ఆ ఆకు తెస్తేనే షూటింగ్ అన్న డైరెక్టర్ బాపు, రెండు కార్లలో సిటీ మొత్తం జల్లెడ... చివర్లో ట్విస్ట్ ఏంటంటే?

First Published Apr 18, 2024, 9:21 AM IST

బాపు-రమణల కాంబినేషన్ లో వచ్చిన అద్భుత చిత్రం పెళ్లి పుస్తకం. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన పెళ్లి పుస్తకం చిత్ర  షూటింగ్ ఒక చిన్న ఆకు కోసం ఆగిపోయిందట. ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ తెలిస్తే మీరు నోరెళ్లబెడతారు. 
 

1991లో విడుదలైన పెళ్లి పుస్తకం టాలీవుడ్ క్లాసిక్స్ లో ఒకటిగా ఉంది. బాపు-రమణల కాంబోలో వచ్చిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్. రాజేంద్ర ప్రసాద్-దివ్య వాణి జంటగా నటించారు. ఈ మూవీ ఆద్యంతం ప్రేక్షకులను అలరిస్తుంది. 

ఎన్టీఆర్-సావిత్రి-ఏఎన్నార్ నటించిన  క్లాసిక్ మిస్సమ్మ చిత్రానికి పెళ్లి పుస్తకం దగ్గరగా ఉంటుంది. ఎన్టీఆర్-సావిత్రి మిస్సమ్మ మూవీలో ఉద్యోగం కోసం భార్య భర్తలుగా నటిస్తారు. పెళ్లి పుస్తకం మూవీలో భార్య భర్తలు అయిన రాజేంద్ర ప్రసాద్-దివ్య వాణి పెళ్లి పుస్తకం మూవీలో ఉద్యోగం కోసం పరిచయం లేని వ్యక్తులుగా ఒకే ఆఫీస్ లో నటిస్తూ పని చేస్తారు. 
 


ఆ ఒక్క పోలిక మినహాయిస్తే సన్నివేశాలు, కథనం అంతా భిన్నంగా రాసుకున్నారు. పెళ్లి పుస్తకం చిత్రానికి కేవీ మహదేవన్ సంగీతం అందించారు. ఈ చిత్రంలోని ''శ్రీరస్తు శుభమస్తు'' సాంగ్ ఇప్పటికీ పెళ్లి వేడుకల్లో, వీడియోల్లో వినిపిస్తుంది. అంతగా ఫేమస్ అయ్యింది ఈ పాట. 
 


పెళ్లి పుస్తకం మూవీ షూటింగ్ సమయంలో ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుందట. నటులు సాక్షి రంగారావు, రాధా కుమారి బాదం ఆకు విస్తరిలో ఇడ్లీలు తింటున్నట్లు రమణ స్క్రిప్ట్ లో రాశాడట. బాపు ప్రొడక్షన్ వాళ్లకు ముందు రోజే బాదం ఆకు ఇస్తర్లు కావాలని చెప్పాడట. 
 


మరుసటి రోజు ఉదయాన్నే షూటింగ్ మొదలైందట. ప్రొడక్షన్ వాళ్ళు బాదం ఆకు ఇస్తర్లకు బదులు మరేవో తెచ్చారట. అడిగింది బాదం ఆకు ఇస్తర్లు కదా అని బాపు ప్రొడక్షన్ వాళ్ళ మీద సీరియస్ అయ్యాడట. దొరకలేదని వారు సమాధానం చెప్పారట. ఇంత పెద్ద హైదరాబాద్ లో బాదం ఆకులు దొరకకపోవడం ఏమిటని... రెండు కార్లలో వెతకడానికి బయలు దేరారట. 
 

చివరికి చిక్కడపల్లిలో ఒకరి ఇంట్లో బాదం చెట్టు కనిపించడంతో ఆకులు తెచ్చి ఇస్తర్లుగా కుట్టారట. అప్పటికి మధ్యాహ్నం అయిపోయిందట. ఇడ్లీలు చల్లారి పోవడంతో మళ్ళీ వేడిగా తెప్పించి షూటింగ్ చేశారట. ఆ చిత్రానికి నిర్మాతలు వారే కావడంతో చిన్న ఆకు వద్ద కాంప్రమైజ్ కాలేదు. 
 

ఇంత చేస్తే... ఆ సీన్ ఎడిటింగ్ లో లేపేశారట. నిజానికి ఇడ్లీ ఏ ఆకులో తిన్నారు అనేది ప్రేక్షకులకు అనవసరం. అందులోనూ ఆ ఆకుతో కథ ముడిపడి కూడా లేదు. ప్లేట్ లో పెట్టి సీన్ లాగించేసినా ఓకే. అయితే ఆ కాలం దర్శకుల నిబద్ధతకు ఇది నిదర్శనం. స్క్రిప్ట్ ని గట్టిగా ఫాలో అవ్వాలని చెప్పడానికి ఒక ఉదాహరణ. 
 

click me!