స్టార్ డైరెక్టర్ తో వాదించి మరీ అల్లు అర్జున్ సినిమాని కాపాడిన అలీ.. ఆ మార్పు చేయకుంటే అట్టర్ ఫ్లాప్

First Published | Oct 7, 2024, 10:15 AM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో ఎప్పుడూ డల్ పీరియడ్ లేదు. ఏళ్ల తరబడి హిట్స్ లేకుండా ఉన్న సందర్భాలు లేవు. రెగ్యులర్ గా బన్నీకి హిట్ చిత్రాలు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో నాల్గవ చిత్రంలో నటిస్తున్నాడు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో ఎప్పుడూ డల్ పీరియడ్ లేదు. ఏళ్ల తరబడి హిట్స్ లేకుండా ఉన్న సందర్భాలు లేవు. రెగ్యులర్ గా బన్నీకి హిట్ చిత్రాలు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో నాల్గవ చిత్రంలో నటిస్తున్నాడు. పుష్ప 2 చిత్రం పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో పుష్ప చిత్రంతో పాటు ఆర్య, ఆర్య 2 వచ్చాయి. 

అదే విధంగా త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ మూడు చిత్రాల్లో నటించారు. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో చిత్రాలు వీరిద్దరి కాంబోలో వచ్చాయి. వివి వినాయక్ దర్శకత్వంలో రెండు చిత్రాల్లో, పూరి జగన్నాధ్ దర్సకత్వంలో రెండు చిత్రాల్లో అల్లు అర్జున్ నటించారు. టాలీవుడ్ లో చాలా చిత్రాలు కేవలం కామెడీ వల్ల హిట్టైన సందర్భాలు ఉన్నాయి. కానీ ఒక కమెడియన్ ఇచ్చిన సలహాతో సినిమా ఫ్లాప్ నుంచి తప్పించుకుంటే.. అది నిజంగా అద్భుతమే. 

అలాంటి సంఘటన అల్లు అర్జున్ సినిమా విషయంలో జరిగింది. ఆ సంఘటన ఏంటి ? ఆ కమెడియన్ ఎవరు ? అనేది ఇప్పుడు తెలుసుకుందాం. త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చి జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో మూడు చిత్రాలు హిట్టయ్యాయి. జులాయి సూపర్ హిట్ కాగా అల వైకుంఠపురములో చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక సన్నాఫ్ సత్యమూర్తి మూవీ సూపర్ హిట్టు కాదు కానీ పర్వాలేదనిపించే విజయం దక్కించుకుంది. 

అయితే ఈ చిత్రం విషయంలో త్రివిక్రమ్ చేసిన పొరపాటు వల్ల సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యే ప్రమాదం ఏర్పడిందట. కమెడియన్ అలీ కలుగ జేసుకుని కాపాడారు. సన్నాఫ్ సత్యమూర్తి చిత్రంలో అల్లు అర్జున్ తర్వాత హైలైట్ అయింది ఉపేంద్ర. ఈ చిత్రంలో ఉపేంద్ర దేవరాజు పాత్రలో నటించారు. కొన్ని గ్రామాలకు నియంతలా నటించారు. ఈ చిత్రంలో ఉపేంద్ర బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, అల్లు అర్జున్ తో వచ్చే సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. 

ఈ చిత్రంలో ఉపేంద్ర తన పాత్రకి తాను డబ్బింగ్ చెప్పుకోలేదు. దీనితో డైరెక్టర్ త్రివిక్రమ్ ఒకరిచేత ఉపేంద్ర పాత్రకి డబ్బింగ్ చెప్పించారట. అలీ తాను డబ్బింగ్ చెడుతున్నప్పుడు ఉపేంద్ర పాత్ర డైలాగులు విన్నారు. ఈ చిత్రంలో అలీ కీలక పాత్రలో నటించారు. ఉపేంద్ర వాయిస్ ఏంటి సార్ ఇలా ఉంది.. సినిమాలో కూడా ఇదే ఉంచుతున్నారా అని అలీ.. త్రివిక్రమ్ ని అడిగారట. అవును ఇదే డబ్బింగ్ ఉంటుంది అని త్రివిక్రమ్ సమాధానం ఇచ్చారు. ఉపేంద్రకి ఆ వాయిస్ ఏమాత్రం సెట్ కాలేదు సార్. థియేటర్ లో జనాలు ఈ వాయిస్ వింటే సినిమాపై ఎఫెక్ట్ పడుతుంది అని అలీ.. త్రివిక్రమ్ తో వాదించారు. 

దీనితో త్రివిక్రమ్ మరోసారి ఉపేంద్ర డబ్బింగ్ విని నిజమే తేడాగా అనిపిస్తోంది అని చెప్పారట. మార్చేద్దాం అనుకుంటున్న సమయంలో ఎవరైతే బావుంటుంది అని ఆలోచించారు. అప్పుడు అలీ.. ఉపేంద్ర పాత్రకి రవిశంకర్ డబ్బింగ్ చెబితే బావుంటుంది అని సలహా ఇచ్చారు. రవిశంకర్ టాలీవుడ్ లో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా నటుడిగా రాణిస్తున్నారు. ఆయన సాయి కుమార్ సోదరుడు అనే సంగతి తెలిసిందే. వెంటనే త్రివిక్రమ్ రవిశంకర్ ని పిలిపించి ఉపేంద్ర పాత్రకి డబ్బింగ్ చెప్పించారు. ఆ విధంగా అలీ.. సన్నాఫ్ సత్యమూర్తి చిత్రం ఫ్లాప్ కాకుండా కాపాడారు. 

click me!