ఎన్టీఆర్ కి త్రివిక్రమ్ తథాస్తు..1000 కోట్ల సత్తా ఎవరికి ఉంది.. బన్నీ, ప్రభాస్, రాంచరణ్ పరిస్థితి ఏంటి

First Published Apr 10, 2024, 6:42 PM IST

టాలీవుడ్ లో పాన్ ఇండియా చిత్రాలు కళకళ లాడుతున్నాయి. ఈ ఏడాది టాలీవుడ్ నుంచి బోలెడన్ని పాన్ ఇండియా చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి. కొన్ని చిత్రాలపై అయితే 1000 కోట్ల కలెక్షన్స్ అంటూ అంచనాలు మొదలయ్యాయి.

టాలీవుడ్ లో పాన్ ఇండియా చిత్రాలు కళకళ లాడుతున్నాయి. ఈ ఏడాది టాలీవుడ్ నుంచి బోలెడన్ని పాన్ ఇండియా చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి. కొన్ని చిత్రాలపై అయితే 1000 కోట్ల కలెక్షన్స్ అంటూ అంచనాలు మొదలయ్యాయి. తెలుగు హీరోలు 1000 కోట్లు సాధించే చిత్రాల్లో నటిస్తే సంతోషమే..కానీ వాస్తవంగా 100 కోట్లు సాధించే సత్తా ఏ చిత్రాలకు ఉంది.. ఆ రేసులో ఉన్న చిత్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. 

ఇటీవల టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్ కి త్రివిక్రమ్, ఎన్టీఆర్ హాజరయ్యారు. వేదికపై త్రివిక్రమ్, ఎన్టీఆర్ ఇద్దరూ దేవర చిత్రం గురించి చేసిన కామెంట్స్ తో ఇప్పుడు టాలీవుడ్ లో 1000 కోట్ల చర్చ మొదలైంది. ఉగాది నుంచి ఈ ఏడాదిని దేవర నామ సంవత్సరంగా ప్రకటిస్తున్నట్లు త్రివిక్రమ్ అన్నారు. 

టిల్లు స్క్వేర్ సాధించిన 100 కోట్ల పక్కన మరో సున్నా చేర్చి దేవర 1000 కోట్లు అందుకోవాలని మాటల మాంత్రికుడు తధాస్తు అన్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్ మాట్లాడుతూ కాస్త లేట్ అయినా దేవర చిత్రం కాలర్ ఎగరేసుకునేలా ఉంటుంది అని అన్నారు. 

దీనితో దేవర చిత్రంపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ చిత్రం కోసం కొరటాల శివ పడుతున్న కష్టం.. ఇప్పుడు ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు చూస్తూ దేవర బలంగా కొట్టబోతున్నట్లు ఫ్యాన్స్ అంచనాలు వేస్తున్నారు. కచ్చితంగా దేవర 1000 కోట్ల మార్క్ అందుకోవాలని ఆశిస్తున్నారు. 

ఇక ఈ ఏడాది పాన్ ఇండియా చిత్రం గా రిలీజ్ కాబోతున్న మరో చిత్రం ప్రభాస్ కల్కి 2898 ఎడి. ఈ చిత్రానికి 1000 మార్క్ అందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ చిత్రంలో నటిస్తున్న కాస్టింగ్ అలాటింది. దీపికా పదుకొనె, అమితాబ్, దిశా పటాని లాంటి స్టార్స్ నటిస్తున్నారు. నార్త్ లో ప్రభాస్ క్రేజ్ గురించి చెప్పనవసరం లేదు. సలార్ చిత్రం 1000 కోట్ల వసూళ్లు సాధించలేకపోయింది. మరి కల్కి ఎలాంటి అద్భుతాలు చేస్తుందో చూడాలి. 

పాన్ ఇండియా స్థాయిలో భారీ హైప్ ఉన్న మరో చిత్రం పుష్ప 2. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆగష్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియా స్థాయిలో రీ సౌండ్ వచ్చేలా విజయం సాధించాలని బన్నీ కష్టపడుతున్నాడు. ఈ చిత్రం 1000 కోట్ల మార్క్ అందుకుంటే అద్భుతమే కానీ.. ఆ రేంజ్ వరకు వెళ్లినా చాలు. 

ఇక రాంచరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ చిత్రం కూడా ఈ ఏడాదే రిలీజ్ కానుంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఇది. ఈ చిత్రంపై ఇప్పుడున్న బజ్ తో 1000 కోట్ల టార్గెట్ అంటే కష్టమే అని చెప్పాలి. మరి రాంచరణ్, శంకర్ లకి నేషనల్ వైడ్ ఉన్న క్రేజ్ కి తగ్గట్లుగా ప్లాన్ చేస్తే ఏమైనా అద్భుతాలు జరగొచ్చు. 

click me!