్ తేజ్, లావణ్య రహస్యంగా ప్రేమించుకున్నారు. అయితే ప్రేమ వ్యవహారాలు దాచడం చాలా కష్టం. వీరిద్దరూ ఎఫైర్ లో ఉన్నారనే వార్తలు తెరపైకి వచ్చాయి. ఈ పుకార్లను లావణ్య త్రిపాఠి ఖండించడం విశేషం. వరుణ్ సైతం అలాంటిదేమీ లేదన్నాడు. 


సడన్ గా నిశ్చితార్థం ప్రకటించి ఆశ్చర్యానికి గురి చేశారు. నాగబాబు నివాసంలో ఎంగేజ్మెంట్ వేడుక జరిగింది. ఇటలీలో వివాహం అనంతరం హైదరాబాద్ లో మ్యారేజ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు.ఈ వేడుకకు టాలీవుడ్ ప్రముఖులు హాజరై నూతన జంటను ఆశీర్వదించారు. ఇటీవల లావణ్య త్రిపాఠి మిస్ పర్ఫెక్ట్ టైటిల్ తో ఓ వెబ్ సిరీస్ చేసింది. ఈ సిరీస్ ప్రమోషన్స్ లో పాల్గొన్న లావణ్య భర్త వరుణ్ ని ఉద్దేశిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. 
 

మీరు లైఫ్ లో పర్ఫెక్ట్ కదా అని యాంకర్ అడగ్గా... కొన్ని విషయాల్లో మాత్రమే నేను పర్ఫెక్ట్. అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ గా ఉండాలని కోరుకోను. సినిమా, యాక్టింగ్, డైలాగ్స్ వంటి విషయాల్లో నేను పర్ఫెక్ట్ గా ఉంటాను. బాగా నటించాలి అనుకుంటాను, అని లావణ్య సమాధానం చెప్పింది. మరి ఇంట్లో మీ ఇద్దరిలో ఎవరు పర్ఫెక్ట్? అని యాంకర్ మరొక ప్రశ్న అడిగాడు. 

వరుణ్ కి శుభ్రంగా ఉండటం చాలా ఇష్టం. ఖాళీ సమయం దొరికితే క్లీన్ చేయడం, సర్దటం చేస్తూ ఉంటాడు. తన మూడ్ బాగోకపోయినా క్లీన్ చేస్తాడు. అంతెందుకు మేము విదేశాలకు టూర్ కి వెళితే అక్కడ నా సామానులు కూడా ఆయనే సర్దేస్తాడు... అని గట్టిగా నవ్వేసింది. లావణ్య కామెంట్స్ విన్న సోషల్ మీడియా జనాలు... వరుణ్ ని ఓ రేంజ్ లో కంట్రోల్ లో పెట్టింది లావణ్య. పాపం ఎన్ని కష్టాలు వచ్చాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

అయితే అవన్నీ సరదా కామెంట్స్ మాత్రమే. భార్యాభర్తలు అన్నాక ఒకరికొకరు సాయం చేసుకోవడం సాధారణమే కదా. మిస్ పర్ఫెక్ట్ అనంతరం లావణ్య మరొక ప్రాజెక్ట్ చేయలేదు. ఆమె నిర్మాతగా మారాలని అనుకుంటున్నారని ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. చూడాలి లావణ్య ఏ రంగంలో రాణిస్తుందో.. 

Latest Videos

click me!