నిహారిక మాజీ భర్త చైతన్య రెండో పెళ్లి.. ఆ బాధ నుంచి బయటపడేందుకే?.. అమ్మాయి ఎవరంటే?

Published : Oct 03, 2023, 05:32 PM ISTUpdated : Oct 03, 2023, 05:35 PM IST

మెగా డాటర్‌ నిహారిక, చైతన్య జొన్నలగడ్డ ఈ మధ్యనే విడాకులు తీసుకున్నారు. అయితే ఇప్పుడు చైతన్య రెండో పెళ్లికి సిద్ధమయ్యాడట. అమ్మాయిని కూడా చూశారని తెలుస్తుంది.   

PREV
16
నిహారిక మాజీ భర్త చైతన్య రెండో పెళ్లి.. ఆ బాధ నుంచి బయటపడేందుకే?.. అమ్మాయి ఎవరంటే?

మెగా బ్రదర్‌ నాగబాబు కూతురు నిహారిక(Niharika), చైతన్య జొన్నలగడ్డ (Chaitanya Jonnalagadda) మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. జైపూర్‌లోని ఉదయ్‌ పూర్‌ ప్యాలెస్‌లో చాలా గ్రాండ్‌గా, అత్యంత లావిష్‌గా వీరి వివాహం జరిగింది. వివాహం జరిగిన రెండేళ్లకే విడిపోయారు. ఈ ఏడాది జులై నెలలో ఈ ఇద్దరు విడాకులు తీసుకున్నట్టు బయటకు వచ్చింది. ఆ తర్వాత ఇద్దరు ప్రకటించారు. 
 

26

ప్రస్తుతం ఇటు నిహారికా, అటు చైతన్య తమ వ్యక్తిగత కెరీర్‌లతో బిజీగా ఉన్నారు. నిహారిక సినిమాలపై ఫోకస్‌ పెట్టింది. ఆమె ఓ వైపు తన బ్యానర్‌లో వెబ్‌ సిరీస్‌లు నిర్మిస్తుంది. నటిగానూ రీఎంట్రీ ఇచ్చింది. దీంతోపాటు సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఇప్పుడు పర్సనల్‌ లైఫ్‌కి సంబంధించిన ఫ్రీడమ్‌ వచ్చింది. దీంతో స్వేచ్ఛగా విహరిస్తుంది. అందాల విందుతో నెట్టింట రచ్చ చేస్తుంది. 

 

36

విడాకులు తీసుకున్న నేపథ్యంలో దానికి సంబంధించిన పెయిన్‌ నుంచి రిలీఫ్‌ కోసం వెకేషన్‌కి వెళ్లింది. ఫ్యామిలీతోపాటు సింగిల్‌గానూ వెళ్లింది. రిలాక్స్ అయి వచ్చింది. ఇప్పుడు కెరీర్‌ పై ఫోకస్‌ పెట్టింది. పెళ్లి అనే ఆలోచనకే దూరంగా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు నిహారిక మాజీ భర్త చైతన్యకి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్‌ వినిపిస్తుంది. ఆయన త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడట.

46

చైతన్య జొన్నలగడ్డ రెండో పెళ్లి(Chaitanya Second Marriage) కి సిద్ధమవుతున్నాడనే వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. మ్యారేజ్‌ బ్రేక్‌ కావడంతో ఆయన కూడా చాలా బాధపడ్డారు. దాన్నుంచి బయటపడేందుకు వెకేషన్‌కి వెళ్లారు. ఇప్పుడే మరోసారి పెళ్లి అనే ఆలోచన పెట్టుకోలేదట. కానీ ఇంట్లో నుంచి ఒత్తిడి పెరుగుతుందని, మళ్లీ పెళ్లిచేసుకోవాలని ఒత్తిడి తీసుకొస్తున్నారని, దీంతో రెండో పెళ్లికి సిద్ధమయ్యాడట. తప్పని పరిస్థితిలో రెండో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. 
 

56

తమ ఫ్యామిలీకి బాగా తెలిసిన అమ్మాయినే పెళ్లి చేసుకోబోతున్నారని, తమకి బాగా క్లోజ్‌గా ఉండే ఓ ఐపీఎస్‌ అధికారి కూతురితో చైతన్య రెండో వివాహానికి సిద్ధమయ్యాడని తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇరు కుటుంబాలు మాట్లాడుకుని ఓకే అనుకున్నాయని, పెళ్లి ముహూర్తం కోసం వేచి చూస్తున్నట్టు టాక్‌. ఈ విషయం నెట్టింట బాగా వైరల్ అవుతుంది. ఇందులో వాస్తవం ఏంటో తెలియాల్సి ఉంది. 
 

66

ఇక నిహారిక మాత్రం ఇప్పట్లో పెళ్లి అనే ఆలోచనే చేయడం లేదని సమాచారం. త్వరలో వరుణ్‌ తేజ్‌ వివాహం జరగబోతుంది. హీరోయిన్‌ లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకోబోతున్నారు. పెళ్లికి సంబంధించిన ముందస్తు ఏర్పాట్లు కూడా స్టార్ట్ చేశారట. కాకపోతే మ్యారేజ్‌ డేట్‌పై క్లారిటీ రావాల్సి ఉంది. వరుణ్‌ తేజ్‌ మ్యారేజ్‌ తర్వాతనే కొంత గ్యాప్‌ తీసుకుని నెమ్మదిగా నిహారిక రెండో వివాహం చేసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories