ప్రస్తుతం టాలీవుడ్ లో సీనియర్ హీరోల హవా నడుస్తోంది. 60 ఏళ్లు దాటిన స్టార్ హీరోలు వరుసగా సక్సెస్ లు సాధిస్తున్నారు. టాలీవుడ్ కు నాలుగు పిల్లర్స్ లా నిలిచిన చిరంజీవి, బాలయ్య, వెంకీ, నాగర్జున.. ఈ హీరోలలో ఎక్కువ రెమ్యునరేషన ఎవరు తీసుకుంటున్నారో తెలుసా?
టాలీవుడ్ లో 65 ఏళ్లు దాటిన సీనియర్ హీరోల హవా పెరిగిపోయింది. యంగ్ స్టార్స్ అంతా పాన్ ఇండియాను టార్గెట్ చేస్తూ.. సినిమాలు చేస్తుండటంతో.. సీనియర్ హీరోలు మాత్రం టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ.. హిట్లు కొడుతున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ లను తీసుకుని, యంగ్ డైరెక్టర్లతో.. అద్భుతమైన సినిమాలు చేస్తున్నారు పెద్ద హీరోలు. మరీ ముఖ్యంగా 70 ఏళ్ళ చిరంజీవితో పాటు 60 ఏళ్ళు దాటిన బాలయ్య, వెంకటేష్, నాగార్జున చేస్తోన్న సినిమాలేంటి. ప్రస్తుతం వారి రెమ్యునరేషన్ ఎంత ఉంది. సినిమాకు ఎక్కువ వసూలు చేస్తున్నది ఎవరు.?
26
టాప్ లో మెగాస్టార్ చిరంజీవి
పాన్ ఇండియా స్టార్స్ వందల కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుంటే.. టాలీవుడ్ సీనియర్ హీరోలు కూడా అందుకు తగ్గట్టుగానే వసూలు చేస్తున్నారు. సీనియర్ హీరోలైన చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ వంటి స్టార్స్ భారీ రేంజ్‌లో రెమ్యూనరేషన్ తీసుకుంటూ పోటీపడుతున్నారు. టాలీవుడ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి ఈ లిస్ట్ లో టాప్ లో ఉన్నారు. ఆయన ఒక సినిమాకు సుమారు 50 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఆమధ్య వరుస ఫెయిల్యూర్స్ చూసినా.. మెగా ఇమేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం మూడు సినిమాలు లైన్ లో పెట్టారు మెగాస్టార్.. విశ్వంభరతో రిలీజ్ కు రెడీగా ఉన్న చిరంజీవి.. అనిల్ రావిపూడితో మన శంకరవరప్రసాదు గారు సినిమాతో సంక్రాంతికి సందడి చేయబోతున్నారు. ఈసినిమాతో పాటు బాబీ డైరెక్షన్ లో మరో సినిమాకు రెడీ అయ్యాడు మెగాస్టార్. ఈసారి ఎలాగైన హిట్ కొట్టాలని పట్టుదలతో ఉన్నాడు.
36
డబుల్ హ్యాట్రిక్ దిశగా బాలయ్య..
వరుసగా నాలుగు విజయాలను సొంతం చేసుకున్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అదే ఊపును కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే హ్యాట్రిక్ హిట్ సాధించిన బాలయ్య.. డబుల్ హ్యాట్రిక్ కోసం గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడు. మాస్ జనాలు పూనకాలతో ఊగిపోయేలా.. అఖండ2 సినిమాతో సందడి చేయబోతున్నాడు నటసింహం. ఇక గోపీచంద్ మలినేనితో మరో మాస్ సినిమా చేయబోతున్నాడు. ఈరెండు సినిమాలు హిట్ అయితే.. బాలయ్య ఖాతాలు డబులు హ్యాట్రిక్ పడినట్టే. ఇలా వరుస విజయాలతో మంచి ఫామ్ లో ఉన్న బాలకృష్ణ 65 ఏళ్ళ వయసులో .. సినిమాకు 40 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.
బాలయ్య తరువాత వరుస విజయాలు సొంతం చేసుకుంటున్న మరో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న వెంకటేష్.. ఆచితూచి సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షలో ఓ సినిమా చేస్తున్నాడు వెంకీ.. వరుస విజయాలతో రెమ్యునరేషన్ పెంచిన వెంకీ.. 64 ఏళ్ళ వయసులో సినిమాకు 35 కోట్ల రూపాయలు తీసుకుంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
56
కింగ్ నాగార్జున 100వ సినిమా..
సీనియర్ హీరోలలో సక్సెస్ లేక ఇబ్బందిపడుతున్న హీరో కింగ్ నాగార్జున ఒక్కరే. ఆయన వరుస సినిమాలతో ఫెయిల్యూర్స్ చూస్తూ వస్తున్నాడు. దాంతో ఈమధ్య.. కుబేర, కూలీ లాంటి సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు. హిట్లు లేకపోయినా.. నాగార్జున ఇమేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. బిగ్ బాస్ లాంటి కార్యక్రమాలతో నాగ్ లైమ్ లైట్ లో ఉంటూ వస్తున్నాడు. ఇక నాగార్జున 66 ఏళ్లు వచ్చినా.. యంగ్ హీరోలు కూడా కుళ్లుకునేలా.. ఫిట్ నెస్ ను మెయింటేన్ చేస్తున్నాడు. ఇక నాగార్జున ప్రస్తుతం తన 100 సినిమాను సెట్స్ ఎక్కించబోతున్నారు. ఈసినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడు నాగార్జున. ఇక సినిమాకు ఆయన 30 కోట్ల రూపాయల వరకు తీసుకుంటున్నాడని సమాచారం.
66
పక్కా ప్లాన్ తో సీనియర్ హీరోలు
మొత్తానికి, సీనియర్ హీరోలు కూడా స్టార్ హీరోలకు ఏమాత్రం తీసిపోని రేంజ్‌లో తమ మార్కెట్‌ను కొనసాగిస్తున్నారు.ప్రస్తుతం వీరందరూ రెండు సినిమాల వరకూ కమిట్ అయ్యి సక్సెస్ సాధించడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. వెంకటేష్ , నాగార్జున ఎక్కువగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, కామెడీ జానర్ సినిమాలు చేస్తుంటే.. చిరంజీవి, బాలకృష్ణ మాత్రం మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకునే పనిలో ఉన్నారు