టాలీవుడ్ లో ప్రియమణి ఎక్కువగా కమర్షియల్ చిత్రాల్లో గ్లామర్ రోల్స్ చేసింది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో ప్రియమణి వైవిధ్యమైన పాత్రలకు ప్రాధాన్యత ఇస్తోంది. వివాదాల జోలికి పోకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ కెరీర్ లో ముందుకు సాగుతోంది.
తాజాగా ప్రియమణి బాలీవుడ్ లో నటించిన చిత్రం మైదాన్. అజయ్ దేవగన్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో ఈ చిత్రంలో నటించారు. ఉగాది కానుకగా విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఈ చిత్ర స్క్రీనింగ్ లో బాలీవుడ్ సెలెబ్రటీలు పాల్గొన్నారు.
ప్రియమణి కూడా హాజరైంది. జాన్వీ కపూర్ తండ్రి.. బడా నిర్మాత బోనీ కపూర్ కూడా ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరు. మైదాన్ మూవీ స్క్రీనింగ్ కి హాజరైన ఆయన ప్రియమణితో కలసి కెమెరాకి ఫోజులు ఇచ్చారు. ఈ క్రమంలో ఆయన ప్రవర్తన నెటిజన్లకు అసలు నచ్చడం లేదు.
కెమెరాలకు ఫోజులు ఇచ్చే సమయంలో ఆయన ప్రియమణి నడుముని తడుముతూ కనిపించారు. ఆ తర్వాత భుజంపై చేయి వేసి ఫోజులు ఇచ్చారు. భుజం పై చేతులు వేయడం పెద్ద తప్పేమి కాకపోవచ్చు. కానీ ఆయన నడుముపై చేయి వేయడంతో నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.
కూతురు వయసున్న నటితో ప్రవర్తించే విధానం అదేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. అది కూడా కెమెరాకు ఫోజులు ఇస్తూ పబ్లిక్ లో చీప్ గా బిహేవ్ చేస్తారా అని ట్రోల్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రియమణి భుజం పట్టుకుని అటు ఇటు జరుపుతూ కూడా కనిపించారు.
అయితే బోనీ కపూర్ పొరపాటున అలా చేయి వేసి ఉంటారని కొందరు మద్దతు తెలుపుతున్నారు. ఏది ఏమైనా బోనీ కపూర్ ఉండకూడని విధంగా వార్తల్లో నిలిచారు. శ్రీదేవి మరణం తర్వాత తన కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషి కపూర్ కెరీర్ బాధ్యతలని బోనీ కపూర్ తీసుకున్నారు. జాన్వీ కపూర్ మాత్రం అటు బాలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతోంది.