టాలీవుడ్ పై బాలీవుడ్ దండయాత్ర, తెలుగులో ఒక్క ఛాన్స్ అంటున్న బీ టౌన్ తారలు

First Published | Sep 25, 2024, 9:08 AM IST

చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీలు  టాలీవుడ్‌లో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. కారణం ఏంటో తెలుసా..? 
 

ఇండియన్ సినిమాకు కీర్తి కిరీటంలా మారింది తెలుగు సినీ పరిశ్రమ. ఒకప్పుడు ఇండియాన్ సినిమా అంటే బాలీవుడ్ మాత్రమే కనిపించేది.  సౌత్ సినిమా అంటే తమిళ సినిమాకు మాత్రమే గుర్తింపు ఉండేది. ఈరెండు పరిశ్రమలు తెలుగు సినిమాకు తక్కువగా చూసేవారు. తెలుగు హీరోలను, తెలుగు నటులను లెక్క చేసేవారు కాదు.

నాగార్జున - సోనియా మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్... ?

కాని ఇప్పుడు అదే బాలీవుడ్ ను కిందకు నెట్టి.. ఇండియన్ సినిమా అంటే తెలుగు సినిమా అని హాలీవుడ్ లో కూడా అనిపించుకుంది టాలీవుడ్. దీనికి ప్రధాన కారణం రాజమౌళి, ఆయన తెరకెక్కించిన బాహుబలి. 

కమల్ హాసన్ ను కాదని చిరంజీవితో హిట్ సినిమా తీసిన తమిళ దర్శకుడు,



కోలీవుడ్ ఇలాంటి పాన్ ఇండియా చిత్రాలను అందించినప్పటికీ, టాలీవుడ్ అగ్రగామిగా ఉంది. బాహుబలి తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో పాన్ ఇండియా సినిమాలు ఎక్కువగా రిలీజ్  అవుతున్నాయి. మన తెలుగు హీరోలు పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటుతున్నారు. 

బాహుబలి ఇచ్చిన బలంతో.. ఆతరువాత సాహో,  ఆర్ఆర్ఆర్, పుష్ప, కల్కీ, లాంటి భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ అయ్యి సత్తా చాటాయి. ఇక త్వరలో గేమ్ ఛేంజర్, దేవర, పుష్ప2, తో పాటు మరికొన్ని పాన్ ఇండియా సినిమాలు సత్తా చాటడానికి రెడీ అవుతున్నాయి. 

ఎన్టీఆర్ - ఏఎన్నార్ లకు చుక్కలు చూపించిన నటుడు

ఇక ఈ పాన్ ఇండియా సినిమాల కోసం మన తెలుగు మేకర్స్.. హిందీ నుంచి స్టార్స్ ను హైయర్ చేసుకుంటున్నారు. తెలుగు భారీ బడ్జెట్ సినిమాల్లో బాలీవుడ్ తో పాటు, సౌత్ స్టార్స్ అంతా కనిపిస్తూ సందడి చేస్తున్నారు. ఈ సినిమాల విజయంలో వారి పాత్ర కూడా కాదనలేనిదని చెప్పాలి. 

తెలుగు సినీ పరిశ్రమ భారీ బడ్జెట్ సినిమాలకు ఫ్యాక్టరీగా తయారయ్యింది. దాంతో బాలీవుడ్ నుంచి స్టార్స్ టాలీవుడ్ పై దండయాత్ర స్టార్ట్ చేశారు. ఇక్కడ అవకాశాల కోసం వెంపర్లాడుతున్నారు. భారీ పారితోషికాలు కూడా అందుకుంటున్నారు. ఈమధ్య కాలంలో వచ్చిన  ఆర్‌ఆర్‌ఆర్ లో అజయ్ దేవగణ్, ఆలియా భట్ కూడా నటించిన విషయం తెలిసిందే, 

డేంజర్ జోన్ లో సోనియా.. బిగ్ బాస్ సపోర్ట్ లేకపోతే...?

అయితే ఈ సినిమాలో కేవలం 8 నిమిషాలు నటించినందుకు గాను  అజయ్‌ దేవగణ్‌కు 35 కోట్లు పారితోషికం తీసుకున్నాడట. అదేవిధంగా హీరోయిన్ గా తెరంగేట్రం చేసిన బాలీవుడ్ నటి అలియా భట్ భారీ పారితోషికం అందుకుంది. ఇలా సౌత్ సినిమాలకోసం బాలీవుడ్ స్టార్స్ ఎదరు చూస్తున్నారు. 

తెలుగు సినీ పరిశ్రమ కోట్లకు పడగలెత్తడంతో బాలీవుడ్ నటీనటులు టాలీవుడ్ వైపు దృష్టి సారించారు. ముఖ్యంగా సల్మాన్ ఖాన్, అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, సయీబ్ అలీఖాన్ వంటి పలువురు బాలీవుడ్ ప్రముఖులు టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. 

బిగ్ బాస్ అప్ డేట్స్ కోసం క్లిక్ చేయండి.

లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన చిరంజీవి సినిమా  గాడ్‌ఫాదర్‌లో సల్మాన్‌ ఖాన్‌ అతిధి పాత్రలో నటించారు. ఆదిపురుష్‌లో ప్రభాస్‌కి విలన్‌గా సైఫ్ అలీ ఖాన్ నటించాడు. అతను ప్రస్తుతం దేవర సినిమాలో ఎన్టీఆర్ కు విలన్ గా నటిస్తున్నాడు. 

ఇక  అక్షయ్ కుమార్  కూడా  ప్రస్తుతం  తెలుగు పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. మంచు విష్ణు తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ సినిమా కన్నప్పలో నటిస్తున్నారు.ఇలా చెప్పుకుంటూ వెళ్తే.. పుష్ప2, సలార్2, రాజా సాబ్,గేమ్ ఛేంజర్ లాంటి సినిమాల్లో బాలీవుడ్ స్టార్స్ మెరుపులు మెరిపించబోతున్నారు. 

టాలీవుడ్ అంటే కేవలం నటీనటులకే కాకుండా బాలీవుడ్ నటీమణులకు కూడా ఫేవరెట్ స్పాట్‌గా మారింది. నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తొలిసారి తెలుగులో హీరోయిన్ గా నటిస్తోంది. ఎన్టీఆర్ తో దేవర సినిమాల నటించింది బ్యూటీ.

 ఈ సినిమా కోసం దాదాపు రూ.5 కోట్ల వరకు పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. దేవర సెప్టెంబర్ 27న విడుదలవుతోంది.అంతే కాదు  శంకర్ దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ చిత్రంలో కూడా బాలీవుడ్ హీరోయిన్ నటించింది.

నటి కియారా అద్వానీ ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి రెండో సారి  అడుగుపెడుతోంది. డబుల్ ఇస్మార్ లో సంజయ్ దత్ నటించారు.. ఇలా బాలీవుడ్ తారలు టాలీవుడ్ పై దండెత్తారని చెప్పుకోవచ్చు. 

Latest Videos

click me!