తెలుగు సినిమా చరిత్రలో యూత్ ఆడియన్స్ మర్చిపోలేని సినిమా బొమ్మరిల్లు. ఫ్యామిలీ ఆడియన్స్ కు మంచి మెసేజ్ ఇచ్చిన ఈసినిమాకు సీక్వెల్ ఎప్పుడు రాబోతోంది. అందులో నటించేది ఎవరు?
20 ఏళ్ళ క్రితం యూత్ ను ఉర్రూతలూగించిన సినిమా బొమ్మరిల్లు.. ఎన్నో ఆశలతో కాలేజీ కెరీర్ పూర్తి చేసి..తనకు నచ్చిన జీవితం.. అంద్భుతంగా ప్లాన్ చేసుకోవాలి అనకునే యువకుడి కథ ఇది. అటువంటి ఆలోచనలు ఉన్న యంగ్ స్టార్ కు.. అంతకు మించిన ఆలోచనలు ఉన్న తండ్రి ఉంటే..? ఆ తండ్రి తన కొడుకు జీవితాన్ని తనకు నచ్చినట్టుగా.. తీర్చిదిద్దాలి అనుకుంటే.. ఆ తండ్రి కొడుకుల మధ్య ఘర్షణ ఎలా ఉంటుందో చూపించిన సినిమా బొమ్మరిల్లు.
25
తండ్రీ కొడుకుల కథ..
ఈసినిమాలో తండ్రి, కొడుకు ఇద్దరు మంచివారే.. ఇద్దరి ఆలోచనలు మంచివే... కానీ ఇద్దరి మధ్య ఉన్న జనరేషన్ గ్యాప్ వల్ల... తేడా వస్తుంటుంది. తండ్రి మాటకు ఎదురు చెప్పలేక.. తనకు నచ్చిన దారిలో నడవలేక హీరో ఎంత ఇబ్బందిపడ్డాడు అనేది.. బొమ్మరిల్లు సినిమా ద్వారా అద్భుతంగా చూపించాడు దర్శకుడుు భాస్కర్. ఇక ఈసినిమా అప్పటి యూత్ కు బాగా కనెక్ట్ అయ్యింది. బ్లకా్ బస్టర్ హిట్ అయ్యింది. తల్లీ తండ్రులు పిల్లల గురించి ఆలోచించాలని మెసేజ్ తోపాటు.. తల్లీ తండ్రులకు పిల్లలు గౌరవం ఇవ్వాలని తెలిసేలా చేసింది బొమ్మరిల్లు.
35
బొమ్మరిల్లు సినిమాకు సీక్వెల్..
ఇక బొమ్మరిల్లు సినిమా వచ్చి 20ఏళ్లు అవుతున్నా..ఆ ప్రభావం ఇప్పటికీ పోలేదు. మంచి సినిమాలు చూసే ఆడియన్స్ మూవీ ప్లే లిస్ట్ లో బొమ్మరిల్లు ఎప్పుడూ ఉంటుంది. కాగా ఈసినిమా ఎన్నిసార్లు టీవీలో వచ్చినా.. కదలకుండా చూస్తుంటారు సినీ ప్రియులు. అయితే బొమ్మరిల్లు సినిమాకు సీక్వెల్ కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఇక ఈసినిమా సీక్వెల్ పై నిర్మాత దిల్ రాజు ఓ సందర్భంలో అప్ డేట్ ను అందించారు. బొమ్మరిల్లు సీక్వెల్ ఉంటుందని. దానికి కాస్త టైమ్ పడుతుందని ఆయన అన్నారు. అప్పటి జనరేషన్ కు ఆ కథ సూట్ అయ్యింది.. ఇక ఇప్పుడు పరిస్థితులు చాలా మారిపోయాయి. ఇప్పటి వారికి తగ్గట్టుగా.. అద్భుతమైన కథ కోసం మేకర్స్ ఎదురు చూస్తున్నారు.
కథ సెట్ అయితే మాత్రం బొమ్మరిల్లు 2 కు ఎక్కువ టైమ్ పట్టదు. రీసెంట్ గా సీనియర్ నటుడు సాయి కుమార్ తనయుడు ఆది సాయి కుమార్ కు సబంధించిన సినిమా ఈవెంట్ లో.. నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. సాయి కుమార్, ఆది మంచి తండ్రి కొడుకులు.. ఒకే మాట మీద ఉంటారు. బొమ్మరిల్లు 2 సినిమా చేస్తేమటుకు.. ప్రకాశ్ రాజ్, సిద్ధార్థ్ పాత్రలలో ఈసారి సాయి కుమార్, ఆది సాయి కుమార్ నటిస్తారు.. వారితోనే ఈసినిమా సీక్వెల్ చేస్తాను అని అన్నారు. దిల్ రాజు సరదాకు అన్నా.. పబ్లిక్ గా ఆమాట అనేసరికి .. నెక్ట్స్ బొమ్మరిల్లులో సాయి కుమార్, ఆయన తనయుడిని చూడబొతున్నామని పిక్స్ అయ్యారు.
55
సిద్ధార్థ్ కు లైఫ్ ఇచ్చిన సినిమా...
సినిమా ఈవెంట్ లో దిల్ రాజు ఇలా మాట్లాడటం పెద్ద చర్చకు దారి తీసింది. సాయి కుమార్, ఆదితో బొమ్మరిల్లు 2 ను నిజంగా దిల్ రాజు ప్లాన్ చేశారా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇక బొమ్మరిల్లు సినిమా ఒకప్పుడు హీరో సిద్ధార్థ్ కు మంచి ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. బాయ్స్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమై సిద్దు... ఇక్కడ పెద్ద స్టార్ కాలేకపోయాడు .. కాని బొమ్మరిల్లు తరువాత అతని దశ తిరిగిపోయింది టాలీవుడ్ లో వరుస ప్రేమ కథ సినిమాలో నటిస్తూ.. లవర్ బాయ్ ఇమేజ్ సాధించాడు. ప్రస్తుతం సిద్ధార్థ్ ఫామ్ లోలేదు. అప్పుడప్పుడు సినిమాలు చేస్తున్నా.. పెద్దగా వర్కౌట్ అవ్వడలేదు.