త్రిష, విశాల్ ఇంటికి పోలీసులు, ఫిల్మ్ ఇండస్ట్రీలో కలకలానికి కారణం ఏంటి?

Published : Nov 04, 2025, 06:34 PM IST

త్రిష, విశాల్, మణిరత్నం లాంటి స్టార్స్ ఇంటికి పోలీసులు రావడం, ప్రత్యేకంగా చెకింగ్ చేయడంతో.. కోలీవుడ్ లో కలకలం చెలరేగింది.  ఓ అజ్ఞాత వ్యక్తి చేసిన  బెదిరింపు కాల్ తో అందరిలో టెన్షన్ మొదలయ్యింది. అసలు చెన్నైలో ఏంజరుగుతోంది? 

PREV
14
స్టార్స్ ఇళ్ళకు బాంబ్ బెదిరింపులు

తమిళనాడులో సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, పాఠశాలలు, ప్రభుత్వ రంగ సంస్థలకు అజ్ఞాత వ్యక్తులు బాంబు బెదిరింపులు చేస్తున్నారు. సీఎం స్టాలిన్, విజయ్ దళపతి, రజినీకాంత్, ఇళయరాజా, త్రిష లాంటి ప్రముఖుల ఇళ్లకు బెదిరింపులు పెరిగాయి. తాజాగా ఈ కలకలం మళ్లీ స్టార్ట్ అయ్యింది. 

24
త్రిష, విశాల్ కు బెదిరింపులు

అజ్ఞాత వ్యక్తులు ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు చేస్తుండగా, వారిని పట్టుకోవడంలో పోలీసులు ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలోనే హీరోయిన్  త్రిష, స్టార్ హీరో  విశాల్, సీనియర్  దర్శకుడు మణిరత్నం ఇళ్లకు ఈరోజు( 04 నవంబర్) బాంబు బెదిరింపు వచ్చింది.

34
డీజీపీ ఆఫీసుకు బెదిరింపు మెయిల్

చెన్నైలోని త్రిష, విశాల్, మణిరత్నం ఇళ్లలో బాంబులు పెట్టామని, అవి కాసేపట్లో పేలుతాయని డీజీపీ ఆఫీసుకు ఓ అజ్ఞాత వ్యక్తి ఈమెయిల్ పంపాడు. దాంతో అలెర్ట్ అయిన  పోలీసులు బాంబ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేయగా, అది ఫేక్ అని తేలింది.

44
త్రిష ఇంటికి రెండు సార్లు

త్రిష ఇంటికి బాంబు బెదిరింపు రావడం ఇది రెండోసారి. బెదిరింపు ఈమెయిల్ ఐపీ అడ్రస్ పదేపదే మారుతుండటంతో, నిందితులను పట్టుకోవడం పోలీసులకు సవాల్ గా మారింది. ఇది వారికి పెద్ద తలనొప్పిగా తయారైంది. చెన్నైలోని ప్రముఖుల ఇళ్లకే ఇలా తరచూ బెదిరింపులు వస్తుండటంతో.. ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలని అభిమానులు కోరుతున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories