బాలీవుడ్‌లో భారీ బడ్జెట్ సినిమాలు ఫ్లాప్ అవ్వడం చూస్తుంటాం. కానీ ఒక సినిమా మాత్రం డిజాస్టర్ అనే పదానికే కొత్త అర్థం చెప్పింది. ఆ సినిమా ఏంటి? అందులో నటించిన హీరో, హీరోయిన్ ఎవరో ఇప్పుడు చూద్దాం.
బాలీవుడ్‌లో హిట్లు, ఫ్లాపులు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ 2023లో వచ్చిన 'ది లేడీ కిల్లర్' అనే సినిమా మాత్రం ఫ్లాప్ రికార్డులన్నింటినీ తిరగరాసింది. ఈ సినిమాలో నటించిన స్టార్ హీరో, హీరోయిన్లు ఇప్పటికీ ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నారు.
25
‘ది లేడీ కిల్లర్’ సూపర్ ఫ్లాప్ మూవీ
'ది లేడీ కిల్లర్' సినిమాను అజయ్ బహల్ డైరెక్ట్ చేశారు. ఇందులో అర్జున్ కపూర్, భూమి ఫెడ్నేకర్ హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాను ఏకంగా ₹45 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు. కానీ బాక్సాఫీస్ వద్ద కనీసం లక్ష రూపాయలు కూడా వసూలు చేయలేకపోయింది. ఈ సినిమా మొత్తం కలెక్షన్ కేవలం ₹60,000 మాత్రమే.
35
మొదటి రోజు అమ్మింది కేవలం 293 టికెట్లు
ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా కథ, ముగింపు సరిగా లేకపోవడంతో ప్రేక్షకులకు అస్సలు నచ్చలేదు. రిపోర్టుల ప్రకారం, సినిమా రిలీజైన మొదటి రోజు కేవలం 293 టికెట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. దీంతో తొలిరోజు కలెక్షన్ కేవలం ₹38,000 మాత్రమే వచ్చింది.
ఈ సినిమా ఇంత ఘోరంగా ఫెయిల్ అవ్వడానికి ప్రధాన కారణం దాని కథ, థియేటర్ రిలీజ్ విషయంలో చూపిన నిర్లక్ష్యమే అని చెబుతున్నారు. సరైన క్లైమాక్స్ లేకుండానే సినిమాను రిలీజ్ చేశారట. అంతేకాదు, థియేటర్లలో కేవలం 12 షోలు మాత్రమే ప్రదర్శించారు. మేకర్స్ కూడా థియేటర్ రిలీజ్ కంటే ఓటీటీపైనే ఎక్కువ దృష్టి పెట్టడం ఈ డిజాస్టర్‌కు కారణమైంది.
55
అర్జున్ కపూర్ ఫ్లాప్ సినిమాల లిస్ట్
'ది లేడీ కిల్లర్' మాత్రమే కాదు, అర్జున్ కపూర్ నటించిన 'ఔరంగజేబ్' (2013), 'తేవర్' (2015), 'నమస్తే ఇంగ్లాండ్' (2018), 'పానిపట్' (2019), 'కుత్తే' (2023) సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. 'ఫైండింగ్ ఫ్యానీ', 'ఇండియాస్ మోస్ట్ వాంటెడ్' కూడా పెద్దగా ఆడలేదు. అయితే, 'ఇషక్‌జాదే', '2 స్టేట్స్' లాంటి సినిమాలు అతని కెరీర్‌లో హిట్లుగా నిలిచాయి.