పెళ్లికి ముందే జాన్వీ పుట్టిందన్నారు.. శ్రీదేవితో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన బోనీ కపూర్‌.. ఏం జరిగిందంటే?

Published : Oct 03, 2023, 07:40 PM IST

అతిలోక సుందరి శ్రీదేవి ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలుస్తుంది. ఆమె డెత్‌ మిస్టరీ, బోనీ కపూర్‌తో పెళ్లి విషయాలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. హాట్‌ టాపిక్‌గా మారుతున్నాయి.   

PREV
15
పెళ్లికి ముందే జాన్వీ పుట్టిందన్నారు.. శ్రీదేవితో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన బోనీ కపూర్‌.. ఏం జరిగిందంటే?

శ్రీదేవి(Sridevi) మరణంపై స్పందించారు భర్త బోనీ కపూర్‌(Boney Kapoor). ఆమెది సహజ మరణం కాదని, యాక్సిడెంటల్‌గా జరిగిందని తెలిపారు. ఈ విషయాన్ని పోలీసులు కూడా వెల్లడించారని, ఇందులో కుట్ర కోణం లేదని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో మరో సంచలన విషయాన్ని బయటపెట్టారు బోనీ కపూర్‌. శ్రీదేవితో పెళ్లి మ్యాటర్‌, జాన్వీ జన్మించినప్పుడు వచ్చిన వార్తలపై ఆయన రియాక్ట్ అయ్యారు. 
 

25

బోనీ కపూర్‌ ఓ ఇంగ్లీష్‌ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలన్ని బయటపెట్టారు. అనేక సస్పెన్స్ విషయాలకు, రూమర్లకి చెక్‌ పెడుతూ, క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇందులో బోనీ కపూర్‌ మాట్లాడుతూ, 1996లో శ్రీదేవి, తాను షిర్డిలో రహస్య వివాహం చేసుకున్నట్టు తెలిపారు. ఆ తర్వాత కొన్ని నెలలకు తమ పెళ్లి విషయాన్ని మీడియాకి తెలియజేశామని, 1997 జనవరిలో మరోసారి తాము పబ్లిక్‌గా మ్యారేజ్‌ చేసుకున్నట్టు చెప్పారు. 
 

35

ఆ విషయాన్ని కూడా మీడియాకి తెలియజేసినట్టు బోనీ కపూర్‌ తెలిపారు. దీంతో అనేక రూమర్లు ప్రారంభమయ్యాయని, జాన్వీ కపూర్‌(Janhvi Kapoor) 1997 మార్చిలో జన్మించిందని, కానీ జాన్వీ తమ పెళ్లి కంటే ముందే పుట్టిందనే ప్రచారం చేశారు. మీడియాలో కథనాలు వచ్చాయి. అవే ఇప్పటికీ కూడా కొనసాగుతున్నాయని, జాన్వీ బర్త్ గురించి అనేక సార్లు వివరణ ఇచ్చినా, అదే ప్రచారం ఇప్పటికీ సాగుతుందని, ఆగడం లేదన్నారు బోనీ కపూర్‌.
 

45

ఈ సందర్భంగా శ్రీదేవి దైవ భక్తి గురించి చెబుతూ, ఆమెకి దేవుడంటే చాలా నమ్మకమని, తన ప్రతి పుట్టిన రోజుకి తిరుపతి వెళ్లేవారని వెల్లడించారు. అలాగే ఇప్పుడు జాన్వీ కపూర్‌ కూడా ప్రతి మూడు నెలలకు కచ్చితంగా తిరుమల వెళ్తుంటుందన్నారు బోనీ కపూర్‌. ఈ సందర్భంగా తన కెరీర్‌ గురించి, సినిమాల గురించి, ఫ్యామిలీ గురించి ఓపెన్‌గా పంచుకున్నారు.
 

55

ఇందులో శ్రీదేవి మరణంపై కూడా ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. శ్రీదేవి గ్లామర్‌ విషయంలో ఆమె చాలా కేర్‌ తీసుకునేదని, అందులో భాగంగానే సాల్ట్ తక్కువగా తీసుకుంటుందని, దీంతో లో బీపీ వచ్చేదని తెలిపారు. దుబాయ్‌లో హోటల్‌ రూమ్‌లో శ్రీదేవి అలానే పడిపోయి ఉంటుందనే విషయాన్ని బోనీ కపూర్‌ పరోక్షంగా తెలిపారు. మరోవైపు శ్రీదేవి ఓ సారిసెట్‌లో కూడా ఇలానే కళ్లు తిరిగిపడిపోయిందని నాగార్జున తనకు చెప్పినట్టు బోనీ కపూర్‌ వెల్లడించారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories