మెగా కోడలిగా మరో హీరోయిన్..సైలెంట్ గా ఫ్యామిలిలో కలిసిపోయింది, అసలు ఊహించలేరు ?

First Published | Nov 8, 2024, 7:59 AM IST

సెలెబ్రిటీల పెళ్లిళ్లు, ప్రేమ వ్యవహారాల గురించి లెక్కలేనన్ని గాసిప్స్ వస్తుంటాయి. వాటిలో కొన్ని నిజమైన సందర్భాలు కూడా ఉన్నాయి.మెగా ఫ్యామిలీ విషయానికి వస్తే సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్ ఇంకా బ్యాచిలర్స్ గా ఉన్నారు. 

సెలెబ్రిటీల పెళ్లిళ్లు, ప్రేమ వ్యవహారాల గురించి లెక్కలేనన్ని గాసిప్స్ వస్తుంటాయి. వాటిలో కొన్ని నిజమైన సందర్భాలు కూడా ఉన్నాయి. నాగ చైతన్య, శోభిత గురించి చాలా కాలంగా రూమర్స్ వస్తూనే ఉన్నాయి. కట్ చేస్తే అతి త్వరలో వీళ్ళిద్దరూ దంపతులు కాబోతున్నారు. మెగా ఫ్యామిలీ విషయానికి వస్తే సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్ ఇంకా బ్యాచిలర్స్ గా ఉన్నారు. 

ఆ మధ్యన వైష్ణవ్ తేజ్ గురించి కొన్ని రూమర్స్ వచ్చాయి. వైష్ణవ్ తేజ్ ఒక క్రేజీ హీరోయిన్ తో డేటింగ్ లో ఉన్నాడని వార్తలు వచ్చాయి. సదరు హీరోయిన్ గురించి రూమర్స్ రావడం ఇదే తొలిసారి. ఆమె సైలెంట్ గా మెగా ఫ్యామిలిలో కలసి పోయింది అంటూ ప్రచారం మొదలయింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు రీతూ వర్మ. స్టైలిష్ గా అందంగా కనిపిస్తూనే రీతూ వర్మ ప్రేక్షకులని ఆకట్టుకుంటోంది. గ్లామర్ విషయంలో హద్దుల్లో ఉంటూ నటిస్తోంది. 


వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహం జరిగినప్పుడు కుటుంబ సభ్యులు మాత్రమే పెళ్ళిలో పాల్గొన్నారు. రిసెప్షన్ కి టాలీవుడ్ ప్రముఖులు అంతా హాజరయ్యారు. కానీ లావణ్య, వరుణ్ తేజ్ పెళ్ళిలో రీతూ వర్మ సందడి చేసింది. చివరికి మెగా ఫ్యామిలీ.. ఫ్యామిలీ ఫొటోస్ లో కూడా రీతూ వర్మ కనిపించింది. దీనితో అప్పటి నుంచి రూమర్స్ మొదలయ్యాయి. 

వైష్ణవ్ తేజ్, రీతూ వర్మ డేటింగ్ లో ఉన్నారు అంటూ చాలా మంది భావించారు. ఈ రూమర్స్ పై వైష్ణవ్ తేజ్ క్లారిటీ ఇచ్చాడు. రీతూ వర్మ..లావణ్య త్రిపాఠికి బెస్ట్ ఫ్రెండ్.. అందుకే ఆమె పెళ్ళికి వచ్చింది. మా మధ్య ఎలాంటి రిలేషన్ లేదు అని వైష్ణవ్ క్లారిటీ ఇచ్చాడు. ఏకంగా మెగా ఫ్యామిలీలో కలసి పోయి హంగామా చేయడంతో సంథింగ్ సంథింగ్ సాగుతోంది అని అంతా అనుకున్నారు. 

రీతూ వర్మ ఇంతవరకు ఒక్క మెగా హీరోతో కూడా సినిమా చేయలేదు. చివరగా ఆమె శ్రీ విష్ణు సరసన స్వాగ్ అనే చిత్రంలో నటించింది. థియేటర్స్ లో ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయిన స్వాగ్.. ఓటిటిలో మాత్రం కల్ట్ మూవీ అంటూ ప్రశంసలు అందుకుంటోంది. 

Latest Videos

click me!