Anushka Shetty: అనుష్క పాత్ర వల్లే ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ ? అంతా అయిపోయాక క్లాసిక్ అంటూ ప్రశంసలు

Published : Apr 02, 2026, 04:03 PM IST

అనుష్క శెట్టి గతంలో టాలీవుడ్ లో స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. పాన్ ఇండియా హీరోయిన్ గా ఎదిగింది. అనుష్క నటించిన ఒక సినిమా ఆమె పాత్ర వల్లే ఫ్లాప్ అయింది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

PREV
15
Anushka Shetty

కొన్ని సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయినప్పుడు పూర్తిగా నిరాశ పరిచి ఆ తర్వాత టీవీల్లో, ఓటీటీల్లో, యూట్యూబ్ లో దూసుకుపోతుంటాయి. అలాంటి సినిమాలు టాలీవుడ్ లో చాలానే ఉన్నాయి. వాటిలో మహేష్ బాబు నటించిన నటించిన ఖలేజా ఒకటి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో అనుష్క శెట్టి హీరోయిన్ గా నటించింది.

25
కథలో అనేక మలుపులు

థియేటర్స్ లో రిలీజ్ అయినప్పుడు ఈ మూవీ ఏమాత్రం ఆకట్టుకోలేదు. కానీ ఆ తర్వాత టీవీల్లో మాత్రం జనాలు ఈ చిత్రాన్ని బాగా ఎంజాయ్ చేశారు. ఈ మూవీ కథలో అనేక మలుపులు ఉంటాయి. కాస్త కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. సినిమా అంతా బాగానే ఉన్నప్పటికీ ఎందుకు ఫ్లాప్ అయింది అనేది ఎవ్వరికీ అర్థం కాలేదు.

35
సీనియర్ రచయిత పరుచూరి గోపాల కృష్ణ

కన్ఫ్యూజన్, మహేష్ బాబు చేసిన కామెడీ, అనుష్క శెట్టి పాత్ర ఇలా పరాజయానికి రకరకాల కారణాలు చెప్పారు. సీనియర్ రచయిత పరుచూరి గోపాల కృష్ణ ఈ మూవీ గురించి మాట్లాడుతూ ఖలేజా ఫ్లాప్ కి అసలైన కారణం రివీల్ చేశారు. సినిమా అంతా బాగానే ఉన్నప్పుడు ఖలేజా చిత్రం ప్రేక్షకులని ఆకట్టుకోకపోవడానికి కారణం ఉంది.

45
సీరియస్ సన్నివేశంలో కూడా మహేష్ బాబు కామెడీ

సినిమా ప్రారంభమైనప్పుడు కథని టచ్ చేసి ఆ తర్వాత ఎక్కువ టైం రాజస్థాన్ ఏడారి సన్నివేశాలని చూపించారు అని పరుచూరి అన్నారు. చాలా సీరియస్ సన్నివేశంలో కూడా మహేష్ బాబు కామెడీ చేయడం కూడా మైనస్ అయింది. దీనివల్ల కథలో సీరియస్ నెస్ పోయింది. అదే విధంగా అనుష్క శెట్టి పాత్రని అవమానకరంగానే చూపిస్తూ వచ్చారు.

55
ఆమె ఐరెన్ లెగ్ అన్నట్లుగా

ఆమె ఐరెన్ లెగ్ అన్నట్లుగా చూపించారు. అలా చేస్తే ఫ్యామిలీ ఆడియన్స్ కి, మహిళలకు నచ్చదు. ఇలా చిన్న చిన్న లోపల సరిచేసుకుని ఉంటే ఖలేజా మూవీ హిట్ అయ్యేది అని పరుచూరి గోపాల కృష్ణ తెలిపారు.

Read more Photos on
click me!

Recommended Stories