దీపికాతో పాటు... 40 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న మరో స్టార్‌ హీరోయిన్‌....?

Published : Mar 05, 2024, 03:37 PM IST

రీసెంట్ గా తాను ప్రెగ్నెంట్ అని ప్రకటించింది దీపికా పదుకునే.. ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్న సందర్భంలో.. 40 ఏళ్ళ స్టార్ హీరోయిన్ కూడా ప్రెగ్నెంట్ తో ఉన్నట్టు తెలుస్తోంది. ఇంతకీ ఎవరు ఆ హీరోయిన్.   

PREV
18
దీపికాతో పాటు... 40 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న మరో స్టార్‌ హీరోయిన్‌....?
deepika padukone

బాలీవుడ్ ప్రేక్షకులకు.. ఫ్యాన్స్ కు తాజాగా గుడ్ న్యూస్  చెప్పింది హీరోయిన్ దీపికా పదుకునే.. తాను తల్లిని కాబోతున్నట్టు ప్రకటించింది., దాంతో అభిమానులు దిల్ ఖుష్ అవుతుండగా..మరో స్టార్ హీరోయిన్ కూడా గుడ్ న్యూస్ చెప్పడానికి రెడీ అయినట్టు తెలుస్తోంది. ఆమె కూడా ప్రగ్నెస్నీని ప్రకటించబో్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు..? 

28

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది కత్రీనా కైఫ్. టాలీవుడ్  వెంకటేష్ జోడీగా  ఫస్ట్ మూవీ చేసి.. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ..  ఆతరువాత వెంటనే..  బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి.. అక్కడ స్టార్ హీరోల సరసన మెరిసి..ఒక ఊపు ఊపేసింది. మరీ ముఖ్యంగా సల్మాన్ ఖాన్ తో కత్రీనా జోడీ.. సూపర్ హిట్ అయ్యింది. 
 

38

వరుస సినిమాలతో బాలీవుడ్ ను అలరించిన కత్రీనా కైఫ్ .. స్టార్ హీరోల పక్కన నటించడంతో పాటు.. స్టార్ ఇమేజ్ కూడా సాధించింది. లక్షల మంది అభిమానులు సొంతం చేసుకుంది బ్యూటీ. ఇక బాలీవుడ్ లో ఆమెపై చాలా ప్రేమ కథలు నడిచాయి. చివరికి యంగ్ హీరో.. తనకంటే ఐదేళ్లు చిన్నవాడైన విక్కీ కౌశల్ ను ప్రేమించి పెళ్ళాడింది బ్యూటీ. 

48

సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాను కూడా తన హాట్ ఫోటోలతో బ్లాస్ట్ చేస్తూ.. కుర్రాళ్ల  హృదయాలను కరించేస్తోంది.  బికినీ ఫోటోలతో కత్రీనా కత్తిలాంటి అందాలు.. నెటిజన్లకు నిద్ర లేకుండా చేశాయి.ఆమె ఫాలోయింగ్ పెరగడంలో.. హట్ ఫోటోషూట్ల పాత్ర చాలా ఉంది. 
 

58

దీపికా పడుకొనే త్వరలో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నది. తాను గర్భవతిననే శుభవార్తను సోషల్‌ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో పంచుకుంది. ఆమధ్య బాలీవుడ్ హీరోయిన్  అనుష్క శర్మ కూడా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇక ఇప్పుడు మరో టాప్‌ హీరోయిన్‌ కత్రినా కైఫ్‌ కూడా తల్లి కాబోతున్నట్టు న్యూస్ హల్ చల్ చేస్తోంది. 

68

రీసెంట్ గా  ముఖేశ్‌ అంబానీ కుమారుడు అనంత్‌ అంబానీ  ప్రీ వెడ్డింగ్‌ లో సందడి చేశారు కత్రీనా కైఫ్ కపుల్స్. ఈ వేడుక గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో జరిగగా...ఆ వేడుకలకు కత్రినా కైఫ్‌- విక్కీ కౌశల్‌ దంపతులు హాజరయ్యారు. అయితే అక్కడ ఆమె తన కడుపును దుపట్టాతో పదే పదే దాచుకోవడం కనిపించింది. దాంతో ఆమె కూడా ప్రగ్నెంట్ తో ఉందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. 
 

78

అయితే గతంలో కూడా ఈ వార్తలు వచ్చాయి. అయోధ్య రామాలయ ప్రతిష్ట టైమ్ లో కూడా ఇలానే ప్రచారం జరిగింది. ప్రస్తుతం ఆ దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. విక్కీ కౌశల్‌, కత్రినా కైఫ్‌ పెళ్ళి 2021, డిసెంబర్‌లో జరిగింది. పెళ్ళి తరువాత కూడా కత్రీనా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది. అటు సోషల్ మీడియాలో కూడా హడావిడి చేస్తోంది.  
 

88

మూడేళ్ల తర్వాత వారిద్దరు తల్లిదండ్రులు కాబోతున్నారన్నమాట! అయితే ఈ వార్త నిజమో కాదో తెలియాలంటే ఇద్దరిలో ఎవరో ఒకరు స్పందించాల్సి ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories