శ్రీదేవి అలాంటి కోర్కెలు కోరలేదు.. తప్పుడు ప్రచారం చేసింది అతడే.. : బోనీ క‌పూర్

Published : Sep 07, 2025, 01:48 PM IST

Sridevi - boney kapoor: బాహుబలి సినిమాలో శివగామి పాత్రను స్టార్ హీరోయిన్ శ్రీదేవి పోషించకపోవడానికి గల కారణాన్ని ఆమె భర్త, డైరెక్టర్ బోనీ కపూర్ వెల్లడించారు. పలువురిపై షాకింగ్ కామెంట్స్ చేశారు.

PREV
16
బాహుబలి శివగామి రోల్‌పై బోనీ కపూర్ కామెంట్స్!

Sridevi Baahubali Shivagami Role: భారతీయ సినీ చరిత్రలో మైలురాయిగా నిలిచిన బాహుబలి. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ భారీ బ్లాక్ బస్టర్ ఇండియన్ సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఈ సినిమాతో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్ తదితరులకు ఈ పాన్ ఇండియా రేంజ్‌లో క్రేజ్ తెచ్చి పెట్టింది.

ముఖ్యంగా రమ్యకృష్ణ పోషించిన ‘శివగామి’పాత్ర సినిమాకు ఫిలర్ లాంటిది. అయితే, ఈ పాత్ర కోసం మొదట అతిలోక సుందరి శ్రీదేవిని అనుకున్నారని అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. తాజాగా శ్రీదేవి చేయకపోవడానికి గల కారణాలను ఆమె భర్త బోనీ కపూర్ వెల్లడించారు. 

26
శ్రీదేవిని తప్పించిందెవరు?

దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి కూడా గతంలో ఈ విషయాన్ని పలు సందర్భాల్లో ఒప్పుకున్నారు. కానీ, శ్రీదేవి భారీ పారితోషికం, హోటల్‌ ఫ్లోర్‌ డిమాండ్ చేసిందని ఆయన చెప్పడంతో ఆ సమయంలో పెద్ద వివాదం రేగింది. తాజాగా శ్రీదేవి భర్త, ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ ఈ అంశంపై స్పందించారు. బాహుబలి సినిమాలో శివగామి పాత్రను శ్రీదేవి పోషించకపోవడానికి గల కారణాన్ని బోనీ కపూర్ వెల్లడించారు. ఆయన అసలు కథ బయటపెట్టారు

36
బోనీ కపూర్ వ్యాఖ్యలు

ఒక ఇంటర్వ్యూలో బోనీ కపూర్ మాట్లాడుతూ “శివగామి పాత్ర కోసం శ్రీదేవిని ప్లాన్ చేశారనే విషయం నిజమే. రాజమౌళి స్వయంగా మా ఇంటికి వచ్చి కథ చెప్పాడు. శ్రీదేవి ఆ పాత్రలో నటించాలని చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఆయనలోని ప్యాషన్ చూసి శ్రీదేవి చాలా ఎక్సైటెడ్ అయింది. 

ఆమె ఆ పాత్ర చేయాలని నిజంగా అనుకుంది, రాజమౌళి కూడా ఆమె అభిమానిగా, గౌరవంగా వ్యవహరించారు. కానీ తర్వాత నిర్మాతల కారణంగా ఈ ప్రాజెక్ట్ జరగలేదు” అన్నారు. బోనీ ప్రకారం సమస్య రాజమౌళితో కాకుండా నిర్మాతలతోనే వచ్చిందట. నిర్మాతలు శ్రీదేవి పారితోషికంపై సరైన ఆఫర్ ఇవ్వలేదని చెప్పారు.

46
అలాంటి కోరికలు కోరలేదు..

బోని కపూర్ ఇంకా మాట్లాడుతూ.. . “రాజమౌళి వెళ్లిన తర్వాత నిర్మాతలు వచ్చి రెమ్యునరేషన్ గురించి మాట్లాడారు. కానీ వారు చెప్పిన ఆఫర్ చాలా తక్కువ, అప్పటికే శ్రీదేవి ‘ఇంగ్లీష్ వింగ్లీష్’ కోసం తీసుకున్న పారితోషికం కన్నా చాలా తక్కువ. అలాంటప్పుడు ఆమెకు అది అంగీకారయోగ్యం కాలేదు,” అన్నారు. అదే సమయంలో ‘బాహుబలి’ హిందీలో కూడా భారీ మార్కెట్ సాధిస్తుందని తెలిసినా నిర్మాతలు ఎక్కువ ఇవ్వడానికి సిద్ధంగా లేరు ” అని బోనీ పేర్కొన్నారు. 

పైగా “శ్రీదేవి ఎక్కువ పారితోషికం, హోటల్‌లో ఫ్లోర్ డిమాండ్ చేసిందని అసత్య ప్రచారం చేశారు. మేం అడిగింది ఒక్కటే – షూటింగ్ షెడ్యూల్స్ ఎక్కువగా ఉండకూడదు, ఎందుకంటే మా పిల్లలు చాలా చిన్నవాళ్లు. వాళ్లతో సమయం గడపడానికి మాత్రమే ఆ అటువంటి షరతు పెట్టాం. దానిని తప్పుగా వాడుకున్నారు” అని బోనీ స్పష్టం చేశారు.

56
నిర్మాతలపై ఆరోపణలు

బోనీ కపూర్ నేరుగా శోభు యార్లగడ్డపైనే ఆరోపణలు చేశారు. “శ్రీదేవి గురించి రాజమౌళికి తప్పుడు సమాచారం చెప్పారు. ఆమె గొంతెమ్మ కోర్కెలు పెట్టిందంటూ ప్రచారం చేశారు. కానీ నిజానికి అలా ఏం జరగలేదు. శ్రీదేవి జీవితాంతం ఎప్పుడూ నిర్మాతలతో ఒత్తిడి చేయలేదు. 300కు పైగా సినిమాలు చేసిన నా భార్యకు అలాంటి అవసరం లేదు” అని అన్నారు. 

బోనీ కపూర్ చెప్పినదాని ప్రకారం రాజమౌళి ఎప్పుడూ శ్రీదేవిని గౌరవించేవారు. కానీ నిర్మాతల మాటలు విన్న తర్వాతే ఆయన వేరేలా ఆలోచించినట్లు తెలుస్తోంది.అప్పట్లో రాజమౌళి ఓ ఇంటర్వ్వూలో మాట్లాడుతూ.. “శ్రీదేవి భారీ పారితోషికం, ఫ్లోర్ అడిగింది”అని చెప్పిన విషయం అందరికీ తెలిసిందే.

66
నిజం ఏది ?

ఒకవైపు రాజమౌళి చెప్పిన వెర్షన్.. మరోవైపు బోనీ కపూర్ వివరణ.. ఈ రెండింటి మధ్య నిజం ఏది అన్నది ఎవరికీ స్పష్టంగా తెలియడం లేదు. శోభు యార్లగడ్డ ఈ ఆరోపణలపై ఎలా స్పందిస్తారో ఇప్పుడు సినీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. మొత్తానికి, ‘బాహుబలి’ శివగామి పాత్ర వెనుక అనేక రహస్యాలు ఉన్నట్లు కనిపిస్తోంది. శ్రీదేవి చేస్తే పాత్ర వేరే రీతిలో నిలిచేదేమో కానీ, రమ్యకృష్ణ నటనతో అది లెజెండరీ రోల్‌గా నిలిచిపోయింది అనడంలో సందేహం లేదు. 

మొత్తానికి ఆ పాత్ర రమ్యకృష్ణకు దక్కింది. ఆమె తన స్టైల్లో శివగామి పాత్రకు ప్రాణం పోసింది. ప్రేక్షకులు ఇప్పటికీ ఆ పాత్రను గుర్తు చేసుకుంటే మొదటగా రమ్యకృష్ణనే గుర్తు చేసుకుంటారు. బోనీ కపూర్ తాజా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం అందరి దృష్టి నిర్మాత శోభు యార్లగడ్డ వైపు మళ్లింది. ఆయన ఈ ఆరోపణలపై ఎలా స్పందిస్తారో చూడాలి.

Read more Photos on
click me!

Recommended Stories