అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్, రణ్‌వీర్ సింగ్, షాహిద్ కపూర్, రణ్‌బీర్ కపూర్, దీపికా పదుకొనె, అలియాభట్, కరీనా కపూర్ ఇలా అనేక సెలబ్రిటీలు పాల్గొన్నారు. ఆల్మోస్ట్ బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం హాజరయ్యింది. ఇక తెలుగు నుంచి కేవలం రామ్ చరణ్ ఫ్యామిలీ మాత్రమే హాజరయ్యింది. చరణ్, ఉపాసన పాల్గొన్నారు. ధోనీ వంటి క్రికెటర్లు కూడా ఇందులో పాల్గొని సందడి చేయడం విశేషం. దాదాపు మూడు రోజులపాటు వీళ్లు సందడి చేశారు.